Weather Update : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారబోతోంది. సముద్రంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న రోజుల్లో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచానా వేసింది.
నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు ప్రాంతానికి సమీపంలో సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఏపీలోని కోస్తాంధ్ర జిల్లాల్లో రాబోయే మూడు రోజుల పాటు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే వీలుంది.
ఏపీ, తెలంగాణ వర్షాలు
{{^htLoading}} {{/htLoading}}
ప్రస్తుతం ఉన్న ఆవర్తనం బలపడి ఈ నెల 24 లేదా 25 నాటికి అండమాన్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా మారనుంది. ఈ అల్పపీడనం అక్టోబర్ 27 నాటికి మరింత తీవ్రమై వాయుగుండంగా మారి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశముంది. ఆ తర్వాతి రెండు రోజుల్లో ఇది సైక్లోన్‌గా రూపాంతరం చెంది, నెలాఖరు నాటికి ఉత్తర కోస్తాంధ్ర - దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై స్పష్టత రావడానికి మరో 48 గంటల సమయం పట్టనుంది.
తెలంగాణలో వర్షాలు
అక్టోబర్ 20న తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అంతేకాకుండా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు సంభవించవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.
అక్టోబర్ 21న కొన్ని చోట్ల మోస్తరు వర్షాలతో పాటు, 30-40 కిమీ/గంట వేగంతో వీచే ఈదురుగాలులు, ఉరుములు-మెరుపులు వచ్చే సూచనలు ఉన్నాయి. 22వ తేదీన కూడా అక్కడక్కడా వర్షపాతం నమోదవడంతో పాటు ఈదురుగాలుల ప్రభావం ఉంటుంది. అక్టోబర్ 22 నుంచి అక్టోబర్ 26 వరకు రాష్ట్రంలో వర్ష సూచన లేదని, వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజులకు ఎలాంటి ప్రత్యేక హెచ్చరికలు లేవు.
{{^htLoading}} {{/htLoading}}
{{^usCountry}}
ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, పొలాల్లో ఉన్న పంటలను సంరక్షించుకోవడానికి రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కోత దశలో ఉన్న పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, పొలాల్లో నీరు నిలవకుండా చూసుకోవాలని అధికారులు సూచించారు.
{{/usCountry}}
{{#usCountry}}
ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, పొలాల్లో ఉన్న పంటలను సంరక్షించుకోవడానికి రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కోత దశలో ఉన్న పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, పొలాల్లో నీరు నిలవకుండా చూసుకోవాలని అధికారులు సూచించారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.