చాలా కాలం నుంచి ఓ హిట్ కోసం వెయిట్ చేసిన హీరో ఆది సాయి కుమార్ కు ఇప్పుడు డబుల్ డిలైట్. అతని ఆనందం ఇప్పుడు రెట్టింపైంది. ఓ వైపు అతని రీసెంట్ మూవీ శంబాల హిట్ గా నిలిచింది. మరోవైపు ఆది భార్య అరుణ ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆది సాయి కుమార్ శనివారం (జనవరి 3) ఇన్ స్టాగ్రామ్ లో ఓ క్యూట్ పోస్ట్ తో పంచుకున్నాడు.
మరోసారి తండ్రిగా ఆది

సీనియర్ నటుడు సాయి కుమార్ తనయుడు ఆది సాయికుమార్ మరోసారి తండ్రి అయ్యాడు. అతని భార్య అరుణ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే వీళ్లకు ఓ కూతురు ఉంది. ఆమె పేరు అయాన. ఇప్పుడు ఆదికి కొడుకు పుట్టాడు. ఈ ఆనందాన్ని క్యూట్ పోస్టుతో పంచుకున్నాడు ఆది. తన బాబు లిటిల్ ఫింగర్స్ తో పాటు ఇది అబ్బాయి చెప్తూ ఫొటోలు పోస్టు చేశాడు.
2014లో పెళ్లి
‘‘మన రెండో బిడ్డకు వెల్ కమ్ చెప్తున్నాం. ఇప్పుడు అబ్బాయి పుట్టాడు. జనవరి 2, 2026’’ అని ఆది ఇన్ స్టాగ్రామ్ లో శనివారం పోస్టు పెట్టాడు. ఈ పోస్టు వైరల్ గా మారింది. సెలబ్రిటీలు, ఫ్యాన్స్ అతనికి కంగ్రాట్స్ చెప్తూ పోస్టులు పెడుతున్నారు. 2014లో రాజమండ్రికి చెప్పిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అరుణను పెళ్లి చేసుకున్నాడు ఆది. ఈ దంపతులకు ఇప్పటికే ఓ కూతురు ఉంది.
శంబాలతో హిట్
సాయి కుమార్ వారసుడిగా ఆది సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. 2011లో డెబ్యూ చేశాడు. కానీ ఈ 15 ఏళ్లలో 25 సినిమాలు చేసినా హిట్లు మాత్రం అంతంతమాత్రమే. దీంతో ఓ మంచి హిట్ కోసం ఆది, అతని తండ్రి సాయి కుమార్ పరితపించిపోయారు. ఎట్టకేలకు ఇప్పుడు శంబాల మూవీతో ఆ వెయిటింగ్ కు ఎండ్ కార్డు వేశాడు ఆది. డిసెంబర్ 25న క్రిస్మస్ రోజు శంబాల రిలీజైంది.
రూ.16.20 కోట్లు
{{/usCountry}}సాయి కుమార్ వారసుడిగా ఆది సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. 2011లో డెబ్యూ చేశాడు. కానీ ఈ 15 ఏళ్లలో 25 సినిమాలు చేసినా హిట్లు మాత్రం అంతంతమాత్రమే. దీంతో ఓ మంచి హిట్ కోసం ఆది, అతని తండ్రి సాయి కుమార్ పరితపించిపోయారు. ఎట్టకేలకు ఇప్పుడు శంబాల మూవీతో ఆ వెయిటింగ్ కు ఎండ్ కార్డు వేశాడు ఆది. డిసెంబర్ 25న క్రిస్మస్ రోజు శంబాల రిలీజైంది.
రూ.16.20 కోట్లు
{{/usCountry}}డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన హారర్ థ్రిల్లర్ శంబాల హిట్ టాక్ తో సాగిపోతుంది. ఈ మూవీ వారం రోజుల్లో రూ.16.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఆది కెరీర్ లోనే ఇది అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా.
2011లో ప్రేమ కావాలి సినిమాతో తెరంగేట్రం చేశాడు ఆది సాయి కుమార్. ఆ మూవీ హిట్ గా నిలిచింది. అంతేకాదు బెస్ట్ మేల్ డెబ్యూగా ఈ సినిమాకు ఆది ఫిల్మ్ ఫేర్, సైమా అవార్డులూ గెలుచుకున్నాడు. ఆ తర్వాత చాలా సినిమాలే చేసినా పెద్దగా హిట్లు దక్కలేదు. ఇప్పుడు శంబాలతో కాస్త రిలీఫ్ దొరికింది.