...
...
Next Story

Railway Alert : ఎక్స్‌ప్రెస్‌గా సూపర్‌ఫాస్ట్ రైలు.. కొన్ని ట్రైన్ నంబర్లు మార్పు!

Railway Alert : సౌత్ కోస్ట్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయాణించే రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. రాబోయే కొత్త టైమ్‌టేబుల్ సవరణలు, రైళ్లలో మార్పుల్లో భాగంగా పలు రైళ్ల నంబర్లు, కేటగిరీలలో రైల్వే శాఖ కీలక మార్పులు చేసింది.

Published on: Nov 9, 2026, 21:44:35 IST
Advertisement

ఇప్పటివరకు సూపర్ ఫాస్ట్ కేటగిరీలో నడిచిన పలు రైళ్లను నాన్-సూపర్ ఫాస్ట్/సాధారణ ఎక్స్‌ప్రెస్ కేటగిరీలోకి మారుస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పులు 2027 జనవరి 1 నుండి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికను సిద్ధం చేసుకునే ముందు కొత్త ట్రైన్ నంబర్లను కూడా సరిచూసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.

ప్రతీకాత్మక చిత్రం (image source Pixel)
ప్రతీకాత్మక చిత్రం (image source Pixel)

దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో మారిన రైళ్ల వివరాలు అధికారులు వెల్లడించారు. 120807 (విశాఖపట్నం - అమృత్‌సర్) సూపర్‌ఫాస్ట్... 2027 జనవరి 1 నుంచి 18513 నెంబర్‌తో ఎక్స్‌ప్రెస్‌గా నడుస్తుంది. అలాగే 20808 (అమృత్‌సర్ - విశాఖపట్నం) రైలు.. 18514 నెంబర్‌తోపాటు ఎక్స్‌ప్రెస్‌మారింది.

22875 (విశాఖపట్నం - గుంటూరు) ఉదయ్ ఎక్స్‌ప్రెస్.. 18531 నెంబర్‌లో మారుతుంది. 22876(గుంటూరు - విశాఖపట్నం) ఉదయ్ ఎక్స్‌ప్రెస్ 18532 ఎక్స్‌ప్రెస్‌గా అవుతుంది. 12787(నరసాపూర్ - నాగర్‌సోల్) ఎక్స్‌ప్రెస్.. 17241గా, 12788(నాగర్‌సోల్ - నరసాపూర్) ఎక్స్‌ప్రెస్ 17242 నెంబర్‌లో మారుతుంది. 12747 (గుంటూరు - వికారాబాద్) ఎక్స్‌ప్రెస్.. 17349గా మారనుంది. 12748(వికారాబాద్ - గుంటూరు) ఎక్స్‌ప్రెస్.. 17350గా అవుతుంది.

12789 (కాచిగూడ - కుమ్టా) ఎక్స్‌ప్రెస్ 17689 నెంబర్‌గా, 12790 (కుమ్టా - కాచిగూడ) ఎక్స్‌ప్రెస్ 17690గా, 15673 (చర్లపల్లి - కామాఖ్య) ఎక్స్‌ప్రెస్ 17083 నెంబర్‌కి, 15674 (కామాఖ్య - చర్లపల్లి) ఎక్స్‌ప్రెస్.. 17084 నెంబర్‌ ట్రైన్‌గా మారనుంది. ఈ కొత్త ట్రైన్ నెంబర్లు జనవరి 2027 నుంచి అమలులోకి వస్తాయని రైల్వే శాఖ ప్రకటించింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks