Wine Shops close : ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు సాయంత్రం నుంచి వైన్‌షాపులు క్లోజ్
Wine Shops close : ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ పోలింగ్ ప్రక్రియ సరైన వాతావరణంలో నిర్వహించేందుకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. వైన్‌షాపులు బంద్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. మరోవైపు పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైన్‌షాపులు బంద్ కానున్నాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి మొదలై నవంబర్ 1వ తేదీ సాయంత్రం వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలోని అన్ని వైన్ షాపులు, బార్లు, క్లబ్‌లు మూతపడనున్నాయి.

ఓట్ల లెక్కింపు చేపట్టే నవంబర్ 3వ తేదీన కూడా పూర్తిగా మద్యం విక్రయాలను నిలిపివేయాలని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా, గొడవలు జరగకుండా ఉండేందుకే ఈ డ్రై డేస్ నిబంధనను పక్కాగా అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దొంగచాటుగా మద్యం అమ్మకాలు సాగించినా, నిల్వలు ఉంచినా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరోవైపు రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 1వ తేదీన నిర్వహించనున్న మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పోలింగ్‌కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో పోలీసు బలగాలను మోహరించినట్లు తెలిపింది.
పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తుతో పాటు డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, వీడియో గ్రాఫర్ల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల భద్రత కోసం మొత్తం 36,351 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. ఇందులో జిల్లాల్లో అందుబాటులో ఉన్న 32,276 మంది పోలీసు సిబ్బందితో పాటు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్(ఏపీఎస్పీ) నుంచి 2,730 మంది, ఇతర విభాగాల నుంచి 1,345 మంది సిబ్బందిని సమీకరించారు.
ఈ ఎన్నికల నిర్వహణలో విధులు నిర్వహించే పోలీసు బలగాల వివరాలు ర్యాంకుల వారీగా చూస్తే.. ఎస్పీలు – 34, అదనపు ఎస్పీలు – 52, డీఎస్పీలు – 152, సీఐలు/ఆర్‌ఐలు – 662, ఎస్‌ఐలు/ఆర్‌ఎస్‌ఐలు – 1,564, ఏఎస్‌ఐలు/ఏఆర్‌ఎస్‌ఐలు – 2,111, సివిల్ హెడ్ పోలీసు కానిస్టేబుళ్లు/ఏఆర్‌హెచ్‌సీలు – 4,505, సివిల్ పోలీసు కానిస్టేబుళ్లు/ఏఆర్‌పీసీలు – 17,017, హోంగార్డులు – 6,179 ఉన్నారు. ఇతర బందోబస్తు సిబ్బంది కూడా ఉంటారు
రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 4,372 పోలింగ్ స్టేషన్ లొకేషన్ల పరిధిలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వీటిలో అతి సున్నితమైన 671 కేంద్రాలకు 3,355 మంది, సున్నితమైన 1,233 కేంద్రాలకు 4,943 మంది పోలీసు సిబ్బందిని కేటాయించారు.
పోలింగ్ సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణకు ఆటంకం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించింది.
ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిడి, ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను పాటిస్తూ అధికారులకు సహకరించాలని కోరింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


