సండే స్పెషల్ గా ఓటీటీలోకి ఓ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ వచ్చేసింది. ఇటీవల ఓటీటీ సిరీస్ లతో మరింత పాపులర్ అవుతున్న రాజీవ్ కనకాల కీ రోల్ ప్లే చేసిన సినిమా ‘10/G రైల్వే క్వార్టర్స్’ ఇవాళ (మార్చి 15) డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ లవర్స్ కోసం సండేను మరింత స్పెషల్ గా మార్చుస్తూ ఈ మూవీ డైరెక్ట్ గా డిజిటల్ డెబ్యూ చేసింది.
10/G రైల్వే క్వార్టర్స్ ఓటీటీ

10/G రైల్వే క్వార్టర్స్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఈ సినిమా ఆదివారం రిలీజైంది. ఇందులో రాజీవ్ కనకాల, మాధురి, ఆర్యన్, వాసంతి, జోష్న, అయేషా, మాధవ్ తదితరులు నటించారు.
బాహుబలి ప్రొడ్యూసర్లు
ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ కథాసుధ సిరీస్ లో భాగంగా ప్రతి ఆదివారం ఒక చిన్న సినిమాను డిజిటల్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలా ఈ వారం 10/G రైల్వే క్వార్టర్స్ మూవీ వచ్చింది. దీనికి జై డైరెక్టర్. ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మించారు. ప్రసాద్, శోభు కలిసి ఆర్కా మీడియా వర్క్స్ పై బాహుబలి 1, బాహుబలి 2, వేదం, మర్యాద రామన్న తదితర సినిమాలు తీశారు.
సస్పెన్స్ థ్రిల్లర్
10/G రైల్వే క్వార్టర్స్ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ మూవీ రన్ టైమ్ 38 నిమిషాలు మాత్రమే. సండే రోజు త్వరగా అయిపోయేలా ఓటీటీలో సినిమా చూడాలనుకునే వాళ్లకు ఇది మంచి ఆప్షన్.
10/G రైల్వే క్వార్టర్స్ మూవీ స్టోరీ
10/G రైల్వే క్వార్టర్స్ మూవీలో ఆర్యన్, వాసంతి భార్యాభర్తలుగా నటించారు. ఆర్యన్ రైల్వేలో జాబ్ చేస్తుంటాడు. తన భార్యను తీసుకుని కొత్తగా రైల్వే కాలనీకి వస్తాడు. ఇంట్లో పనులన్నీ అతనే చేస్తాడు. ఆ కాలనీలోనే రైల్వే మాస్టర్ గా రాజీవ్ కనకాల ఉంటాడు.
{{/usCountry}}10/G రైల్వే క్వార్టర్స్ మూవీలో ఆర్యన్, వాసంతి భార్యాభర్తలుగా నటించారు. ఆర్యన్ రైల్వేలో జాబ్ చేస్తుంటాడు. తన భార్యను తీసుకుని కొత్తగా రైల్వే కాలనీకి వస్తాడు. ఇంట్లో పనులన్నీ అతనే చేస్తాడు. ఆ కాలనీలోనే రైల్వే మాస్టర్ గా రాజీవ్ కనకాల ఉంటాడు.
{{/usCountry}}ఇంట్లో పనులన్నీ చేసే ఆర్యన్ పై రాజీవ్ కోపంతో ఉంటాడు. తనలా మమ్మల్ని కూడా ఆడవాళ్లు ఇంట్లో పనులు చేయమంటున్నారని అడుగుతాడు. అప్పుడే ఆర్యన్ భార్యకు ఒక మానసిక సమస్య ఉందని తెలుస్తుంది. లేనివి ఉన్నట్లు, జరగనివి జరిగినట్లు ఊహించుకుంటూ భ్రమ పడుతుందని ఆర్యన్ చెప్తాడు.
ఆ ట్విస్ట్
భార్యకు మానసిక సమస్య అని చెప్పిన ఆర్యన్ లో నెగెటివ్ షేడ్ ఉంటుంది. పక్క ఇంట్లోనే ఉన్న ఓ అమ్మాయితో అతనికి అక్రమ సంబంధం ఉంటుంది. దీంతో సొంత భార్యను చంపాలని ఆర్యన్ అనుకుంటాడు. మరి ఈ విషయం బయటపడిందా? ఇందులో రాజీవ్ కనకాల పాత్ర ఏంటీ? అనేది 10/G రైల్వే క్వార్టర్స్ మూవీ చూడాల్సిందే.