...
...
Next Story

విశాఖపట్నం-విజయవాడ కొత్తగా ఆర్టీసీ నైట్ రైడర్ స్లీపర్ బస్సు.. టైమింగ్, టికెట్ ప్రైజ్, బోర్డింగ్ పాయింట్స్

విశాఖపట్నం నుంచి విజయవాడకు ప్రయాణం ఉందా? అయితే కొత్తగా ఏపీఎస్ఆర్టీసీ నైట్ రైడర్ స్లీపర్ బస్సును ప్రవేశపెట్టింది. దీని టైమింగ్, టికెట్ ప్రైజ్, బోర్డింగ్ పాయింట్స్ ఏంటో తెలుసుకోండి.

Published on: Feb 22, 2026, 15:12:41 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(APSRTC) ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను ప్రవేశపెడుతోంది. అందులో భాగంగా విశాఖపట్నం డిపో నుంచి ప్రయాణికుల సౌలభ్యం కోసం కొత్త బస్సును అందుబాటులోకి తీసుకువచ్చింది. విశాఖపట్నం నుండి విజయవాడకు కొత్త నైట్ రైడర్ ఏసీ సీటర్ కమ్ స్లీపర్ బస్సు సర్వీసును ప్రారంభించింది. విశాఖపట్నం ప్రాంతీయ మేనేజర్ అప్పల నాయుడు కొత్త సర్వీస్ గురించి తెలిపారు.

ఏపీఎస్ఆర్టీసీ నైట్ రైడర్ స్లీపర్ బస్సు (X)
ఏపీఎస్ఆర్టీసీ నైట్ రైడర్ స్లీపర్ బస్సు (X)

విశాఖపట్నం నుంచి రాత్రిపూట స్లీపర్ బస్సులో ప్రయాణించాలనుకునే ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ నైట్ రైడర్ స్లీపర్ బస్సు సర్వీస్‌ను ప్రారంభించిందని అప్పలనాయుడు అన్నారు. నైట్ రైడర్ సర్వీస్ ప్రతిరోజూ రాత్రి 9:30 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరుతుంది.

అనుభవజ్ఞులైన డ్రైవర్లు వాహనాలను నడుపుతారని, ఒత్తిడి లేకుండా, సురక్షితంగా ప్రయాణం ఉండేలా చూస్తారని మేనేజర్ హామీ ఇచ్చారు. apsrtconline.in ద్వారా ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యం కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉంది. రూ.825 టికెట్ ధరగా నిర్ణయించారు.

బోర్డింగ్ పాయింట్స్

  • 21:30 విశాఖపట్నం
  • 21:35 గురుద్వారా జంక్షన్
  • 21:37 గురుద్వారా జంక్షన్
  • 21:40 మురళీనగర్ జంక్షన్ విశాఖపట్నం
  • 21:50 ఎన్ఏడి ఎక్స్ రోడ్
  • 22:10 ఓల్డ్ గాజువాక
  • 22:15 కూర్మన్నపాలెం
  • 22:25 లంకెలపాలెం

ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 దృష్ట్యా విశాఖపట్నంలో అనేక గమ్యస్థానాలకు వెళ్లే ఏసీ బస్సుల సమయాన్ని మార్చినట్లు మేనేజర్ అప్పలనాయుడు పేర్కొన్నారు. నౌకాదళ కార్యక్రమాల సందర్భంగా ఆర్కే బీచ్, బస్ కాంప్లెక్స్ నుండి నగరంలోని అనేక గమ్యస్థానాలకు ప్రత్యేక బస్సులు సర్వీసులో ఉన్నాయి.

బాపట్ల టూ తెనాలికి బస్సు సర్వీసు

బాపట్ల నుంచి తెనాలికి నూతన బస్సు సర్వీసు ప్రారంభమైంది. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు కొత్త సర్వీసును ప్రారంభించినట్టుగా డిపో మేనేజర్ సింహాద్రి వెల్లడించారు. బాపట్లలో ఉదయం 6.15 గంటలకు బస్సు ప్రారంభం అవుతుంది. అప్పికట్ల, పొన్నూరు, పచ్చలతాడిపర్రు, తొట్టెంపూడి, మామిళ్లపల్లి, మోదుకూరు, చుండూరు, వేటపాలెం, పెనుకుదురుపాడు, వలివేరు, యడ్లపల్లి, అంగలకుదురు మీదుగా తెనాలికి 8.15 గంటలకు చేరుకుుంటుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe