సూపర్ హిట్ కోసం హీరో ఆది సాయి కుమార్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆది సాయి కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ శంబాల. తెలుగులో హారర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్‌గా శంబాల తెరకెక్కింది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మాతలుగా ఈ సినిమాను నిర్మించారు.
యుగంధర్ ముని దర్శకత్వం

యగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ శంబాల మూవీలో అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్, ఇంద్రనీల్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. శంబాల సినిమాను డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు.
ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన శంబాల టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ఆడియెన్స్‌ను మెప్పించాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో అంచనాల్ని మరింతగా పెంచేందుకు తాజాగా శంబాల మిస్టిక్ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని చేత ఆదివారం (డిసెంబర్ 21) నాడు విడుదల చేయించారు.
పంచభూతాల్ని శాసించే
ఆకాశం నుంచి ఓ ఉల్క పడటంతో శంబాల ట్రైలర్ మొదలైంది. ‘పంచభూతాల్ని శాసిస్తుందంటే ఇది సాధారణమైనది కాదు’.. అనే డైలాగ్‌తో ఆ ఉల్క శక్తిని చూపించారు. ఇక ఊర్లో అందరూ వింతగా ప్రవర్తిస్తుండటం, ఆ ఉల్కను కట్టడి చేసేందుకు పూజలు చేయడం, మఠాధిపీఠాల్ని తీసుకు రావడం చూపించారు.
ఇక మిస్టరీని ఛేదించేందుకు నాస్తికుడైన హీరో రంగంలోకి దిగడం మీ ‘కాశీ, కాకమ్మ, మజిలీ కథలు ఊరి జనాలకు చెప్పండి.. నాక్కాదు’ అని అనడం చూస్తే అతని పాత్ర ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఊర్లో వరుసగా హత్యలు, ఆత్మహత్యలు జరుగుతుంటాయి.
ఊరికి వ్యతిరేకంగా
‘ఇప్పటి నుంచి మీ పిచ్చితనానికి ఎవ్వరినీ బలికానివ్వను.. అది ఆవైనా సరే.. చీమైనా సరే’ అని హీరో పరిష్కారం కనిపెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఊరికి వ్యతిరేకంగా హీరో చేసే పోరుని ట్రైలర్లోనే అద్భుతంగా చూపించారు.
{{/usCountry}}‘ఇప్పటి నుంచి మీ పిచ్చితనానికి ఎవ్వరినీ బలికానివ్వను.. అది ఆవైనా సరే.. చీమైనా సరే’ అని హీరో పరిష్కారం కనిపెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఊరికి వ్యతిరేకంగా హీరో చేసే పోరుని ట్రైలర్లోనే అద్భుతంగా చూపించారు.
{{/usCountry}}ఇక ఇందులో ప్రవీణ్ కె బంగారి చూపించిన విజువల్స్, శ్రీ చరణ్ పాకాల ఆర్ఆర్ మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటుందనిపిస్తోంది. ట్రైలర్ చివరి సీన్ మాత్రం ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టించినట్టుగా అనిపిస్తుంది.
శాస్త్రం వర్సెస్ సైన్స్
భయపెట్టే సీన్స్, అదిరిపోయే విజువల్స్‌తో శంబాల ట్రైలర్ ఉత్కంఠంగా సాగింది. శాస్త్రం వర్సెస్ సైన్స్ నేపథ్యంగా శంబాల మూవీని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే ‘శంబాల’ మేకర్లకు లాభసాటి ప్రాజెక్ట్‌గా మారింది. అన్ని రకాల హక్కులు హాట్ కేకులా అమ్ముడయ్యాయి.
రిలీజ్‌కు ముందే టేబుల్ ప్రాఫిట్స్‌తో శంబాల నిర్మాతలు హ్యాపీగా ఉన్నారు. ఇక డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ నేపథ్యంలో విడుదలైన ట్రైలర్, టీజర్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.
శంబాల నటీనటులు
శంబాల సినిమాలో ఆది సాయి కుమార్, అర్చన అయ్యర్, స్వాసిక విజయ్, మధు నందన్, రవివర్మ, మీసాల లక్ష్మణ్, షిజు మీనన్, హర్ష వర్ధన్, శివ కార్తీక్, ఇంద్రనీల్, శైలజ ప్రియ, చైత్ర, రామరాజు, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్, రంగధం, శ్రావణ సంధ్య తదితరులు నటించారు.