...
...
Next Story

Aamani: చిరంజీవితో సినిమా ఛాన్స్..సంబరపడ్డ సీనియర్ హీరోయిన్.. కానీ పేపర్లో మరో హీరోయిన్ పేరు చూసి షాక్.. ఆమని కామెంట్లు

Aamani: మెగాస్టార్ చిరంజీవి అంటే ఉండే క్రేజ్ వేరు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆయనతో సినిమాల్లో నటించేందుకు హీరోయిన్లు పోటీ పడుతూనే ఉంటారు. అయితే సీనియర్ హీరోయిన్ ఆమనికి ఈ ఛాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారింది. ఈ విషయంపై ఆమని షాకింగ్ కామెంట్లు చేసింది.

Published on: Apr 28, 2026, 12:30:10 IST
Advertisement

Aamani: ఆమని.. ఈ సీనియర్ నటి గురించి పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఆమని ఇప్పుడు సినిమాల్లో, సీరియల్స్ లో ప్రధాన పాత్రలు చేస్తోంది. తెలుగులో ఎన్నో సూపర్ డూపర్ హిట్ మూవీస్ లో ఆమని నటించింది. అయితే మెగాస్టార్ చిరంజీవితో మాత్రం సినిమా చేయలేకపోయానని ఆమని తాజాగా ఫీల్ అయింది.

చిరంజీవితో సినిమా

ఆమని, చిరంజీవి (instagram)
ఆమని, చిరంజీవి (instagram)

మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని అలనాటి తారల నుంచి ఇప్పటి హీరోయిన్ల వరకూ అందరూ ఎదురు చూస్తుంటారు. కానీ కొంతమందికే ఆ ఛాన్స్ వస్తుంది. సీనియర్ నటి ఆమని కూడా తాను హీరోయిన్ గా చేస్తున్న రోజుల్లో చిరంజీవితో మూవీ చేయాలని తెగ ఆరాటపడింది. కానీ ఛాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారిందిన చెప్తూ ఆమని ఇప్పుడు బాధపడింది.

మెగాస్టార్ ను చూస్తూ

చిరంజీవి గురించి ఆమని మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. ‘‘నా చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూసేదాన్ని. మెగాస్టార్ ఫ్యాన్ అయిపోయా. ఆయన నా డ్రీమ్ హీరో. రాధ, విజయశాంతి వాళ్లు చిరు పక్కన నటిస్తుంటే చూశా. వాళ్లలాగే నేనూ ఏదో ఒక రోజు చిరు పక్కన నటిస్తానని అనుకున్నా’’ అని ఆమని చెప్పింది.

పేపర్లో పేరు

చిరంజీవితో సినిమా చేసే అవకాశం జస్ట్ లో మిస్ అయిందని ఆమని వెల్లడించింది. ఏ కొండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి రిక్షావోడు సినిమాలో ఆమనిని హీరోయిన్ గా అనుకున్నారు. దీనికి ఆమని సంతోషంగా ఒప్పుకొంది. ఆ మూవీలో సౌందర్య కూడా ఓ హీరోయిన్ కావడంతో ఆమని మరింత హ్యాపీగా ఫీల్ అయింది.

సిస్టర్ గా చేయమంటే

అయితే చిరంజీవితో కలిసి సినిమా చేసే ఛాన్స్ ఆమనికి మళ్లీ వచ్చింది. కానీ ఈ సారి ఆమని నో చెప్పింది. ఎందుకంటే స్టాలిన్ సినిమాలో చిరంజీవి అక్క క్యారెక్టర్ కోసం ఆమనిని సంప్రదించారని ఆమె చెప్పింది. కానీ డ్రీమ్ హీరో పక్కన సిస్టర్ గా చేయలేనని ఆ మూవీ వదులుకున్నానని ఆమని వివరించింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks