రెయిన్ అలర్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలకు వర్షసూచన!

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షం కురవనుంది. ఈ మేరకు వాతావరణ శాఖ అంచనా వేసింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Published on: Nov 6, 2025, 13:25:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. గురువారం(నవంబర్ 6) కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) ప్రకారం, ఇతర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కూడా ఉండవచ్చు.

ఏపీలో వర్షాలు
ఏపీలో వర్షాలు

నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా విస్తరించి ఉన్న ద్రోణి కారణంగా వర్షాలు కురుస్తాయని, ఇది రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతాలపై వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేస్తుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖార్ జైన్ తెలిపారు.

వచ్చే వారంలో ఇది తుపానుగా మారుతుందా అనే ప్రశ్నలకు సమాధానమిస్తూ, అలాంటి అవకాశం లేదని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. నవంబర్ 7 నుండి వాతావరణం చాలావరకు పొడిగా మారుతుందని భావిస్తున్నామని వెల్లడించింది.

ఇదిలా ఉండగా నవంబర్ 7 వరకు రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. నవంబర్ మధ్య వరకు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని ఏపీ వెదర్‌మ్యాన్ అంచనా వేశారు. వర్షాలు తక్కువగా ఉంటాయి. కానీ తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో నవంబర్ మధ్య వరకు వర్షాలు కురుస్తాయన్నారు. విజయవాడ పొడిగా ఉంటుందని, వైజాగ్‌లో తక్కువ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

మరోవైపు బుధవారం (నవంబర్ 5) సాయంత్రం 4 గంటల సమయానికి బి చెర్లపల్లి (ప్రకాశం జిల్లా)లో 65.2 మి.మీ, గాండ్లపెంట (శ్రీ సత్యసాయి జిల్లా)లో 45 మి.మీ., రాపూరు (నెల్లూరు జిల్లా)లో 40.5 మి.మీ, తూర్పు విజయవాడలో 39 మి.మీ వర్షపాతం నమోదైంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More