OTT Deal: దుల్కర్ సల్మాన్, దర్శకుడు పవన్ సాదినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఫీల్-గుడ్ డ్రామా 'ఆకాశంలో ఒక తార' (Aakasamlo Oka Tara) థియేట్రికల్ విడుదలకు ముందే బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం ఆల్-లాంగ్వేజ్ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకుందని తెలిసింది. కేవలం ఓటీటీ రైట్స్ ద్వారానే మూవీ బడ్జెట్ మొత్తం రికవర్ అయిపోవడం విశేషం.
నెట్‌ఫ్లిక్స్ రూ.60 కోట్ల డీల్

ఇటీవల విడుదలైన 'ఆకాశంలో ఒక తార' టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సినిమాపై అంచనాలను పెంచేసింది. ఒక స్పూర్తిదాయకమైన జీవిత ప్రయాణాన్ని ఆవిష్కరించే కథాంశంతో వస్తున్న ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థల మధ్య గట్టి పోటీ నెలకొంది. చివరకు నెట్‌ఫ్లిక్స్ అన్ని భాషల (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ) స్ట్రీమింగ్ హక్కులను రూ.60 కోట్లకు సొంతం చేసుకుందని తెలిసింది.
సేఫ్ జోన్ లోకి మూవీ
ఒక కంటెంట్-డ్రివెన్ డ్రామా చిత్రానికి థియేట్రికల్ రిలీజ్‌కి ముందే కేవలం డిజిటల్ బిజినెస్ ద్వారానే బడ్జెట్ అంతా రికవర్ అవ్వడం సౌత్ ఇండస్ట్రీలో అరుదైన రికార్డుగా నిలిచింది. దీంతో ఈ ఆకాశంలో ఒక తార ప్రాజెక్ట్ థియేటర్లలోకి రాకముందే ఓటీటీ డీల్ తో నిర్మాతలు పూర్తి సేఫ్ జోన్‌లోకి వెళ్లడమే కాకుండా భారీ లాభాల్లోకి అడుగుపెట్టారు.
వైజయంతీ, గీతా ఆర్ట్స్ కలిసి
దర్శకుడు పవన్ సాదినేని ఈ చిత్రాన్ని ఎమోషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ రైడ్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత, సినీ దిగ్గజం గుణ్ణం గంగరాజు కథ, స్క్రీన్‌ప్లే అందించడం సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారింది. నూతన నటి సాత్విక వీరపల్లి ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమవుతుండగా, స్టార్ నటి శ్రుతి హాసన్ ఒక కీలకమైన, పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.
ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలైన వైజయంతీ మూవీస్, గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్, లైట్ బాక్స్ మీడియా సంయుక్తంగా అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని నవంబర్ 20, 2026న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు.
దుల్కర్ సల్మాన్ ఓటీటీ ట్రాక్ రికార్డ్
{{/usCountry}}ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలైన వైజయంతీ మూవీస్, గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్, లైట్ బాక్స్ మీడియా సంయుక్తంగా అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని నవంబర్ 20, 2026న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు.
దుల్కర్ సల్మాన్ ఓటీటీ ట్రాక్ రికార్డ్
{{/usCountry}}'మహానటి', 'సీతా రామం', 'లక్కీ భాస్కర్' వంటి చిత్రాల వరుస విజయాలు దుల్కర్ మార్కెట్‌ను ప్యాన్-ఇండియా స్థాయికి తీసుకెళ్లాయి. మలయాళం, తెలుగు, తమిళం మరియు హిందీ భాషల్లో సబ్‌స్క్రైబర్‌లను ఆకట్టుకునే శక్తి ఆయనకు ఉండటం వల్లే నెట్‌ఫ్లిక్స్ రూ.60 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించడానికి వెనుకాడలేదని టాక్.