ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న విభిన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ(ఏపీఎస్‌డీఎంఏ) హెచ్చరించింది. తీవ్రమైన వేడి, వడగాలులు, అకాల వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. తీవ్రమైన వేడి, వేడి గాలులు, తేమతో కూడిన పరిస్థితుల పట్ల ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్‌డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ కోరారు.

శుక్రవారం ఈ సీజన్‌లో అత్యధిక ఉష్ణోగ్రత కాకినాడ జిల్లాలోని కరప్పలో 44.1డిగ్రీలు, కడపలో 43.6డిగ్రీలుగా నమోదవ్వగా, 22 జిల్లాల్లో ఉష్ణోగ్రత 40కి పైగా నమోదైంది. శనివారం ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో వడగాలుల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ వంటి 10 జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉంది.
ఎండలోకి వెళ్లేటప్పుడు టోపీలు ధరించాలని, లేత రంగు కాటన్ దుస్తులు వేసుకోవాలని, కళ్లను కాపాడుకోవడానికి కళ్లద్దాలు పెట్టుకోవాలని విపత్తు నిర్వహణ అథారిటీ ప్రజలకు సూచించింది. గుండె జబ్బులు, మధుమేహం, లేదా రక్తపోటు సమస్యలు ఉన్నవారు ఎండలో బయటకు వెళ్లడం మానుకోవాలని తెలిపారు.
ఇదిలా ఉండగా తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు రాష్ట్రాలపై ద్రోణి ఏర్పడటంతో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు చెదురుమదురుగా కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన వర్షాలు కురిసే సమయంలో రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని అధికారులు హెచ్చరించారు.
ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో శనివారం వేడి గాలులు.. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 8 మండలాలు, విజయనగరం జిల్లాలో 20, పార్వతీపురం మన్యం జిల్లాలో 14, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1, పోలవరం జిల్లాలో 6, అనకాపల్లి జిల్లాలో 5, పార్వతీపురం మన్యం జిల్లాలో 14, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 1, పోలవరం జిల్లాలో 6, అనకాపల్లి జిల్లాలో 5, కాకినాడ జిల్లాలో 2, తూర్పుగోదావరి జిల్లాలో 4, ఏలూరు జిల్లాలో 3, ఎన్టీఆర్ జిల్లాలో 3 మండలాల్లో వేడిగాలులు వీయనున్నాయి. 79 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉండనుంది. ఆదివారం రోజున ఏకంగా 93 మండలాల్లో వడ గాలులు వీచే అవకాశం ఉంది.
{{/usCountry}}ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో శనివారం వేడి గాలులు.. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 8 మండలాలు, విజయనగరం జిల్లాలో 20, పార్వతీపురం మన్యం జిల్లాలో 14, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1, పోలవరం జిల్లాలో 6, అనకాపల్లి జిల్లాలో 5, పార్వతీపురం మన్యం జిల్లాలో 14, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 1, పోలవరం జిల్లాలో 6, అనకాపల్లి జిల్లాలో 5, కాకినాడ జిల్లాలో 2, తూర్పుగోదావరి జిల్లాలో 4, ఏలూరు జిల్లాలో 3, ఎన్టీఆర్ జిల్లాలో 3 మండలాల్లో వేడిగాలులు వీయనున్నాయి. 79 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉండనుంది. ఆదివారం రోజున ఏకంగా 93 మండలాల్లో వడ గాలులు వీచే అవకాశం ఉంది.
{{/usCountry}}ఇలాంటి భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలి. ఈ అకాల వర్షాలతో రైతులు నష్టపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది.