OTT Tamil: ఓటీటీలో మలయాళ, తమిళ్, కన్నడ భాషల్లోని సినిమాలను తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటారు. మంచి కంటెంట్ ఉంటే చాలు ఇతర భాషల సినిమాలు అనే భేధం లేకుండా చూసేస్తారు. ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓ తమిళ రొమాంటిక్ డ్రామా వచ్చేస్తోంది. ఆ సినిమా పేరే ‘29’. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై అప్ డేట్ వచ్చేసింది.
29 ఓటీటీ

తమిళంలో డిఫరెంట్ కంటెంట్ తో, టైటిల్స్ తో మూవీస్ వస్తూనే ఉంటాయి. అలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన చిత్రమే ‘29’. 29 ఏళ్ల ఏజ్ లో ఓ యువకుడి జీవితం ఎలాంటి మలుపులు తీసుకుందనే స్టోరీ లైన్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఎప్పుడంటే?
తమిళ రొమాంటిక్ డ్రామా ‘29’ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో జూన్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ‘కమింగ్ ఆన్ ఫ్రైడే’ లిస్ట్ లో ‘29’ చిత్రాన్ని చేర్చారు. ఈ సినిమా తెలుగు ఆడియన్స్ కోసం తెలుగులోనూ రిలీజ్ కానుంది. తమిళ్, తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ పాన్ ఇండియా ఆడియన్స్ కు రీచ్ అయ్యేలా స్ట్రీమింగ్ కానుంది.
నెల రోజుల్లోపే
‘29’ మూవీ నెల రోజుల్లోనే ఓటీటీలోకి రానుంది. మే 8, 2026న థియేటర్లలో ఈ చిత్రం రిలీజ్ అయింది. జూన్ 5న ఓటీటీలో విడుదల కానుంది. ఈ సినిమాలో విధు, ప్రీతి అస్రాని లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఈ మూవీకి రత్న కుమార్ డైరెక్టర్. వైట్ కార్పెట్ ఫిల్మ్స్ బ్యానర్ పై కార్తీక్ సుబ్బరాజు, కార్తికేయన్ సంతానం, లోకేష్ కనగరాజు నిర్మించారు. ఈ మూవీకి ఐఎండీబీలో ఏకంగా 9.1 రేటింగ్ ఉంది.
29 మూవీ స్టోరీ
సత్య (విధు) 29 ఏళ్ల యువకుడు. ఆ ఏజ్ లో ఉండే అందరి యువకుల్లానే గుర్తింపు కోసం ఆరాటపడతాడు. అగ్రికల్చర్ డిగ్రీ చేసిన సత్య చెన్నైలో ఓ జాబ్ చేస్తుంటాడు. అతనికి, తల్లికి మధ్య విభేధాలుంటాయి. ఫ్రెండ్స్ తో కలిసి అతను రూమ్ లో ఉంటాడు. అయితే తన మైండ్ వాయిస్ మాత్రం ‘నేను ఎవరు?’ అని సత్యను ప్రశ్నిస్తూనే ఉంటుంది.
అమ్మాయి రాకతో
{{/usCountry}}సత్య (విధు) 29 ఏళ్ల యువకుడు. ఆ ఏజ్ లో ఉండే అందరి యువకుల్లానే గుర్తింపు కోసం ఆరాటపడతాడు. అగ్రికల్చర్ డిగ్రీ చేసిన సత్య చెన్నైలో ఓ జాబ్ చేస్తుంటాడు. అతనికి, తల్లికి మధ్య విభేధాలుంటాయి. ఫ్రెండ్స్ తో కలిసి అతను రూమ్ లో ఉంటాడు. అయితే తన మైండ్ వాయిస్ మాత్రం ‘నేను ఎవరు?’ అని సత్యను ప్రశ్నిస్తూనే ఉంటుంది.
అమ్మాయి రాకతో
{{/usCountry}}ఈ పరిస్థితుల్లో సత్య జీవితంలోకి ఓ అమ్మాయి విజయలక్ష్మి వస్తుంది. దీంతో అతని లైఫ్ లో ఊహించని సంఘటనలు జరుగుతాయి. అతని మైండ్ వాయిస్ ఏకంగా ఓ క్యారెక్టర్ గా మారి విజయలక్ష్మి గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు విజయలక్ష్మి ఎవరు? అనేది ‘29’ మూవీలో చూసి తెలుసుకోవాల్సిందే.