...
...
Next Story

Aamir Khan Third Marriage: ముగ్గురు పిల్లల సమక్షంలో అమీర్ ఖాన్ మూడో పెళ్లి.. ఫొటో వైరల్.. వర్షంలోనూ సంబరాలు.. గెస్ట్ లు!

Aamir Khan Third Marriage: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆదివారం తన లాంగ్‌టైమ్ పార్ట్‌నర్ గౌరీ స్ప్రాట్‌ను అధికారికంగా వివాహం చేసుకున్నాడు. తన ముగ్గురు పిల్లల సమక్షంలో ఈ వెడ్డింగ్ జరగడం గమనార్హం. 61వ ఏట అమీర్ ఖాన్ మూడో పెళ్లి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Published on: Jul 5, 2026, 14:15:33 IST
Advertisement

Aamir Khan Third Marriage: బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ అమీర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకున్నాడు. గత కొంతకాలంగా తనతో రిలేషన్‌షిప్‌లో ఉన్న గౌరీ స్ప్రాట్‌ను అతను పెళ్లాడాడు. ముంబై బాంద్రా (పాలి హిల్) లోని అమీర్ ఖాన్ స్వగృహంలో ఆదివారం (జూలై 5) నాడు ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగింది.

అమీర్ ఖాన్ మూడో పెళ్లి

ముగ్గురు పిల్లల సమక్షంలో అమీర్ ఖాన్ మూడో పెళ్లి.. జోరు వర్షంలోనూ సంబరాలు
ముగ్గురు పిల్లల సమక్షంలో అమీర్ ఖాన్ మూడో పెళ్లి.. జోరు వర్షంలోనూ సంబరాలు

బాలీవుడ్ సీనియర్ హీరో అమీర్ ఖాన్ మూడో పెళ్లి తంతు ముగిసింది. తన ముగ్గురు పిల్లల సమక్షంలో అమీర్ ఖాన్.. గౌరీ స్ప్రాట్ తో రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నాడు. గత రెండు సంవత్సరాలుగా డేటింగ్‌లో ఉన్న ఈ జంటకు ఒకరినొకరు 25 ఏళ్లుగా పరిచయం ఉండటం విశేషం. పెళ్లి తంతు ముగిసినట్లు అమీర్ ఖాన్ అధికారిక ప్రతినిధి మీడియాకు కన్ఫామ్ చేశాడు. వీళ్ల ఫొటో వైరల్ గా మారింది.

వర్షంలోనూ పెళ్లి సంబరాలు

గడిచిన రెండు రోజులుగా ముంబై నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ, అమీర్ ఖాన్ ఇంట్లో పెళ్లి పనులకు ఎలాంటి ఆటంకం కలగలేదు. పాలి హిల్‌లోని ఆయన బంగ్లాను రంగురంగుల వినూత్న దీపాలు, పూల అలంకరణలతో ముస్తాబు చేశారు. శనివారం నుంచే ఈవెంట్ ప్లానర్లు, వర్కర్లు రైన్‌కోట్లు వేసుకుని మరీ డెకరేషన్ పనులను పూర్తి చేయడం విశేషం.

గెస్ట్ లు వీళ్లే

అమీర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ వెడ్డింగ్ కు విదేశాల నుంచి కూడా కొందరు గెస్ట్ లు వచ్చారు. మొత్తం దాదాపు 150 మంది ఈ వివాహానికి అటెండ్ అయినట్లు తెలిసింది. ఇందులో అమీర్ ఖాన్ ముగ్గురు పిల్లలు (జునైద్ ఖాన్, ఇరా ఖాన్, ఆజాద్ రావు ఖాన్) లతో పాటు, గౌరీ స్ప్రాట్ కుమారుడు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ముకేశ్ అంబానీ కుటుంబం కూడా ఈ పెళ్లి హాజరైందని సమాచారం.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks