Netflix Web Series: పాకిస్థాన్ తొలి నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ వెబ్ సిరీస్ ఇదే.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

Netflix Pakistan Web Series: ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ద్వారా పాకిస్థాన్ తొలి ఒరిజినల్ సిరీస్ ‘జో బచే హై సంగ్ సమేట్ లో’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫవాద్ ఖాన్, మహీరా ఖాన్, సనమ్ సయీద్ వంటి అగ్ర తారలు నటించిన ఈ భారీ ప్రాజెక్ట్ స్ట్రీమింగ్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.

Published on: Nov 23, 2026, 15:54:38 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Netflix Pakistan Web Series: అంతర్జాతీయ కంటెంట్‌కు ఇండియాలోనూ విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే భారతీయ ఓటీటీ ప్రేక్షకుల్లోనూ విశేష ఆదరణ ఉన్న పాకిస్థానీ డ్రామాలు ఇప్పుడు మరో కీలక మైలురాయిని చేరుకుంటున్నాయి. పాకిస్థాన్ నుంచి వస్తున్న మొట్టమొదటి నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ‘జో బచే హై సంగ్ సమేట్ లో’ ఎట్టకేలకు విడుదల తేదీని ఖరారు చేసుకుంది.

పాకిస్థాన్ తొలి నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ వెబ్ సిరీస్ ఇదే.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
పాకిస్థాన్ తొలి నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ వెబ్ సిరీస్ ఇదే.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

ప్రముఖ ఉర్దూ నవల ఆధారంగా

ప్రముఖ రచయిత్రి ఫర్హత్ ఇష్తియాక్ 2013లో రాసిన బెస్ట్ సెల్లింగ్ ఉర్దూ నవల ‘జో బచే హై సంగ్ సమేట్ లో’ ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. గతంలో సూపర్ హిట్ డ్రామాలకు కథలు అందించిన ఆమె రచన కావడంతో ఈ సిరీస్ కథాంశంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇద్దరి పరిచయం

ఈ వెబ్ సిరీస్ కథ ప్రధానంగా సికందర్, లిజా అనే ఇద్దరు వ్యక్తుల ఎమోషనల్ ప్రయాణం చుట్టూ తిరుగుతుంది. హార్వర్డ్ లా విద్యార్థి అయిన సికందర్ జీవితంలో జరిగిన ఒక ఊహించని విషాదం అతడిని అందరికీ దూరంగా, ఒంటరిగా మార్చేస్తుంది. మరోవైపు కళాకారిణి లిజా గతానికి సంబంధించిన చేదు జ్ఞాపకాలతో బాధపడుతుంది.

ఇటలీలో ఈ ఇద్దరూ అనుకోకుండా కలుసుకుంటారు. ఆ తర్వాత వీరిద్దరి జీవితాలు ఎలా మలుపు తిరిగాయి, ఒకరికొకరు ఎలా తోడుగా నిలిచారు అనేది ఈ ఓటీటీ వెబ్ సిరీస్ స్టోరీ.

భారీ తారాగణం!

ఈ వెబ్ సిరీస్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకడానికి ప్రధాన కారణం ఇందులోని స్టార్ క్యాస్ట్. ‘హమ్‌సఫర్’, ‘జిందగీ గుల్జార్ హై’ వంటి షోలతో భారతదేశంలోనూ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఫవాద్ ఖాన్, మహీరా ఖాన్, సనమ్ సయీద్ ఈ సిరీస్‌లో కలిసి నటించడం విశేషం.

వీరితో పాటు అహద్ రజా మీర్, హంజా అలీ అబ్బాసీ, హానియా అమీర్, ఇక్ర అజీజ్, మాయా అలీ, బిలాల్ అష్రఫ్ వంటి పాపులర్ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

డిసెంబర్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో

పాకిస్థాన్, యూకేతో పాటు ఇటలీలోని అందమైన లోకేషన్లలో అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. భావోద్వేగాలు, ప్రేమ, బాధ కలగలిసిన కథనం కావడంతో ఫ్యామిలీ, రొమాంటిక్ డ్రామాలను ఇష్టపడే వారికి ఇది మంచి విందులా ఉండనుంది.

డిసెంబర్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్న ‘జో బచే హై సంగ్ సమేట్ లో’ సిరీస్.. అంతర్జాతీయ స్థాయిలో దక్షిణాసియా కథలకు ఎలాంటి ఆదరణ తెచ్చిపెడుతుందో చూడాలి. ముఖ్యంగా ఫవాద్ ఖాన్, మహీరా ఖాన్ జోడీని మళ్లీ స్క్రీన్‌పై చూసేందుకు భారతీయ ఓటీటీ ప్రియులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.