...
...
Next Story

Malayalam Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లోని ఈ 9 మలయాళం థ్రిల్లర్ మూవీస్ పిచ్చెక్కిస్తాయి.. ఆ సినిమా క్లైమాక్స్ మరో లెవెల్

Malayalam Thrillers: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఉన్న 9 మలయాళం థ్రిల్లర్ సినిమాలు సూపర్ థ్రిల్ పంచుతాయి. సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే ఈ సినిమాను మిస్ కాకుండా చూడాల్సిందే. మరి ఈ లిస్టులో ఉన్న మూవీస్ ఏవో తెలుసుకొని.. ఏదో ఒక వీకెండ్ ప్లాన్ చేసుకోండి.

Published on: Jun 29, 2026, 16:03:45 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Malayalam Thrillers: రొటీన్ కమర్షియల్ సినిమాలతో బోర్ కొట్టేసిన మూవీ లవర్స్ అంతా ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీ వైపు చూస్తున్నారు. తక్కువ బడ్జెట్‌తో వచ్చి గూస్‌బంప్స్ తెప్పించే స్క్రీన్‌ప్లే, ఊహకందని ట్విస్టులతో మైండ్ బ్లాక్ చేయడం మాలీవుడ్ డైరెక్టర్ల స్పెషాలిటీ.

Malayalam Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లోని ఈ 9 మలయాళం థ్రిల్లర్ మూవీస్ పిచ్చెక్కిస్తాయి.. సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టేవి ఇవే
Malayalam Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లోని ఈ 9 మలయాళం థ్రిల్లర్ మూవీస్ పిచ్చెక్కిస్తాయి.. సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టేవి ఇవే

మీరు కూడా ఈ వీకెండ్‌లో అదిరిపోయే సస్పెన్స్, ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు చూడాలని ప్లాన్ చేస్తుంటే.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న టాప్ 9 బెస్ట్ మలయాళం సినిమాల లిస్ట్ మీకోసం తీసుకొచ్చాం. ఈ సినిమాలు చూస్తున్నంత సేపు సీట్లోంచి అస్సలు కదల్లేరు.

1. జన గణ మన (Jana Gana Mana) - IMDb: 8.3

ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్‌తో ఈ సినిమా కథ స్టార్ట్ అవుతుంది. ఒక పవర్‌ఫుల్ లాయర్ ఈ కేసును టేకప్ చేసిన తర్వాత కథలో వచ్చే ట్విస్టులు దేశ న్యాయవ్యవస్థలోని లోపాలను ప్రశ్నిస్తాయి. కేవలం ఇదొక మర్డర్ మిస్టరీ మాత్రమే కాదు.. అసలు న్యాయం ఎవరి కోసం అనే పాయింట్‌ను అద్భుతంగా చూపించారు.

పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడు మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్‌తో కోర్ట్‌రూమ్ డ్రామాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు. క్లైమాక్స్ ట్విస్ట్ చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే.

2. నాయట్టు (Nayattu) - IMDb: 8

ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు ఒక యాక్సిడెంటల్ క్రైమ్ కేసులో దారుణంగా ఇరుక్కుంటారు. స్థానిక ఎన్నికల టైమ్ కావడంతో రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ఈ ముగ్గురిని బలిపశువులను చేయాలని చూస్తారు.

దాంతో వాళ్లు తమ సొంత డిపార్ట్‌మెంట్ నుంచే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవాల్సి వస్తుంది. సినిమాలో హీరోలు, విలన్లు ఉండరు.. కేవలం పరిస్థితులకు బలైపోయే మనుషులు మాత్రమే కనిపిస్తారు. జోజు జార్జ్, కుంచకో బోబన్ యాక్టింగ్ సినిమాకే హైలైట్.

3. ఇరట్టా (Iratta) - IMDb: 7.7

వీరిద్దరి గతం వెనుక ఉన్న ఒక డార్క్ సీక్రెట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. జోజు జార్జ్ డ్యూయల్ రోల్‌లో జీవించేశారు. ఈ సినిమా ముగింపులో వచ్చే ట్విస్ట్ మీ ఊహకు అస్సలు అందదు. ఒక ఎమోషనల్ అండ్ హార్ట్ బ్రేకింగ్ క్లైమాక్స్ కావాలనుకుంటే ఈ సినిమా మస్ట్ వాచ్.

