బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ తన కుమారుడు జునైద్ ఖాన్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. సాయి పల్లవితో కలిసి అతడు నటిస్తున్న ఏక్ దిన్ మూవీ ట్రైలర్ ఈ మధ్యే వచ్చిన విషయం తెలిసిందే. జునైద్ తన కెరీర్ విషయంలో చాలా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటాడని, ఏదైనా ప్రాజెక్ట్ సైన్ చేసే ముందు తనను సంప్రదించడని ఆమిర్ పేర్కొన్నాడు. 'వెరైటీ ఇండియా'కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో అతడు ఈ విషయాలను పంచుకున్నాడు.
'ఏక్ దిన్', 'సయ్యారా' మధ్య పోలికలపై..

జునైద్ ఖాన్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న 'ఏక్ దిన్' (Ek Din) సినిమా ట్రైలర్ రిలీజ్ కావడంతో దీనిని చాలా మంది గతేడాది వచ్చిన సయ్యారా మూవీతో పోలుస్తున్నారు. దీనిపై ఆమిర్ ఖాన్ స్పందించాడు.
సయ్యారా సినిమాలోని అల్జీమర్స్ (జ్ఞాపకశక్తి కోల్పోవడం) నేపథ్యంలో ఉంటుందా అని అడగగా.. ఆమిర్ నవ్వుతూ ఆ వార్తలను తోసిపుచ్చాడు. "ఏక్ దిన్ పూర్తిగా భిన్నమైన సినిమా. ఇది చాలా కాలం తర్వాత మనం చూడబోతున్న ఒక క్లాసిక్ లవ్ స్టోరీ" అని స్పష్టం చేశాడు.
జునైద్ గురించి ఆమిర్ ఖాన్ ఏమన్నాడంటే?
తమ ఇంట్లో తండ్రి, పిల్లల మధ్య కంటే స్నేహితుల మధ్య ఉండే సంబంధమే ఎక్కువగా ఉంటుందని ఆమిర్ అన్నాడు. "జునైద్, ఐరా, ఆజాద్‌లతో నాది చాలా సింపుల్ ఈక్వేషన్. ఇక జునైద్ విషయానికొస్తే.. వాడు సరిగ్గా నా లాగే ఉంటాడు. సినిమాపై, స్క్రిప్ట్‌పై వాడికి మంచి పట్టు ఉంది. అంతేకాదు జునైద్ చాలా మొండివాడు" అని ఆమిర్ కొనియాడాడు.
జునైద్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడంపై ఆమిర్ మాట్లాడుతూ.. "జునైద్‌కు నాలుగు ఏళ్ల వయసున్నప్పుడు నేనే చెస్ నేర్పించాను. కానీ వాడు 18 ఏళ్ల వయసులో నన్ను మొదటిసారి ఓడించాడు. ఇప్పుడు నేను ఎంత ప్రయత్నించినా వాడిపై గెలవలేకపోతున్నాను. అలాగే వాడు సినిమాల విషయంలో కూడా నన్ను అడగడు. ఇప్పటికే ఏక్తా కపూర్ నిర్మాణంలో ఒక సినిమాతో పాటు మరో ప్రాజెక్ట్ కూడా సైన్ చేశాడు. తన నిర్ణయాలు తనే తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది" అని వివరించాడు.
'ఏక్ దిన్' మూవీ విశేషాలు
ఏక్ దిన్ మూవీలో జునైద్ ఖాన్, సాయి పల్లవి జంటగా నటించారు. సునీల్ పాండే డైరెక్ట్ చేశాడు. మే 1న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇది 2016 నాటి థాయ్ సినిమా 'వన్ డే'కి రీమేక్ అని సమాచారం. జపాన్‌లోని సపోరో ప్రాంతంలో ఈ సినిమాను చిత్రీకరించారు. ఈ మూవీని జపాన్ లో ఎందుకు తీశారో చూస్తే తెలుస్తుందని ఆమిర్ చెప్పాడు.
{{/usCountry}}ఏక్ దిన్ మూవీలో జునైద్ ఖాన్, సాయి పల్లవి జంటగా నటించారు. సునీల్ పాండే డైరెక్ట్ చేశాడు. మే 1న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇది 2016 నాటి థాయ్ సినిమా 'వన్ డే'కి రీమేక్ అని సమాచారం. జపాన్‌లోని సపోరో ప్రాంతంలో ఈ సినిమాను చిత్రీకరించారు. ఈ మూవీని జపాన్ లో ఎందుకు తీశారో చూస్తే తెలుస్తుందని ఆమిర్ చెప్పాడు.
{{/usCountry}}రామ్ సంపత్ సంగీతం అందిస్తుండగా, ఇర్షాద్ కామిల్ సాహిత్యం అందించాడు. జునైద్ ఖాన్ ఇప్పటికే 'మహారాజ్' మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకోగా, రొమాంటిక్ డ్రామాగా వస్తున్న 'ఏక్ దిన్' పై భారీ అంచనాలు ఉన్నాయి.