OTT Trending: తెలుగు ఆడియన్స్ తెగ చూసేస్తున్న మలయాళం థ్రిల్లర్.. ఓటీటీ ట్రెండింగ్ నంబర్ వన్.. మీరు చూశారా?

OTT Trending: ఓటీటీలోకి లేటెస్ట్ గా వచ్చిన ఓ మలయాళం థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను తెలుగు ఆడియన్స్ తెగ చూసేస్తున్నారు. దీంతో ఓటీటీలో ఇది ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. మరి ఈ సిరీస్ ను మీరు చూశారా? 

Published on: Mar 4, 2026, 13:46:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీల వాడకం ఎక్కువయ్యాక మలయాళం సినిమాలు, సిరీస్ లపై తెలుగు ఆడియన్స్ ప్రేమ కురిపిస్తున్నారు. ముఖ్యంగా మలయాళం థ్రిల్లర్ సినిమాలు, సిరీస్ లను ఎక్కువగా చూసేస్తున్నారు. ఇప్పుడు అలాంటి మలయాళం సిరీస్ ‘రోస్లిన్’ ఓటీటీలో అదరగొడుతోంది. తెలుగు జనాలు ఈ సిరీస్ ను తెగ చూసేస్తున్నారు.

ఓటీటీ ట్రెండింగ్ లో మలయాళ థ్రిల్లర్ సిరీస్ (x)
ఓటీటీ ట్రెండింగ్ లో మలయాళ థ్రిల్లర్ సిరీస్ (x)

రోస్లిన్ ఓటీటీ

మలయాాళ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘రోస్లిన్’ ఓటీటీలో సత్తాచాటుతోంది. ఈ సిరీస్ ఫిబ్రవరి 27న జియోహాట్‌స్టార్‌లో రిలీజైంది. ఆరు ఎపిసోడ్ల ఈ సిరీస్ ఉత్కంఠతో సాగుతోంది. ట్విస్ట్ లతో మైండ్ బ్లాక్ చేస్తోంది. ఈ రోస్లిన్ సిరీస్ లో మీనా, వినీత్, సంజన దీపు, హకీం షాజహాన్ తదితరులు నటించారు.

ట్రెండింగ్ నంబర్ వన్

రోస్లిన్ వెబ్ సిరీస్ జియోహాట్‌స్టార్‌లో ట్రెండింగ్ నంబర్ వన్ గా దూసుకెళ్తోంది. ఈ సిరీస్ మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఓటీటీలో రిలీజైంది. ప్రస్తుతం తెలుగు, మలయాళంలో ఇండియాలో నంబర్ వన్ సిరీస్ గా జియోహాట్‌స్టార్‌లో రోస్లిన్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

దృశ్యం లాంటి టాప్ సస్పెన్స్ థ్రిల్లర్ ను అందించిన డైరెక్టర్ జీతు జోసెఫ్.. ఈ రోస్లిన్ సిరీస్ కు షో రన్నర్ గా వ్యవహరించాడు. రోస్లిన్ సిరీస్ కు సుమేష్ నందకుమార్ డైరెక్టర్.

రోస్లిన్ కథ

శోభ (మీనా), జాన్ (వినీత్) కుటుంబం చుట్టూ సాగే కథనే రోస్లిన్ వెబ్ సిరీస్. శోభ, జాన్ భార్యాభర్తలు. వీళ్లకు రోస్లిన్ (సంజన దీపు) అనే టీనేజ్ కూతురు, చిన్న పిల్లాడైన ఆరోన్ ఉంటారు. ఈ ఫ్యామిలీ రోజ్ వ్యాలీని చూసుకుంటూ అక్కడి బంగ్లాలో ఉంటారు. అయితే రోస్లిన్ తర్వాత పుట్టిన అలెన్ చనిపోతాడు. రోస్లిన్ ను ఈ జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి.

ఈ కథలో రోస్లిన్ చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఆమెకు తరచుగా ఒకే రకమైన కల వస్తుంది. ఆకుపచ్చ రంగు కళ్లు కలిగిన ఓ వ్యక్తి తనను వెంటాడుతున్నట్లు, చంపాలని చూస్తున్నట్లు రోస్లిన్ కు కల వస్తుంది. ఈ విషయం అమ్మానాన్నకు చెప్తుంది. కానీ ఆమె చదివే నవలల కారణంగా ఇలాంటి కలలు వస్తున్నాయని చెప్పి ఊరుకుంటారు. అయితే ఒక రోజు జాన్ ఇంటికి జెర్రీ (హకీమ్ షాజహాన్) పెయింగ్ గెస్ట్ గా ఉండేందుకు వస్తాడు. తన కలలో వచ్చే వ్యక్తి జెర్రీనే అని రోస్లిన్ చెప్తుంది. కానీ ఎవరూ పట్టించుకోరు.

మరి ఆ తర్వాత ఏం జరిగింది? అసలు జెర్రీ ఎవరు? రోస్లిన్ ఎందుకు అంతలా భయపడుతుంది? అనేది రోస్లిన్ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More