ఏపీలోని రేషన్ కార్డుదారులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని రేషన్ దుకాణాల్లో కిలో రూ.20కే గోధుమ పిండి పంపిణీ చేయనున్నారు. ఇప్పటి వరకు పైలెట్ ప్రాజెక్ట్ కింద కొన్ని అర్బన్ ప్రాంతాల్లో మాత్రమే గోధుమ పిండిని పంపిణీ చేశారు. కానీ ఇవాళ్టి నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లోని రేషన్ షాపుల్లోనూ లబ్ధిదారులకు అందజేస్తారు.
త్వరలోనే అక్కడ కూడా - మంత్రి నాదెండ్ల

ఇదే విషయంపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన చేశారు. త్వరలోనే డివిజన్, మండల స్థాయి దుకాణాల్లోనూ గోధుమ పిండిని అందజేస్తామని ప్రకటించారు.
బహిరంగ మార్కెట్‌లో కిలో గోధుమ పిండి ధర 60 నుంచి 65 రూపాయల వరకు ఉంటోంది. కానీ ప్రభుత్వం చౌక దుకాణాల్లో కేవలం 20 రూపాయలకే అందిస్తోంది.ముందుగా పట్టణ ప్రాంతాల్లో ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడ వచ్చిన ఫలితాల ఆధారంగా… జిల్లా కేంద్రాల్లోనూ… ఆ తర్వాత డివిజన్ మండల, గ్రామస్థాయిలోనూ అమలు చేస్తారు.
ఏపీలో ఇప్పటికే రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు రాగులు, జొన్నలు కూడా అందిస్తున్నారు. తాజాగా గోధుమ పిండి కూడా రేషన్ కార్డుదారులకు అందనుంది.ప్రతి కుటుంబానికి పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం అమలులోకి వచ్చింది. సహజంగా చెక్కి తయారు చేసిన నాణ్యమైన గోధుమ పిండిని అతి తక్కువ ధరలో ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. నాణ్యత తనిఖీ తర్వాత సురక్షిత ప్యాకింగ్‌తో పంపిణీ చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ చెబుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రథమ ప్రాధాన్యంగా తీసుకొని ప్రభుత్వం చేపట్టిన ఈ సదుపాయాన్ని…. రేషన్ కార్డుదారులందరూ వినియోగించుకోవాలని కోరుతున్నారు.
మరోవైపు రేషన్ దుకాణాలను మినీ మాల్స్‌కు మార్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కూడా పౌరసరఫరాల శాఖ సిద్దమవుతోంది. ఇందులో భాగంగా రోజంతా సరుకులు అందించే కార్యక్రమానికి సిద్దమైంది. ఇందుకోసం ప్రయోగాత్మకంగా పలు నగరాలను ఎంచుకున్నారు. ఇక్కడ సుమారు 12 గంటల పాటు షాపు తెరిచి ఉంచుతారు.
{{/usCountry}}మరోవైపు రేషన్ దుకాణాలను మినీ మాల్స్‌కు మార్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కూడా పౌరసరఫరాల శాఖ సిద్దమవుతోంది. ఇందులో భాగంగా రోజంతా సరుకులు అందించే కార్యక్రమానికి సిద్దమైంది. ఇందుకోసం ప్రయోగాత్మకంగా పలు నగరాలను ఎంచుకున్నారు. ఇక్కడ సుమారు 12 గంటల పాటు షాపు తెరిచి ఉంచుతారు.
{{/usCountry}}ఇక రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులు పొందిన వారు… ఇంకా చాలా మంది లబ్ధిదారులు ఈ-కేవైసీ చేయించుకోలేదు. ఈ ప్రాసెస్ వారి రేషన్ కార్డులు రద్దు చేసే అవకాశం ఉంది. వేలిముద్ర ద్వారా లబ్ధిదారుని ధ్రువీకరించే ప్రక్రియనే ఈకైవీసీ అంటారు. దీంతో నకిలీ రేషన్ కార్డులను పూర్తిగా తొలగించవచ్చు.
ఈకేవైసీ పకడ్బందీగా నిర్వహించటం ద్వారా… నకిలీ లబ్ధిదారులను ఏరివేస్తారు. సరుకుల పంపిణీ పారదర్శకంగా ఉంటుంది. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు ఈకేవైసీ సమాచారాన్ని సేకరిస్తోంది.
రేషన్ డీలర్ షాప్ లో ఈకేవైసీ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు.గ్రామ / వార్డు సచివాలయాల్లో కూడా ఈ ప్రాసెస్ చేస్తారు.E-PoS(ఈ పోస్) యంత్రంలో వేలిముద్ర పెట్టగానే E-KYC పూర్తవుతుంది. మరోవైపు కార్డు ఇప్పటివరకు తీసుకొనివారు.. ఆయా రేషన్ షాపుల వద్దకు తీసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.