ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శ్రీవాణి ట్రస్ట్ నిధుల భాగస్వామ్యంతో ఏకంగా 5,500 నూతన దేవాలయాలను నిర్మించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక పరిరక్షణతో పాటు మారుమూల ప్రాంతాల్లోనూ భక్తి భావనను పెంపొందించేందుకు ప్రభుత్వం ఈ భారీ ప్రాజెక్టును వేగవంతం చేస్తోందని పేర్కొన్నారు.

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహ్మదాపురం గ్రామంలో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ పనులకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి మంత్రి ఆనం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజాక్షేమం, ధర్మ ప్రచారం కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు.
రాష్ట్రంలోని మొత్తం 175 శాసనసభ నియోజకవర్గాల్లో శ్రీవారి ఆలయాలను నిర్మించనున్నట్టుగా మంత్రి ఆనం తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో నిర్మించే ఆలయానికి రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు వ్యయం చేయనున్నారు. రాష్ట్రంలోని 6,700 చిన్న, పురాతన దేవాలయాల్లో నిత్య పూజలు సాగేందుకు ప్రతి నెలా రూ.10,000 చొప్పున దూప, దీప, నైవేద్యాల పథకం కింద అందిస్తున్నట్టుగా మంత్రి తెలిపారు.
దేవాలయాల నిర్మాణంతో పాటు స్థానిక మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో రూ.35 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.
సోమశిల జలాశయం నుంచి ప్రత్యేక పైప్‌లైన్ వ్యవస్థ ద్వారా ఆత్మకూరు పట్టణ ప్రజలకు శాశ్వత తాగునీటి సదుపాయం కల్పించామని గుర్తుచేశారు. పట్టణంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవనం, ముస్లిం సోదరుల కోసం భవనం నిర్మాణాలు వేగవంతం చేసేందుకు నిధులు మంజూరు చేశామన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్పకాలంలోనే సంక్షేమం, అభివృద్ధితోపాటు ఆధ్యాత్మిక రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని మంత్రి ఆనం వివరించారు.
{{/usCountry}}రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్పకాలంలోనే సంక్షేమం, అభివృద్ధితోపాటు ఆధ్యాత్మిక రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని మంత్రి ఆనం వివరించారు.
{{/usCountry}}'స్థానిక అమ్మవారి ఆలయానికి రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించడంతో పాటు 2.5 కిలోమీటర్ల నాలుగు లేన్ల బైపాస్ రోడ్డు ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఆత్మకూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, సురక్షిత తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించడమే మా లక్ష్యం. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ ఆత్మకూరును ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాం.' అని మంత్రి ఆనం అన్నారు.