వైఎస్సార్ కుటుంబంలో గత కొంతకాలంగా సాగుతున్న ఆస్తుల వివాదం ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమార్తె అంజలి వివాహం వేళ.. బెంగళూరులోని యెలహంకలో ఉన్న వైఎస్సార్ కుటుంబ ఆస్తి (ప్యాలెస్) ఉపయోగంపై చోటుచేసుకున్న పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి.

తన కుమార్తె వివాహాన్ని బెంగళూరులోని యెలహంక ప్యాలెస్లో జరిపించేందుకు వైఎస్ షర్మిల ఏర్పాట్లు చేసుకోవాలని భావించినప్పటికీ, అక్కడ పెళ్లికి అనుమతించేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుముఖత వ్యక్తం చేయలేదని కథనాలు వెలువడుతున్నాయి. ఈ అంశంపై జగన్ వర్గం, షర్మిల వర్గాల మధ్య భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.
వైసీపీ చెబుతున్న ప్రధాన కారణాలు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రతా ప్రోటోకాల్స్ దృష్ట్యా, బెంగళూరు నివాసం అత్యంత సున్నితమైన ప్రాంతం. వివాహం వంటి భారీ వేడుక నిర్వహించినప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు, రాజకీయ ప్రముఖులు, విఐపీలు, మీడియా ప్రతినిధులు తరలివస్తారు. ఇటువంటి చోట నిరంతరం రద్దీ ఉండటం భద్రతకు విఘాతం కలిగిస్తుందని భావిస్తున్నారు. అంతేకాదు తెలియని వ్యక్తులు కూడా ఇంటిలోపలకి వేడుక సమయంలో వస్తుంటారు. ఇదే సెక్యూరిటీ దృష్ట్యా సమస్యలు సృష్టించవచ్చని వైసీపీ చెబుతోంది.
భారీగా వచ్చే అతిథుల వల్ల ఆ నివాస ప్రాంగణానికి సంబంధించిన అంతర్గత విజువల్స్, ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో, బయట సర్క్యులేట్ అయ్యే అవకాశం ఉందని, దీనివల్ల ప్రైవసీకి భంగం వాటిల్లుతుందని జగన్ లేఖ ద్వారా వివరణ ఇచ్చినట్లు వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు తాను నివసించేది బెంగళూరులోనే కాబట్టి.. పులివెందుల, హైదరాబాద్లోని తమకు చెందిన ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించేందుకు తనకు ఎలాంటి అభ్యంతర లేదని జగన్ తెలిపినట్టుగా తెలుస్తోంది. అయితే వెడ్డింగ్ కార్డ్స్ కంటే ముందే దీనిపై చర్చ జరిగింది. అప్పుడే జగన్ ఈ విషయాన్ని షర్మిలకు చెప్పారని వైసీపీ అంటోంది.
మరోవైపు వేడుకకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలు హాజరయ్యే అవకాశం ఉన్నందున, జగన్ సొంత నివాసంలోనే కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశాలు లేదా రాజకీయ చర్చలు జరగడం వైఎస్సార్సీపీ రాజకీయ వ్యూహాలకు, పొత్తుల సమీకరణాలకు ఇబ్బందిగా మారుతుందన్న కోణం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది.
షర్మిల వర్గం వాదన
{{/usCountry}}మరోవైపు వేడుకకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలు హాజరయ్యే అవకాశం ఉన్నందున, జగన్ సొంత నివాసంలోనే కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశాలు లేదా రాజకీయ చర్చలు జరగడం వైఎస్సార్సీపీ రాజకీయ వ్యూహాలకు, పొత్తుల సమీకరణాలకు ఇబ్బందిగా మారుతుందన్న కోణం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది.
షర్మిల వర్గం వాదన
{{/usCountry}}మరోవైపు వైఎస్ షర్మిల మద్దతుదారులు ఈ వ్యవహారాన్ని ఆస్తి వివాదం, వ్యక్తిగత పట్టింపులతో ముడిపెట్టి చూస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉన్నప్పుడు పిల్లలిద్దరికీ సమానంగా ఆస్తులు పంచాలని భావించారని, హైదరాబాద్లోని లొటస్ పాండ్, బెంగళూరులోని యెలహంక కాంపౌండ్, ఇడుపులపాయ నివాసాల్లో షర్మిలకు భాగస్వామ్యం ఉందన్నది వారి వాదన. భద్రతా కారణాల దృష్ట్యా కుదరదని జగన్ చెప్పినట్టుగా తెలుస్తోంది.
గత ఐదేళ్లుగా జగన్, షర్మిల మధ్య సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్లతో పాటు ఇతర ఆస్తులపై వివాదం నడుస్తోందని, ఈ వ్యవహారం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు కూడా విచారణలో ఉందనేది బహిరంగ రహస్యమే. పెళ్లి వేదిక విషయమై ఇరువర్గాల మధ్య విభేదాలు రావడంతో తల్లి వైఎస్ విజయమ్మ స్వయంగా జగన్ను ఒప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆయన తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
మరో వేదిక
ఇప్పటికే వివాహ ఆహ్వాన పత్రికలు అందజేసే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో, యెలహంక ప్యాలెస్లో అనుమతి లభించకపోవడంతో షర్మిల బృందం బెంగళూరు లేదా హైదరాబాద్ పరిసరాల్లో విఐపీల భద్రతకు సరిపోయే ప్రత్యామ్నాయ వేదిక కోసం అన్వేషణ ప్రారంభించినట్లు తెలుస్తోంది.