ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ఒక మైలురాయిగా నిలవాల్సిన శుభ సందర్భం.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన కొన్ని వీడియోల వల్ల తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చేలా నిర్మించిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం రోజే అక్కడ చోటుచేసుకున్న ఘటనలు నెటిజన్లను, రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేశాయి.

ఆగస్టు 1, 2026న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా వైభవంగా ప్రారంభమైన భోగాపురం విమానాశ్రయంలో, ఆగస్టు 17, 2026 నుండి వాణిజ్య విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. అయితే ప్రారంభోత్సవం ముగిసిన వెంటనే విమానాశ్రయాన్ని సందర్శించేందుకు వచ్చిన ప్రజలు ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వైరల్ అయిన వీడియో దృశ్యాల ప్రకారం... విమానాశ్రయాన్ని చూడటానికి వచ్చిన సందర్శకులు అక్కడ అందం కోసం నాటిన మొక్కలను పీకేయడం, అలంకారిక వాటర్ ఫౌంటెన్లలోకి దిగి ఆటలాడటం, ఫోటోలకు భంగిమలు ఇవ్వడం వంటి పనులు చేశారు. ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పిక్నిక్ స్పాట్‌గా, వినోద పార్కుగా భావించి వారు ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎంత గొప్ప మౌలిక వసతులు కల్పించినా, వాటిని కాపాడుకునే పౌర బాధ్యత మనలో లోపించిందనడానికి ఈ ఘటన నిదర్శనమని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేవారిపై, నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠినమైన జరిమానాలు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనేకమంది డిమాండ్ చేశారు.
తొలిసారి విమానాశ్రయాలకు వచ్చే వారికి ప్రజా ఆస్తులను ఎలా ఉపయోగించాలో అవగాహన కల్పించేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని, క్రౌడ్ మేనేజ్‌మెంట్ సరిగ్గా ఉండాలని కొందరు అభిప్రాయపడ్డారు.
విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, పార్కులు కేవలం ప్రభుత్వ రికార్డుల్లో ఉండే కట్టడాలు కావు. అవి మన పన్నుల డబ్బుతో, మన ప్రయాణ సౌకర్యార్థం, మన ప్రాంత గౌరవాన్ని పెంచేందుకు నిర్మించిన మన సొంత ఆస్తులు. అధునాతన మౌలిక సదుపాయాలను అందించడం ప్రభుత్వ బాధ్యత అయితే, వాటిని పరిశుభ్రంగా, సురక్షితంగా కాపాడుకోవడం ప్రతి ఒక్క పౌరుడి ప్రాథమిక ధర్మం.
{{/usCountry}}విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, పార్కులు కేవలం ప్రభుత్వ రికార్డుల్లో ఉండే కట్టడాలు కావు. అవి మన పన్నుల డబ్బుతో, మన ప్రయాణ సౌకర్యార్థం, మన ప్రాంత గౌరవాన్ని పెంచేందుకు నిర్మించిన మన సొంత ఆస్తులు. అధునాతన మౌలిక సదుపాయాలను అందించడం ప్రభుత్వ బాధ్యత అయితే, వాటిని పరిశుభ్రంగా, సురక్షితంగా కాపాడుకోవడం ప్రతి ఒక్క పౌరుడి ప్రాథమిక ధర్మం.
{{/usCountry}}ఉత్తరాంధ్ర ప్రాంతం ఆర్థికంగా, పర్యాటకంగా ఎదగడానికి భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఒక ప్రధాన వేదిక. ఇలాంటి ప్రాజెక్టుల వద్ద మనం ప్రదర్శించే క్రమశిక్షణే మన ప్రాంతీయ గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెడుతుంది. అంతేకానీ మెుక్కలు తీసుకుని వెళ్లడం, అక్కడ వాటిని నాశనం చేయడం సరికాదు.