...
...
Next Story

మళ్లీ పాదయాత్ర చేస్తాను.. ఏడాదిన్నరపాటు జనాల్లోనే.. వైఎస్ జగన్ కీలక ప్రకటన!

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మళ్లీ పాదయాత్ర చేస్తాను అని తెలిపారు. ఏడాదిన్నరపాటు జనాల్లోనే ఉంటాను అన్నారు.

Published on: Jan 21, 2026, 20:23:16 IST
Advertisement

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. ఏడాదిన్నర తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను ప్రారంభిస్తానని ప్రకటించారు. అలా ఏడాదిన్నరపాటు ప్రజల్లోనే ఉంటానని చెప్పారు. కూటమి ప్రభుత్వానికి మిగిలి ఉంది మూడేళ్లు అని తెలిపారు.

వైఎస్ జగన్ (YSRCP)
వైఎస్ జగన్ (YSRCP)

సంకీర్ణ ప్రభుత్వం వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైందని జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. 'ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పాలనా వ్యవస్థలన్నీ బలహీనపడ్డాయి. ప్రభుత్వం సమాజంలోని ఏ వర్గానికీ ప్రయోజనం చేకూర్చడం లేదు. ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయింది, ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంతో పోలికలు చేయడం సర్వసాధారణమైంది.' అని జగన్ అన్నారు.

సంకీర్ణ ప్రభుత్వం ఏకపక్ష పాలనకు పాల్పడుతోందని, పోలీసులను దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రత్యర్థులు, విమర్శకులపై కేసులు పెడుతోందని జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. తన హయాంలో కోవిడ్-19 మహమ్మారి సమయంలో కూడా సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అమలు చేశామని, అయితే ప్రస్తుత ప్రభుత్వం కీలక కార్యక్రమాలను నిలిపివేసిందని పేర్కొన్నారు.

విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, శాంతిభద్రతలు తీవ్రంగా దెబ్బతిన్నాయని జగన్ విమర్శలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు గణనీయంగా తగ్గాయని, ఫీజు రీయింబర్స్‌మెంట్, హాస్టల్ భత్యాలు, ఆరోగ్యశ్రీ కింద పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోయాయన్నారు. అలాగే 108, 104 వంటి అత్యవసర సేవలు బలహీనపడ్డాయని ఆరోపించారు.

వైద్య కళాశాలల జీతాలు, నిర్వహణ ఖర్చులను భరిస్తూనే వాటిని ప్రైవేటీకరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జగన్ వ్యాఖ్యానించారు. ఇది ఆర్థిక అవకతవక అని వైఎస్సార్‌సీపీ అధినేత ఆరోపించారు. పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీలు, సున్నా వడ్డీ రుణాల లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

'వ్యవసాయ రంగాన్ని కూడా నాశనం చేశారు. చివరకు ఎరువులు కూడా బ్లాక్‌లో కొనాల్సి వస్తోంది. రాష్ట్రంలో ఎవరికీ భద్రత లేకుండా పోయింది. ఎక్కడా పోలీసింగ్ వ్యవస్థ కనిపించడం లేదు. ఇంకా మెుత్తం ప్రైవేటీకరణ.. అదే అనుకుంటే చివరకు సీఎం పదవి కూడా ప్రైవేట్‌కు ఇవ్వొచ్చు కదా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. కేసులతో వేధిస్తున్నారు.' అని జగన్ అన్నారు.

ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు జయప్రకాష్, కారుమూరి సునీల్, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి సుమారు 200 మంది పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe