విశాఖ-భోగాపురం కోస్టల్ కారిడార్‌.. ఇది కంప్లీట్‌ అయితే నిమిషాల్లోనే అద్భుతమైన జర్నీ!

భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఈ ఏడాది జూన్‌లో ప్రారంభం అవుతుందని ప్రచారం అవుతోంది. దీంతో మరోసారి విశాఖ-భోగాపురం కోస్టల్ కారిడార్‌పై ఆశలు పెరిగాయి. ఈ కారిడార్ పూర్తైతే ప్రయాణం అద్భుతంగా ఉంటుంది.

Published on: Feb 17, 2026, 16:49:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విశాఖపట్నం నుంచి రుషికొండ, భీమిలి మీదుగా భోగాపురం దాకా బీచ్‌ కారిడార్‌ నిర్మించాలనే ప్రతిపాదన చాలా రోజులుగా ఉంది. 55-60 కిలో మీటర్ల విశాఖపట్నం-భోగాపురం కోస్టల్ కారిడార్(VBCC) పూర్తి చేస్తే విశాఖపట్నం ముఖచిత్రాన్ని మారుస్తుంది. ఈ ప్రాజెక్ట్ భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి భవిష్యత్తు ప్రవేశ ద్వారం అని చెప్పవచ్చు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ జూన్ 2026లో ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI), విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (VMRDA) ప్రాజెక్ట్ బ్లూప్రింట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నాయి. ఈ రహదారి స్థానికుల జీవితానికి లేదా వ్యాపారాలకు అంతరాయం కలిగించకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రణాళికలో ఇప్పటికే ఉన్న రిసార్ట్‌లు, హోటళ్లను రక్షించడానికి రుషికొండ(రాడిసన్ బ్లూ జంక్షన్) సమీపంలో 1-కిలో మీటర్ల ఎలివేటెడ్ ఫ్లైఓవర్, అగనంపూడి, కొమ్మాది వంటి రద్దీ ప్రాంతాల నుంచి తప్పించుకోవడానికి నాలుగు ఎలివేటెడ్ కారిడార్లు వంటి అనేక ప్లాన్స్ ఉన్నాయి. భీమిలి, భోగాపురం మధ్య తీరం వెంబడి 19.66 కి.మీ. కొత్త గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ నిర్మిస్తారు. తద్వారా మార్గం సాధ్యమైనంత సరళంగా, అద్భుతంగా ఉంటుంది.

ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఫీడ్‌బ్యాక్ దశలో ఉంది. ఫిబ్రవరి 15 నాటికి విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీకి 736 అభ్యంతరాలు వచ్చాయి. వీటిలో ఎక్కువగా భీమిలి-భోగాపురం మధ్య ఉన్న ప్రాంతానికి సంబంధించినవి. అభ్యంతరాలను సమర్పించడానికి మార్చి 10 చివరి తేదీగా నిర్ణయించారు.

నేషనల్ హైవేస్ అథారిటీ ఆప్ ఇండియా రోడ్డును నిర్మిస్తుంది. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి వీఎంఆర్డీఏ స్పష్టమైన ప్రణాళికను రూపొందించడంపై దృష్టి సారిస్తుంది. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ కోసం నివేదికను ఖరారు చేయడానికి విశాఖపట్నం, విజయనగరం జిల్లా కలెక్టర్లతో ఉన్నత స్థాయి సమావేశం త్వరలో జరపనుంది ఎన్‌హెచ్ఏఐ.

విశాఖ పోర్టు నుంచి కైలాసగిరి వరకు ప్రస్తుతం ఉన్న 30 మీటర్ల రహదారిని 40 మీటర్లుగా విస్తరణ చేస్తారు. ఇక అక్కడ నుంచే భోగాపురం వరకు రహదారిని 60 మీటర్ల వెడల్పున చేస్తారు. అంతేకాదు ఈ మార్గంలో కొన్నిచోట్ల ఎలివేటెడ్‌ కారిడార్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలా విశాఖ-భోగాపురం కోస్టల్ కారిడార్ ప్రయాణం అద్భుతం కానుంది.

ప్రశ్న : ఈ ప్రాజెక్టుతో లాభాలు ఏంటి?

జవాబు : ఈ ప్రాజెక్టుతో పూర్తైతే.. ప్రయాణ సమయం విశాఖ నుండి భోగాపురం విమానాశ్రయానికి 40 నుంచి 45 నిమిషాల పడుతుంది. ట్రాఫిక్‌ ఇబ్బంది ఉండదు. మధురవాడ ఐటీ హబ్, రాబోయే 'ఏరో సిటీ'కి ప్రత్యక్ష లింకులు ఉంటాయి. పర్యాటకపరంగానూ అభివద్ధి చెందుతుంది. వారసత్వ ప్రదేశాలు, లగ్జరీ రిసార్ట్‌లు, బీచ్ సైడ్ హోటళ్లకు డిమాండ్ పెరుగుతుంది.

ప్రశ్న : ఈ కారిడార్ పొడవు, ఖర్చు అంచనా ఎంత?

జవాబు : మొత్తం పొడవు సుమారు 55 కిలో మీటర్ల నుంచి 60 కిలో మీటర్ల మధ్య ఉంటుంది. అంచనా వ్యయం రూ.6,300 కోట్లు ఉంటుంది. ఇందులో భూ సేకరణకు రూ.4,300 కోట్లు. విశాఖ పోర్టుకు చెందిన కంటెయినర్‌ టెర్మినల్‌ నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు ఆరు వరుసల్లో కోస్టల్ కారిడార్‌ వేస్తారు. అయితే ఈ ప్రాజెక్టులో రాష్ట్రం వాటా, కేంద్రం వాటా గురించి తెలియాల్సి ఉంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More