గ్యాస్ డెలివరీ బాయ్‌తో ఎఫైర్.. రూమ్‌కి రావాలని పిలిచి హత్య.. ఆపై!

తిరుపతిలో దారుణమైన ఘటన జరిగింది. గ్యాస్ డెలివరీ బాయ్‌తో ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. చివరికి ప్రాణాలు పోగొట్టుకుంది.

Published on: Jan 6, 2026, 12:00:09 IST
By , Tirupati
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుపతి జిల్లాలో ఘోరమైన ఘటన జరిగింది. సాంబలక్ష్మీ అనే మహిళను సోమశేఖర్ అనే వ్యక్తి హత్య చేశాడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కొర్లకుంట మారుతీనగర్‌లో జరిగింది. ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం సృష్టించింది. వివాహేతర సంబంధమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

సోమశేఖర్ అనే వ్యక్తి గుత్తివారిపల్లికి చెందినవాడు. ఐదు ఏళ్లుగా కొర్లకుంట మారుతీనగర్‌లో గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. అతడికి పెళ్లి అయింది. కానీ భార్యతో గొడవల కారణంగా వేరుగా ఉంటున్నాడు. ఇక తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన సాంబలక్ష్మీ కొంతకాలం జీవకోనలో నివసించేది. తర్వాత కొర్లకుంట మారుతీనగర్‌లో తన భర్త, కుమారుడితో కలి ఉంటుంది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సమోసాల దుకాణంలో పనిచేసేది.

గ్యాస్ ఏజెన్సీలో పనిచేసే సోమశేఖర్.. సమోసాల దుకాణం వచ్చేవాడు. ఈ క్రమంలో సాంబలక్ష్మీతో పరిచయం ఏర్పడింది. తర్వాత వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ సంబంధం కొంతకాలంగా కొనసాగుతోంది. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు కూడా ఎక్కువగానే జరుగుతూ ఉండేవి. సోమశేఖర్‌తో ఈ తలనొప్పి తనకు ఎందుకని కొంతకాలంగా సాంబలక్ష్మీ దూరంగా ఉంటుంది. వివాహేతర సంబంధానికి నిరాకరించింది. ఈ కారణంగా సోమశేఖర్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.

చివరిసారిగా ఒకే ఒకసారి నీతో మాట్లాడాలని అని సాంబలక్ష్మీని సోమశేఖర్ నమ్మించాడు. తన రూమ్‌కు పిలిపించుకున్నాడు. ఇదే సమయంలో మళ్లీ గొడవ జరిగి.. సాంబలక్ష్మీపై ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

సాంబలక్ష్మీ, సోమశేఖర్ మధ్య ఎప్పుడూ గొడవలు జరిగేవని తెలుస్తోంది. అందులో భాగంగానే సోమశేఖర్ హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందగానే పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దీనిపై మరింత స్పష్టత రావాలంటే విచారణ కొనసాగాల్సి ఉంది. రుయా ఆసుపత్రికి పోలీసులు మృతదేహాలను తరలించారు. ఫోరెన్సిక్ నివేదికలు, కాల్ డేటా, ఇతర సాంకేతిక ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించిన ప్రధాన కారణాలపై దృష్టి పెట్టారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More