Krishna River Flood Updates : తెలుగు రాష్ట్రాల జీవనాడి కృష్ణమ్మ మళ్లీ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి నిలకడగా వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం జలాశయం నిండు కుండను తలపిస్తోంది. రోజురోజుకూ ఇన్ ఫ్లో గణనీయంగా పెరుగుతుండటంతో ప్రాజెక్టు పరిధిలో సర్వత్రా జలకళ తొణికిసలాడుతోంది.
శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి….
శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, తాజాగా అందిన అధికారిక సమాచారం(ఆగస్ట్ 8, ఉదయం 9.30 గంటల రిపోర్ట్) ప్రకారం నీటి నిల్వ ఇప్పటికే 155.265 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా…. ప్రస్తుతం నీటిమట్టం 873.199 అడుగుల వద్ద కొనసాగుతోంది.
ఎగువ ప్రాజెక్టుల నుంచి ప్రస్తుతం శ్రీశైలానికి ఏకంగా 2,02,355 క్యూసెక్కుల మేర భారీ ఇన్ ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు దిగువ ప్రాంతాలకు 8,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో ప్రస్తుతం రోజుకు సగటున 18 నుంచి 20 టీఎంసీల వరకు నీటి నిల్వ పెరుగుతున్నట్లు లెక్కలు సూచిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న ఈ భారీ వరద ఉధృతి మరో మూడు, నాలుగు రోజుల పాటు ఇలాగే కొనసాగితే…. అధికారులు రేడియల్ క్రెస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
నాగార్జునసాగర్ వైపు కృష్ణమ్మ…
మరోవైపు శ్రీశైలం నుంచి వస్తున్న ప్రవాహంతో పాటు క్యాచ్‌మెంట్ ఏరియా నుంచి వస్తున్న వరదతో నాగార్జునసాగర్ జలాశయానికి సైతం నీటి చేరుక క్రమంగా పెరుగుతోంది. నాగార్జునసాగర్ మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312.050 టీఎంసీలు కాగా…. ప్రస్తుతం ప్రాజెక్టులో 140.845 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా…. ప్రస్తుతం నీటిమట్టం 515.299 అడుగుల వద్ద ఉంది.
ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయానికి 49,983 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదు కాగా, దిగువకు 900 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలం గేట్లు ఎత్తితే నాగార్జునసాగర్‌కు భారీగా వరద నీరు అవకాశం ఉండటంతో ఉభయ తెలుగు రాష్ట్రాల రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
{{/usCountry}}ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయానికి 49,983 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదు కాగా, దిగువకు 900 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలం గేట్లు ఎత్తితే నాగార్జునసాగర్‌కు భారీగా వరద నీరు అవకాశం ఉండటంతో ఉభయ తెలుగు రాష్ట్రాల రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
{{/usCountry}}ఇక ఎల్ నినో ప్రభావంతో ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన వర్షాలు మాత్రం లేవు. ఎగువ నుంచి వస్తున్న వరద నీరే ఆశాజనకంగా మారింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు… నీటి సమస్యలు రాకుండా ముందస్తు కార్యాచరణను సిద్ధం చేసుకున్నాయి. ప్రాజెక్టుల్లో ఉన్న ప్రస్తుత నీటిని సాగుతో పాటు తాగు నీటి అవసరాలకు ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపై కసరత్తు షురూ చేశాయి. పొదుపుగా నీటిని వినియోగించుకోవటం ఫోకస్ చేస్తున్నాయి.
రాబోయే రోజుల్లో భారీగా వర్షాలు కురిసి…. రాష్ట్రంలోని చిన్న, పెద్ద ప్రాజెక్టులు నిండుకుండలా మారితే… సాగు రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకపోవచ్చు. కానీ అలాకాకుండా సాధారణం కంటే కూడా తక్కువ వర్షపాతం నమోదైతే…. ప్రత్యామ్నాయ పంటలు వేయటమే మంచిదని వ్యవసాయశాఖ సూచిస్తోంది.