4. కప్పెలా (Kappela) - IMDb: 7.5

ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన అమ్మాయి రాంగ్ నెంబర్ ద్వారా ఒక ఆటో డ్రైవర్‌తో లవ్‌లో పడుతుంది. అతడిని కలవడానికి ఫస్ట్ టైమ్ సిటీకి వెళ్లినప్పుడు దారిలో ఒక అపరిచిత వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు.

దాంతో ఆ అమ్మాయి లైఫ్ మొత్తం ఒక్కసారిగా మారిపోతుంది. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా సింపుల్‌గా, లవ్ స్టోరీలా సాగినప్పటికీ.. సెకండ్ హాఫ్ నుండి వచ్చే సీట్ ఎడ్జ్ ట్విస్టులు ఊపిరి బిగబట్టుకుని కూర్చునేలా చేస్తాయి.

5. ఆఫీసర్ ఆన్ డ్యూటీ (Officer on Duty) - IMDb: 7.5

వ్యవస్థలోని లోపాలను ఎదిరిస్తూ, రూల్స్ ప్రకారం వెళ్లే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ స్టోరీ ఇది. ఒక సంక్లిష్టమైన క్రైమ్ కేసును పరిష్కరించే కొద్దీ కొత్త మిస్టరీలు బయటపడుతుంటాయి.

కుంచకో బోబన్ తన కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇష్టపడే ఆడియన్స్‌కు ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.

6. అన్వేషిప్పిన్ కండెతుమ్ (Anweshippin Kandethum) - IMDb: 7.4

ఈ సినిమా మనల్ని 1990ల కాలం నాటి కేరళ బ్యాక్‌డ్రాప్‌లోకి తీసుకెళ్తుంది. ఒక మిస్సింగ్ గర్ల్ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న యంగ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ కొన్ని రాజకీయ ఒత్తిళ్ల కారణంగా సస్పెండ్ అవుతాడు.

ఆ తర్వాత అతను సైలెంట్‌గా మొదలుపెట్టిన మరో ఇన్వెస్టిగేషన్ అతడిని ఎలాంటి డేంజర్ లోకి నెట్టిందో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. టొవినో థామస్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ మూవీలో ఎమోషన్స్, థ్రిల్స్ పీక్స్‌లో ఉంటాయి.

7. కురుప్ (Kurup) - IMDb: 7

కేరళ క్రైమ్ హిస్టరీలోనే మోస్ట్ వాంటెడ్ గా ఉన్న ఓ పారిపోయిన నేరస్థుడు 'సుకుమార కురుప్' నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. 1984లో ఒక మర్డర్ చేసి, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం దేశం దాటి వెళ్లిన కురుప్‌ను పట్టుకోవడానికి పోలీసులు దశాబ్దాల పాటు ఎలా ఛేజ్ చేశారనేది కథ.

దుల్కర్ సల్మాన్ తన స్టైలిష్ లుక్స్, యాక్టింగ్‌తో సినిమాను వన్ మ్యాన్ షోగా నడిపించాడు. ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ టాప్ నాచ్‌గా ఉంటాయి.

8. ఫోరెన్సిక్ (Forensic) - IMDb: 6.8

నగరంలో వరుసగా చిన్న పిల్లలు కిడ్నాప్ అయి హత్యలకు గురవుతుంటారు. ఒక సైకో సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి ఒక ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్, ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ కలిసి రంగంలోకి దిగుతారు.

ప్రతీ సీన్ లోనూ సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ డైరెక్టర్ స్క్రీన్‌ప్లే రాసుకున్న తీరు అద్భుతం. టొవినో థామస్ కెరీర్‌లో ఇదొక బిగ్గెస్ట్ హిట్ సినిమా. చివరి నిమిషం వరకు అసలు హంతకుడు ఎవరనేది గెస్ చేయడం చాలా కష్టం.

9. కట్టవుమ్ శిక్షయుమ్ (Kuttavum Shikshayum) - IMDb: 6.3

ఇది కేరళలో జరిగిన ఒక రియల్ బ్యాంక్ దోపిడీ ఆధారంగా తెరకెక్కిన రియలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్. దొంగల ముఠాను పట్టుకోవడానికి ఒక పోలీస్ టీమ్ కేరళ నుండి ఉత్తర భారత దేశానికి వెళ్లి ఎలాంటి రిస్క్ తీసుకున్నారనేది చాలా సహజంగా చూపించారు. ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా, డాక్యుమెంటరీ స్టైల్‌లో సాగే రియలిస్టిక్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe