ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ తీవ్ర వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డీఎస్సీలో అర్హులకు తీవ్ర అన్యాయం జరిగిందని, స్పోర్ట్స్ కోటా పేరుతో బ్యాక్‌డోర్ అపాయింట్‌మెంట్లు ఇచ్చారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ డీఎస్సీకి సంబంధించిన ఆధారాలను, వివాదాస్పద జీవోల చిట్టాపై మాట్లాడారు. క్రీడా కోటా ఉద్యోగాల కేటాయింపును పూర్తిగా దళారీ వ్యవస్థగా మార్చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు. జూడో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా మంత్రి లోకేష్ తోడల్లుడు భరత్, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా టీడీపీ నేత కూన రవికుమార్ ఉన్నారని.. వీరే నకిలీ సర్టిఫికెట్లు ఇస్తూ తమ సొంత వాళ్లకు ఉద్యోగాలు కట్టబెడుతున్నారని మండిపడ్డారు.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాయాల్సిన అవసరం లేదంటూ జీవో నంబర్ 74 తీసుకువచ్చారని జగన్ అన్నారు. కొన్ని సబ్జెక్ట్ టీచర్ పోస్టులకు కనీసం డిగ్రీ కూడా అక్కర్లేదని, ఉద్యోగం వచ్చిన ఐదేళ్లలో పాస్ అయితే సరిపోతుందని నిబంధనలు మార్చారన్నారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ సాధించిన నిజమైన క్రీడాకారులను పక్కనబెట్టి.. కేవలం ఆటల్లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్లు ఉన్నవారికి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు.
జాతీయ మెడలిస్ట్ అయిన దుర్గయ్య అనే అభ్యర్థిని వైఎస్ జగన్ మీడియా ముందుకు తీసుకువచ్చారు. 1:1 రేషియోలో కాల్ లెటర్ వచ్చి, అన్ని సర్టిఫికెట్లు సరిగ్గా ఉన్నా దుర్గయ్యకు ఉద్యోగం ఇవ్వకుండా.. టీడీపీ నేతలు ఇచ్చిన సర్టిఫికెట్లు ఉన్నవారికే పోస్టులు కేటాయించారని జగన్ దుయ్యబట్టారు. తమ అనుకూల వ్యక్తుల కోసం జీవో 4, 47 తెచ్చి, ఆ తర్వాత జీవోలు 23, 25, 26లతో ఇతరులకు గేట్లు మూసేశారని విమర్శించారు.
చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ అంతా లీకుల మయమని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. 1995 నుంచి అలాగే ఉందని చెప్పారు. గతంలో జరిగిన పేపర్ లీకేజీల రికార్డును చదివి వినిపించారు. ఈ లీకేజీలను ప్రశ్నిస్తే చంద్రబాబుకు బీపీ వస్తోందని, అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని జగన్ మండిపడ్డారు.
{{/usCountry}}చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ అంతా లీకుల మయమని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. 1995 నుంచి అలాగే ఉందని చెప్పారు. గతంలో జరిగిన పేపర్ లీకేజీల రికార్డును చదివి వినిపించారు. ఈ లీకేజీలను ప్రశ్నిస్తే చంద్రబాబుకు బీపీ వస్తోందని, అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని జగన్ మండిపడ్డారు.
{{/usCountry}}'చంద్రబాబు గారూ.. ఇది జెన్-జీ (Gen-Z), జెన్-ఆల్ఫా (Gen-Alpha) కాలం. సోషల్ మీడియా యుగంలో నిజాలను మీరేం చేసినా దాచలేరు. అణచివేసే కొద్దీ యువత తిరగబడుతుంది. తప్పులు చేసి కూడా ఒప్పుకోకుండా ఇబ్బందులు పెడితే కాక్రోచ్‌లు లేస్తాయి. త్వరలోనే ఏపీలో కూడా కాక్రోచ్‌లు బయటకు వస్తాయి.. జాగ్రత్త. ఆంధ్రప్రదేశ్‌లో మేం కూడా కాక్రోచ్‌లమే.' అని హెచ్చరించారు.
విద్యాశాఖ మంత్రిగా సాక్షాత్తూ చంద్రబాబు కుమారుడు లోకేష్ ఉన్నందున ఈ డీఎస్సీ కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపదని, అందుకే తాము సీబీఐ దర్యాప్తు కోరుతున్నామని జగన్ స్పష్టం చేశారు. కేంద్ర సంస్థలతో లోతుగా విచారణ జరిపిస్తే మరిన్ని దారుణాలు వెలుగులోకి వస్తాయన్నారు. డీఎస్సీ అభ్యర్థులకు వైఎస్ జగన్ ఒక కీలక హామీ ఇచ్చారు. తాము బాధితుల తరఫున న్యాయపోరాటం చేస్తామని.. ఒకవేళ ఈ ప్రభుత్వం న్యాయం చేయకపోతే, రాబోయే రోజుల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ప్రత్యేక కమిషన్ వేసి, రీ-వెరిఫికేషన్ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు ఇస్తామని, తప్పు చేసిన వారిని జైలుకు పంపుతామని భరోసా ఇచ్చారు.