...
...
Next Story

72nd National Film Awards: నేషనల్ ఫిల్మ్ అవార్డులు 2026.. బెస్ట్ తెలుగు సినిమా ఇదే.. ఏ ఓటీటీలో? సుకుమార్ కు ఓ అవార్డు

72nd National Film Awards: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డులను తాజాగా ప్రకటించింది. ఇందులో బెస్ట్ తెలుగు సినిమాగా అవార్డు అందుకున్న మూవీ ఏదీ? అది ఏ ఓటీటీలో ఉందో? ఓ లుక్కేయండి. మరోవైపు టాప్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఓ అవార్డుకు ఎంపికయ్యాడు.

Updated on: Jul 18, 2026, 18:23:45 IST
Advertisement

72nd National Film Awards: ఇండియన్ సినీ ప్రపంచం, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. శనివారం (జూలై 18) ప్రకటించిన 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రోళ్లు’ అవార్డు అందుకుంది.

నేషనల్ ఫిల్మ్ అవార్డులు

నేషనల్ ఫిల్మ్ అవార్డులు.. బెస్ట్ తెలుగు సినిమా ఇదే.. అందమైన స్నేహం కథ.. ఏ ఓటీటీలో ఉందంటే?
నేషనల్ ఫిల్మ్ అవార్డులు.. బెస్ట్ తెలుగు సినిమా ఇదే.. అందమైన స్నేహం కథ.. ఏ ఓటీటీలో ఉందంటే?

2024లో రిలీజైన సినిమాలకు గాను ఇవాళ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటించారు. ఇందులో ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రోళ్లు’ నిలిచింది. దీనికి యదువంశీ డైరెక్టర్. మెగా డాటర్ కొణిదెల నిహారిక ప్రొడ్యూసర్ గా మారి నిర్మించిన ఫస్ట్ మేజర్ సినిమా ఇది.

కమిటీ కుర్రోళ్లు ఓటీటీ

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో పెద్ద పెద్ద సినిమాలను కమిటీ కుర్రోళ్లు వెనక్కి నెట్టింది. పుష్ప 2, కల్కి 2898 ఏడీ లాంటి చిత్రాలను దాటి మరీ కమిటీ కుర్రోళ్లు ఈ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. నేషనల్ అవార్డు పొందిన ఈ చిత్రం ప్రస్తుతం ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

సుకుమార్ కు అవార్డు

పుష్ప ఫ్రాంఛైజీలతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన డైెరెక్టర్ సుకుమార్ కూడా 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో ఓ అవార్డు సొంతం చేసుకున్నాడు. కానీ అది డైరెక్షన్ కు సంబంధించింది కాదు. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ ఒరిజినల్ గా ‘పుష్ప 2’ సినిమాకు గాను సుకుమార్ ఈ పురస్కారం గెలుచుకున్నాడు.

బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్

తెలుగు సినిమాలకు ఈ అవార్డులూ లభించాయి.

  • బెస్ట్ మేకప్- కమిటీ కుర్రోళ్లు (పి. రవికుమార్)
  • బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్- పుష్ప 2 (దీపాలి నూర్, శీతల్ వర్మ)
  • బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్- కల్కి 2898 ఏడీ (నితిన్ జిహానీ చౌదరి)
  • బెస్ట్ స్క్రీన్ ప్లే డైైలాగ్ రైటర్- లక్కీ భాస్కర్ (వెంకీ అట్లూరి)
  • బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్- 35 చిన్న కథ కాదు (అరుణ్ దేవ్ పోతుల)

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks