ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలనే కొత్త విజ్ఞప్తి వచ్చింది. తెలుగునాడుగా మార్చాలని 3వ ప్రపంచ తెలుగు మహాసభ నుండి కొత్త స్వరం వినిపించింది. తమిళం మాట్లాడే రాష్ట్రాన్ని తమిళనాడును ఏర్పాటు చేశారు. కాబట్టి తెలుగు మాట్లాడేవారి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను తెలుగు నాడుగా మార్చాలని తెలుగు మహాసభలో రిక్వెస్ట్ వచ్చింది.

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఛైర్మన్ చైతన్యరాజు ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే తెలుగు మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, గరికిపాటి నరసింహారావు, చాగంటి కోటేశ్వరరావు, నటుడు తనికెళ్ల భరణి, పలువురు ప్రతినిధులు హాజరయ్యారు.
తెలుగు కేవలం ఒక భాష కాదని, మన సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర, సాహిత్యం, కళలు, ఉనికికి ప్రతీక అని ఒడిశా గవర్నర్ హరిబాబు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావాలని, తెలుగు భాష వైభవాన్ని చాటి చెప్పాలన్నారు. మాతృభాష తెలుగు.. మన గౌరవం, ఐక్యతకు ఆధారం అని అన్నారు. ప్రతి తెలుగు వ్యక్తి తెలుగు భాష పరిరక్షణ, అభివృద్ధిని తమ వ్యక్తిగత బాధ్యతగా భావించాలని చెప్పారు.
తెలుగు సాహిత్యం, సంగీతం, నాటకం, కళలను ప్రపంచానికి పరిచయం చేయాలని హరిబాబు అన్నారు. యువతలో తెలుగు పట్ల ప్రేమ, గౌరవం పెంపొందించాలని చెప్పారు. మూడో ప్రపంచ తెలుగు మహాసభల స్ఫూర్తితో తెలుగు భాష బలపడితే, మన సంస్కృతిని తదుపరి తరానికి అందించడం మన కర్తవ్యమని అన్నారు.
ప్రాచీన తెలుగు సాహిత్యం నుండి నేటి ఆధునిక సాహిత్యం వరకు జరిగిన పరిణామాలను గుర్తుంచుకోవాలని, ఈ సమావేశాలు మాతృభాషను కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలని అయ్యన్న పాత్రుడు అన్నారు. కూచిపూడి నృత్యం, జానపద కళలు, తెలుగు ప్రజల ప్రత్యేక జీవనశైలిని ప్రపంచానికి పరిచయం చేయాలని సూచించారు. డిజిటల్ యుగంలో కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లలో తెలుగు వినియోగాన్ని పెంచడానికి మార్గాలను అన్వేషించాలని అన్నారు.
{{/usCountry}}ప్రాచీన తెలుగు సాహిత్యం నుండి నేటి ఆధునిక సాహిత్యం వరకు జరిగిన పరిణామాలను గుర్తుంచుకోవాలని, ఈ సమావేశాలు మాతృభాషను కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలని అయ్యన్న పాత్రుడు అన్నారు. కూచిపూడి నృత్యం, జానపద కళలు, తెలుగు ప్రజల ప్రత్యేక జీవనశైలిని ప్రపంచానికి పరిచయం చేయాలని సూచించారు. డిజిటల్ యుగంలో కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లలో తెలుగు వినియోగాన్ని పెంచడానికి మార్గాలను అన్వేషించాలని అన్నారు.
{{/usCountry}}ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ను తెలుగునాడుగా పేరు మార్చాలని ప్రపంచ తెలుగు మహాసభల్లో విజ్ఞప్తి వచ్చింది.