...
...
Next Story

Aamir Khan: అమీర్ ఖాన్ ను చంపేస్తాం.. కలకలం రేపుతున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్.. మూడో పెళ్లి , లవ్ జిహాద్!

Aamir Khan: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ క్రిమినల్ ముఠా నుంచి ప్రాణాపాయ బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్ట్, వాయిస్ నోట్‌పై ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మూడో పెళ్లి, లవ్ జిహాద్ ఆరోపణలే కారణమని తెలుస్తోంది.

Published on: Jul 18, 2026, 13:36:11 IST
Advertisement

Aamir Khan: భారతీయ చలనచిత్ర పరిశ్రమను జైలు నుంచే శాసిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా మరోసారి బాలీవుడ్‌ను వణికించింది. ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్క స్టార్ హీరో చుట్టూ తిరిగిన ఈ ముఠా పగ, ఇప్పుడు మరో టాప్ ఖాన్ వైపు మళ్లడం బి-టౌన్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. అమీర్ ఖాన్ ను చంపేస్తామంటూ ఈ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి.

లవ్ జిహాద్ ఆరోపణలు!

అమీర్ ఖాన్ ను చంపేస్తాం.. కలకలం రేపుతున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్.. మూడో పెళ్లి , లవ్ జిహాద్! (PTI)
అమీర్ ఖాన్ ను చంపేస్తాం.. కలకలం రేపుతున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్.. మూడో పెళ్లి , లవ్ జిహాద్! (PTI)

జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. లారెన్స్ బిష్ణోయ్ అనుచరులుగా చెప్పుకుంటున్న అర్జూ బిష్ణోయ్, టైసన్ బిష్ణోయ్ అనే వ్యక్తులు ఫేస్‌బుక్‌లో ఈ వివాదాస్పద పోస్ట్ పెట్టారు. అమీర్ ఖాన్ తన వ్యక్తిగత జీవితంలో మూడో వివాహం చేసుకోవడం ద్వారా 'లవ్ జిహాద్'ను ప్రోత్సహిస్తున్నాడని వారు నేరుగా ఆరోపించారు.

స్టార్‌డమ్ పేరుతో ఇలాంటి పనులను సమాజంలో ప్రమోట్ చేసే వారి నోళ్లు మూయిస్తామని, తమ పద్ధతిలో బుద్ధి చెబుతామని ఆ పోస్ట్‌లో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అమీర్ ఖాన్ ను చంపేస్తామని ఇండైరెక్ట్ గానే బెదిరిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

రాజస్థాన్ ఘటనతో లింక్

ఈ బెదిరింపు పోస్ట్‌లో కేవలం అమీర్ ఖాన్ ప్రస్తావనే కాకుండా, గత నెలలో రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో జరిగిన 13 ఏళ్ల బాలిక అపహరణ, లైంగిక దాడి కేసును కూడా వారు లేవనెత్తారు. ఆ కేసులో నిందితులను కాపాడాలని చూస్తున్న రాజకీయ నాయకులకు ఇదే మొదటి, చివరి హెచ్చరిక అంటూ.. ఒకవేళ చట్టం నుంచి ఎవరైనా తప్పించుకోవాలని చూస్తే తామే శిక్షిస్తామని పేర్కొన్నారు.

రంగంలోకి దిగిన ముంబై పోలీసులు

గత కొన్నేళ్లుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు సల్మాన్ ఖాన్ మాత్రమే ప్రధాన టార్గెట్ గా ఉంటూ వచ్చారు. 1998లో జరిగిన కృష్ణజింకల వేట కేసు (Blackbuck Case) వల్ల బిష్ణోయ్ కమ్యూనిటీ సెంటిమెంట్ దెబ్బతిందనే పగతో 2024 ఏప్రిల్‌లో సల్మాన్ ఇంటి బయట కాల్పుల వరకు వెళ్లారు.

కానీ ఇప్పుడు అమీర్ ఖాన్‌ను టార్గెట్ చేయడం వెనుక ఎలాంటి పాత పగ లేదు. కేవలం ‘లవ్ జిహాద్’, సామాజిక అంశాలను అస్త్రంగా చేసుకుని, బాలీవుడ్‌లో తమ పేరు వింటేనే కలిగే భయాన్ని మరింత విస్తరించుకోవడానికి ఈ క్రిమినల్ ముఠా ప్రయత్నిస్తోందని స్పష్టమవుతోందని అంటున్నారు.

అమీర్ ఖాన్ మూడో పెళ్లి

రీసెంట్ గా అమీర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకున్నాడు. జూలై 5న తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ గౌరీ స్ప్రాట్ ను పెళ్లాడాడు. ముంబైలోని ఈ హీరో ఇంట్లో ఈ పెళ్లి చాలా సింపుల్ గా జరిగింది. తన ముగ్గురు పిల్లల సమక్షంలోనే అమీర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకోవడం ట్రోల్స్ కు దారితీసింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks