...
...
Next Story

Best Spy Thrillers: మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్.. జియోహాట్‌స్టార్‌లో తప్పక చూడాల్సిన టాప్-7 స్పై అండ్ క్రైమ్ థ్రిల్లర్లు!

Best Spy Thrillers: అండర్ కవర్ మిషన్లు, ఉత్కంఠ రేపే క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్, ఊహించని ప్లాట్ ట్విస్టులతో సాగే స్పై థ్రిల్లర్లకు ఓటీటీలో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. జియోహాట్‌స్టార్ లో ఉన్న అలాంటి అద్భుతమైన కంటెంట్‌పై ఓ లుక్కేయండి. టాప్-7 స్పైఅండ్ క్రైమ్ థ్రిల్లర్లను చూసేయండి

Published on: Jul 6, 2026, 10:22:43 IST
Advertisement

Best Spy Thrillers: యాక్షన్-ప్యాక్డ్ ఇంటెలిజెన్స్ డ్రామాల నుండి మైండ్ గేమ్స్‌తో సాగే సైకోలాజికల్ థ్రిల్లర్స్ వరకు ఎన్నో క్రేజీ షోలు జియోహాట్‌స్టార్‌లో అందుబాటులో ఉన్నాయి. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ అనుభూతిని ఇచ్చే ఆ టాప్-7 సిరీస్‌ల పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

1. స్పెషల్ ఆప్స్ (Special Ops)

మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్.. జియోహాట్‌స్టార్‌లో తప్పక చూడాల్సిన టాప్-7 స్పై అండ్ క్రైమ్ థ్రిల్లర్లు!
మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్.. జియోహాట్‌స్టార్‌లో తప్పక చూడాల్సిన టాప్-7 స్పై అండ్ క్రైమ్ థ్రిల్లర్లు!

ప్రధాన తారాగణం: కే కే మీనన్, కరణ్ టాకర్, వినయ్ పాఠక్.

స్టోరీ: సీనియర్ రా అధికారి హిమ్మత్ సింగ్, అతని నైపుణ్యం కలిగిన అండర్ కవర్ ఏజెంట్ల బృందం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. భారతదేశంలో జరిగిన పలు తీవ్రవాద దాడుల వెనుక ఉన్న మాస్టర్‌మైండ్‌ను పట్టుకోవడానికి వీరు చేసే రహస్య మిషన్లు ఉత్కంఠ రేపుతాయి.

మొదటి సీజన్ విజయవంతం కావడంతో హిమ్మత్ సింగ్ ప్రారంభ రోజులపై ఒక ప్రీక్వెల్, ఆపై రీసెంట్‌గా (2025లో) సీజన్ 2 కూడా వచ్చింది. సీజన్ 2లో భారతదేశపు యూపీఐ (UPI) ఆధారిత ఆర్థిక వ్యవస్థను క్రాష్ చేయాలని చూసే రహస్య ముఠా గుట్టును హీరో ఎలా రట్టు చేశాడనేది చూపించారు. ఓటీటీలో ఇది మాస్టర్ పీస్ గా నిలిచింది.

2. ది నైట్ మేనేజర్ (The Night Manager)

ప్రధాన తారాగణం: అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, శోభితా ధూళిపాళ్ల, తిలోత్తమ శోమే.

స్టోరీ: ప్రసిద్ధ జాన్ లే కార్రే నవల ఆధారంగా వచ్చిన బ్రిటిష్ సిరీస్‌కు ఇది ఇండియన్ అడాప్టేషన్. మాజీ ఆర్మీ ఆఫీసర్ అయిన హీరో.. ఢాకాలోని ఒక లగ్జరీ హోటల్‌లో నైట్ మేనేజర్‌గా చేరతాడు.

ప్రధాన తారాగణం: అర్షద్ వార్సి, బరున్ శోబ్తి, రిధి డోగ్రా.

స్టోరీ: క్రైమ్, సైకాలజీ, మైథాలజీ కలయికతో తెరకెక్కిన సరికొత్త వెబ్ సిరీస్ ఇది. ఫోరెన్సిక్ నిపుణుడైన నిఖిల్ నాయర్, అతని మాజీ మెంటార్ ధనంజయ్ రాజ్‌పుత్.. తమను తాము కలియుగపు అసురుడిగా భావించే ఒక సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి మళ్లీ ఒకటవుతారు. కిల్లర్ ఆడే పిల్లి-ఎలుక ఆటలో వీరు ఎలా చిక్కుకున్నారనేది అద్భుతంగా ఉంటుంది.

4. రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ (Rudra: The Edge of Darkness)

ప్రధాన తారాగణం: అజయ్ దేవగన్, రాశీ ఖన్నా, అతుల్ కులకర్ణి.

స్టోరీ: ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన బ్రిటిష్ సిరీస్ 'లూథర్' (Luther) కు అధికారిక అడాప్టేషన్ ఇది. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సైకోలాజికల్ క్రైమ్ డ్రామాలో డీసీపీ రుద్రవీర్ సింగ్ (అజయ్ దేవగన్) ఒక తెలివైన, కానీ విలక్షణమైన పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ముంబై నగరంలో జరిగే భయంకరమైన నేరాలను చేధించే క్రమంలో న్యాయానికి, వ్యక్తిగత ఆలోచనలకు మధ్య ఉన్న గీతను ఆయన ఎలా దాటాడనేది కథ.

5. ది ఫ్రీలాన్సర్ (The Freelancer)

ప్రధాన తారాగణం: మోహిత్ రైనా, అనుపమ్ ఖేర్.

స్టోరీ: శిరీష్ థోరట్ రాసిన 'ఎ టికెట్ టు సిరియా' పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. ఒక మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్.. మిలిటరీ ఫ్రీలాన్సర్‌గా మారిన తర్వాత తన స్నేహితుడి కుమార్తెను రక్షించే బాధ్యతను తీసుకుంటాడు. ఐసిస్ (ISIS) ఉగ్రవాదుల నియంత్రణలో ఉన్న సిరియాలో చిక్కుకున్న ఆ అమ్మాయిని కాపాడటానికి ఆయన చేసే ప్రాణాలకు తెగించిన పోరాటం థ్రిల్లింగ్‌గా ఉంటుంది.

6. ట్రూ డిటెక్టివ్ (True Detective)

ప్రధాన తారాగణం: మాథ్యూ మెక్కోనాఘే, వుడీ హారెల్సన్ (సీజన్ 1).

స్టోరీ: ఇదొక అంతర్జాతీయ క్రిటికల్లీ అక్లైమ్డ్ ఆంథాలజీ సిరీస్. ప్రతి సీజన్‌లోనూ కొత్త నేరం, కొత్త నటీనటులు ఉంటారు. డార్క్ టోన్, గ్రిట్టీ క్యారెక్టర్లకు ఈ సిరీస్ కేరాఫ్ అడ్రస్. మొదటి సీజన్‌లో ఇద్దరు డిటెక్టివ్‌లు ఒక పాత సీరియల్ కిల్లర్ కేసుకు సంబంధించిన మిస్టరీని చేధించడానికి చేసే ప్రయత్నాలు హారర్ కమ్ థ్రిల్లర్ అనుభూతిని ఇస్తాయి.

7. ది అమెరికన్స్ (The Americans)

ప్రధాన తారాగణం: కేరి రస్సెల్, మాథ్యూ రైస్.

స్టోరీ: కోల్డ్ వార్ కాలం నాటి బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ ఇది. ఎలిజబెత్, ఫిలిప్ జెన్నింగ్స్ అనే ఇద్దరు కేజీబీ స్లీపర్ ఏజెంట్లు.. 1980లలో వాషింగ్టన్ డీసీలో ఒక సాధారణ అమెరికన్ దంపతులుగా నటిస్తూ జీవిస్తుంటారు.

వీరిద్దరి మధ్య బంధం బలపడుతున్న సమయంలోనే.. సోవియట్ ఏజెంట్లను పట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న ఒక ఎఫ్‌బీఐ (FBI) ఏజెంట్ వీరి పక్కింట్లోకి వస్తాడు. ఆ తర్వాత వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయనేదే ఈ పొలిటికల్ స్పై డ్రామా.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks