Weather Update : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే రెండు రోజులు వాతావరణ పరిస్థితులు ఇలా

Weather Update : ఏపీ, తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితుల ఉంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొన్ని చోట్లు వర్షాలు పడుతున్నాయి.

Published on: Apr 8, 2026, 21:31:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ప్రస్తుతం భిన్న వాతావరణ పరిస్థితి నెలకొని ఉంది. పలు ప్రాంతాల్లో పగటిపూట తీవ్రమైన ఎండల తర్వాత సాయంత్రం వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటగా, మరికొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) ఒక ప్రకటన జారీ చేసింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం, సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర-దక్షిణ ద్రోణి ఏర్పడింది. ఈ వ్యవస్థ ఛత్తీస్‌గఢ్‌పై ఉన్న ఉపరితల వాయుప్రసరణ నుండి ప్రారంభమై, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు గుండా ప్రయాణించి, మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించింది.

గురువారం, శుక్రవారం ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో గురువారం అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. శుక్రవారం కూడా ఇదే తరహా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నప్పటికీ, గాలుల తీవ్రత కాస్త తగ్గనుంది.

రాయలసీమలో గురువారం అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. వీటితో పాటు గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. ఉరుములతో కూడిన వర్షాలు, బలమైన గాలుల సమయంలో జనాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అకస్మాత్తుగా మెరుపులతో కూడిన వర్షం లేదా వడగళ్ళు కూడా పడవచ్చు.

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉన్నప్పటికీ.. ఉష్ణోగ్రతలు అధికంగానే ఉన్నాయి. రాయలసీమలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆకస్మిక వర్షాలు, బలమైన గాలులు, మెరుపులు సంభవించే అవకాశం ఉన్నందున, పంటలకు నష్టం జరగకుండా కాపాడుకోవడానికి రైతులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More