...
...
Next Story

బెంగళూరు ప్యాలెస్‌లో షర్మిల అడుగుపెట్టకుండా కోర్టుకెళ్లిన వైఎస్ జగన్

వైసీపీ అధినేత జగన్, ఆయన సోదరి షర్మిల మధ్య బెంగళూరు యలహంక ప్యాలెస్ వివాదం రోజురోజుకు ముదురుతోంది. అక్కడకు షర్మిల రాకుండా జగన్ కోర్టుకెళ్లారు.

Published on: Nov 21, 2026, 17:06:46 IST
Advertisement

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సోదరి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య సాగుతున్న ఆస్తుల వివాదం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. బెంగళూరులోని యలహంక ప్యాలెస్ వివాదం మరింత ముదిరి, ఏకంగా న్యాయస్థానం మెట్లు ఎక్కేదాకా వెళ్లింది. తన కుమార్తె పెళ్లి పనుల్లో భాగంగా షర్మిల యలహంక ప్యాలెస్‌లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారన్న సమాచారంతో, ఆమెను అక్కడికి రాకుండా ఉండేందుకు జగన్ దేవనహళ్లి కోర్టును ఆశ్రయించారు.

వైఎస్ షర్మిల, వైఎస్ జగన్
వైఎస్ షర్మిల, వైఎస్ జగన్

తాజా పరిణామాల ప్రకారం, తన కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహ పనుల్లో భాగంగా షర్మిల బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌కు వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న జగన్ వర్గం వెంటనే అప్రమత్తమైంది. షర్మిల ఆ ప్రాంగణంలోకి అడుగుపెట్టకుండా నిరోధించేందుకు సిలికాన్ బిల్డర్స్ లిమిటెడ్ పేరుతో దేవనహళ్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అన్నాచెల్లెళ్ల మధ్య ఆస్తుల వివాదం కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా, కోర్టు దాకా వెళ్లడం తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

గత కొన్ని సంవత్సరాలుగా జగన్, షర్మిల మధ్య వైఎస్సార్ ఆస్తుల పంపకాల విషయంలో తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. షర్మిల తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డి వివాహాన్ని బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లో నిర్వహించాలని భావించారు.

యలహంక ప్యాలెస్ తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టించిన ఇల్లని, తన పిల్లలు అక్కడే పెరిగారని షర్మిల పేర్కొన్నారు. 2019లో కుదిరిన కుటుంబ అవగాహన ఒప్పందం ప్రకారం ఆ ఆస్తి 100 శాతం తనకే చెందుతుందని, అక్టోబర్ 31న ఎక్స్ వేదికగా దేవుడి సాక్షిగా యలహంక నాదే అని ఆమె ప్రకటించారు.

వివాహ వేడుకల సమయంలో ఎలాంటి అవాంఛనీయ వివాదాలు తలెత్తకూడదనే ఉద్దేశంతో షర్మిల తన కుమార్తె పెళ్లి వేదికను యలహంక ప్యాలెస్ నుండి వేరే చోటుకు మార్చుకున్నారు. తాను పెరిగిన ఇంట్లో పెళ్లి చేసుకోవాలన్న తన బిడ్డ ఆకాంక్షను నెరవేర్చలేకపోయానని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంకోవైపు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల బదిలీ, కుటుంబ ఆస్తుల యాజమాన్య హక్కుల విషయంలో షర్మిల. జగన్ మధ్య వివాదం నడుస్తోంది. ఇప్పుడు తాజాగా బెంగళూరు ప్యాలెస్ వివాదం దేవనహళ్లి కోర్టు వరకు వెళ్లడంతో మరింత ఉత్కంఠగా మారింది.

 

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks