ఏకంగా 9 ఓటీటీల్లో నేరుగా రిలీజ్ అయిన తెలుగు క్రైమ్ రివేంజ్ థ్రిల్లర్ 4 గర్ల్స్- 5 భాషల్లో స్ట్రీమింగ్- ఎక్కడెక్కడంటే?
ఓటీటీలోకి నేరుగా స్ట్రీమింగ్‌కు వచ్చేసిన సినిమా 4 గర్ల్స్. తెలుగులో రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 4 గర్ల్స్ ఏకంగా 9కిపైగా ఓటీటీల్లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే, ఐదు భాషల్లో 4 గర్ల్స్ ఓటీటీ రిలీజ్ అయింది. మరి 4 గర్ల్స్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
తెలుగులో ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో చాలా వరకు థియేటర్లలలో రిలీజ్ అయి ఆ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అయితే, కొన్ని సినిమాలు మాత్రం థియేట్రికల్ రిలీజ్ కాకుండానే ఓటీటీలలో డిజిటల్ ప్రీమియర్ అవుతుంటాయి

రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్
అలాంటి తెలుగు సినిమానే 4 గర్ల్స్. రివేంజ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెకెక్కిన 4 గర్ల్స్ సినిమాను యూనిక్విక్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందించారు. ఈ సినిమాకు యూ నరసింహులు, ఎస్ రమేష్‌లు నిర్మాతలుగా వ్యవహరించారు.
సమాజంలో ఒంటరిగా ఉన్న మహిళలు, అమ్మాయిలపై గ్యాంగ్ రేపులు , మర్డర్స్ జరుగుతున్నాయి . అలా రీసెంట్‌గా జరిగిన ఒక రియల్ ఇంసెడెంట్‌ని బేస్ చేసుకుని ఈ 4 గర్ల్స్ సినిమాను తెరకెక్కించారు దర్శకనిర్మాతలు.
పగ తీర్చుకుందా
బాధిత కుటుంబానికి జరిగిన అన్యాయానికి పోలీసులు ఏం చేశారు ? ఆ కుటుంబం సమాజాన్ని ఎలా ఎదుర్కొంది ? అసలు నేరస్థులు ఎవరు ? వాళ్ల్లు తప్పించుకుంటే నేరస్తుల్ని చనిపోయిన అమ్మాయి అక్క తన స్నేహితురాళ్లతో కలిసి ఎలా కనిపెట్టి పట్టుకుంది?. వాళ్లపై తన చెల్లి కి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకుందా? లేక చట్టానికి అప్పగించిందా? వంటి అంశాలతో ఈ సినిమాను చిత్రీకరించారు.
న్యాయం దొరకనప్పుడు సమాజానికి ఎదురెళ్లి తప్పుడు దారిలోనైనా నేరస్థులను పట్టుకుని తమ చేతులతో శిక్షించి న్యాయానికి ఊపిరిపోయ్యచ్చనే అంశంతో సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో 4 గర్ల్స్ ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు. అయితే, ఏకంగా 9 ఓటీటీల్లోకి నేరుగా 4 గర్స్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
9 ఓటీటీలు-5 భాషలు
అమెజాన్ ప్రైమ్, బీసీఐనీట్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్, హంగామా ప్లే, టాటా ప్లే బింజ్, వాచో, వ్యూడ్, క్లౌడ్ మేకర్, జీసన్‌తోపాటు అమెజాన్ ఫైర్ స్టిక్ యాక్సెస్ ఉన్న టీవీలలో 4 గర్ల్స్ ఓటీటీ రిలీజ్ అయింది. అలాగే, తెలుగు , తమిళం , హిందీ , కన్నడ , మలయాళం వంటి 5 భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఓటీటీలో 4 గర్ల్స్ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ పట్ల నిర్మాతలు తమ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా యూ నరసింహులు, ఎస్ రమేష్ మాట్లాడుతూ.. "మా సినిమాకు అన్ని ప్రముఖ ఓటీటీలలో మంచి రెస్పాన్స్ వస్తుంది. మా మొదటి సినిమానే ఒక మంచి మెసేజ్ ఒరియెంటెడ్ క్రైమ్, రివేంజ్, థ్రిల్లర్ జోనర్‌లో చేసినందుకు ఆనందంగా ఉంది" అని తెలిపారు.
నిర్మాతల కామెంట్స్
"ఈ సందర్భంగా మా సినిమాని డైరెక్ట్‌గా అన్ని ఓటీటీ సంస్థలలో రిలీజ్ చేసిన బీసీఐనీట్ (Bcineet- B Cine Entertainments Private Limited) సంస్థ, బోయపాటి దిలీప్ కుమార్ (Dk Boyapati) గారికి మా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. అందరూ మా సినిమాని చూసి మరింత ఆదరిస్తారని కోరుతున్నాం" అని 4 గర్ల్స్ నిర్మాతలు కోరారు.
ఇదిలా ఉంటే, ఎస్ శివ దర్శకత్వం వహించిన 4 గర్ల్స్ సినిమాలో శృతిక గాఒక్కర్, ఆకాంక్ష వర్మ, దితిప్రియ రాయ్, సెజల్ మాండవియ, అంకుర్, ప్రిన్స్, హన్సి శ్రినివాస్తవ కీలక పాత్రలు పోషించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


