AK 47 OTT: అఫీషియల్.. నెలలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆదర్శ కుటుంబం.. వెంకీ-త్రివిక్రమ్ మూవీ హిట్టా? అన్ని కోట్ల నష్టమా?
Aadarsha Kutumbam OTT: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’. థియేటర్లలో ఫ్లాప్ గా నిలిచిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీ బాట పట్టనుంది. ఈ చిత్రం స్ట్రీమింగ్ డేట్ పై అఫీషియల్ అప్డేట్ వచ్చింది.
Aadarsha Kutumbam OTT: వరుస విజయాలతో జోరుమీదున్న విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ ‘ఆదర్శ కుటుంబం’. థియేట్రికల్ రిలీజ్ కంటే ముందు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోలేకపోయింది.
అఫీషియల్.. నెలలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆదర్శ కుటుంబం.. వెంకీ-త్రివిక్రమ్ మూవీ హిట్టా? అన్ని కోట్ల నష్టమా?
ఆదర్శ కుటుంబం ఓటీటీ
థియేటర్లలో ఫ్లాప్ గా నిలిచిన ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ చిత్రం నవంబర్ 27 నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ తాజాగా వచ్చింది.
నెల రోజుల్లోనే
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఆదర్శ కుటుంబం సినిమా నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుంది. అక్టోబర్ 30న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు నవంబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో తెలుగు తో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆదర్శ కుటుంబం స్ట్రీమింగ్ కు రానుంది.
ఆదర్శ కుటుంబం హిట్టేనా?
బాక్సాఫీస్ లెక్కల ప్రకారం చూస్తే ఆదర్శ కుటుంబం సినిమా థియేట్రికల్ గా హిట్ కాలేదని చెప్పాలి. ఈ సినిమా కమర్షియల్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. లాంగ్ రన్ లో కూడా కలెక్షన్లు పెద్దగా రాలేదు. దీంతో సినిమా గట్టెక్కలేకపోయింది.
బడ్జెట్ ఇదే
వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన ఆదర్శ కుటుంబం మూవీకి రూ.128 కోట్ల వరకు బడ్జెట్ పెట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అయితే త్రివిక్రమ్- వెంకీ కాంబినేషన్ కావడంతో రిలీజ్ కంటే ముందే హైప్ పెరిగింది. దీంతో థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగింది.
ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లకు పైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబడితే ఈ ఆదర్శ కుటుంబం మూవీగా హిట్ గా నిలిచే పరిస్థితి తలెత్తింది.
రియల్ కలెక్షన్లు
అయితే ఆదర్శ కుటుంబం మూవీ బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి ఈ చిత్రం ఓవరాల్ గా రూ.76 కోట్ల గ్రాస్ రాబట్టిందని టాక్. ఇందులో షేర్ రూ.40 కోట్లు అని సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే ఆదర్శ కుటుంబం సినిమా విడుదలైన ప్రతి ఏరియాలోనూ బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయిందని సమాచారం.
డిస్ట్రిబ్యూటర్లకు ఆదర్శ కుటుంబం సినిమా రూ.30 కోట్ల మేర నష్టాలను మిగిల్చినట్లు ట్రేడ్ లెక్కలు చెప్తున్నాయి. అయితే ఓటీటీ డీల్ రూపంలో ఈ చిత్రానికి రూ.40 కోట్లు దక్కడం మేకర్స్ కు కాస్త ఊరట కలిగించేదని అంటున్నారు.
చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.