...
...
Next Story

అందుబాటులోకి విజయవాడ వెస్ట్ బైపాస్‌.. ఇటువైపు వెళ్లేవారు తప్పక చదవాలి!

విజయవాడ వెస్ట్ బైపాస్‌ అందుబాటులోకి వచ్చింది. దీంతో గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనదారులు విజయవాడలోకి వెళ్లకుండానే ఏలూరు, గుంటూరు వెళ్లవచ్చు.

Published on: Jan 15, 2026, 15:51:29 IST
Advertisement

సంక్రాంతిని సందర్భంగా విజయవాడ వెస్ట్ బైపాస్‌ను అందుబాటులోకి తెచ్చారు అధికారులు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలంలోని కాజా నుంచి కృష్ణా జిల్లాలోని పెదఅవుటపల్లికి వరకు నిర్మించిన విజయవాడ పశ్చిమ బైపాస్‌ను నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులు ప్రారంభించారు. కొత్తగా పూర్తయిన రహదారిని ఒక వైపు ప్రారంభించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రారంభోత్సవ వేడుకల సందర్భంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులు పూజలు నిర్వహించారు. మెుదట NHAI అధికారుల వాహనాలు మాత్రమే బైపాస్‌ మీద నుంచి పంపించారు. ఆ తర్వాత ఇతర వాహనాలు కూడా అనుమతించారు.

మార్చి నాటికి మరోవైపు కూడా మార్గాన్ని తెరుస్తామని అధికారులు ప్రకటించారు. గుంటూరు వైపు నుండి వచ్చే వాహనాలు నేరుగా రాజధానికి చేరుకోవడానికి ఏర్పాట్లు చేసినట్లు కూడా ధృవీకరించారు. మొత్తం రోడ్డు పూర్తిగా పనిచేసిన తర్వాతే వెంకటపాలెం వద్ద టోల్ ఫీజులు వసూలు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

చెన్నై, గుంటూరు వెపు నుంచి వస్తున్న వాహనాలు కాజా టోల్‌గేట్ దాటాక వెస్ట్ బైపాస్‌లోకి రావాలి. గొల్లపూడి మీదుగా చిన్నఅవుటపల్లి దాకా వెళ్లాలి. అక్కడ ఏలూరువైపు జాతీయ రహదారిలోకి చేరుకుని వెళ్లవచ్చు. కాజా టోల్‌గేట్ నుంచి వచ్చే వాహనాలు ఏలూరువైపుగా నేరుగా వెళ్లవచ్చు. మరో విషయం ఏంటంటే.. గుంటూరు నుంచి వచ్చే వాహనాలు.. ఈ బైపాస్‌లో గొల్లపూడి దగ్గర విజయవాడ-హైదరాబాద్ హైవేలోకి చేరుకోవచ్చు. అలా హైదరాబాద్‌ వైపునకు వెళ్లవచ్చు. ఇలా చేస్తే.. గుంటూరు నుంచి వచ్చే వెహికల్స్ విజయవాడ సిటీలోకి ఎంట్రీ అవ్వకుండానే ఏలూరు, హైదరాబాద్‌కు వెళ్లవచ్చు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe