Aamir Khan: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి వార్త ఇప్పుడు బి-టౌన్‌లో సెన్సేషన్‌గా మారింది. బుధవారం (జూన్ 3) ప్రముఖ మీడియా సంస్థ 'హాటర్‌ఫ్లై' (Hauterrfly) తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన డీటెయిల్స్ ప్రకారం.. ఆమిర్ ఖాన్ తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను ఈ ఏడాది జులైలో అఫీషియల్‌గా పెళ్లి చేసుకోబోతున్నారు.
జులై 5న సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్

బాలీవుడ్ స్టార్ వెడ్డింగ్ అనగానే భారీ హంగామా, డెస్టినేషన్ వెడ్డింగ్స్ గుర్తొస్తాయి. కానీ ఆమిర్ ఖాన్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఈ వివాహ వేడుకకు సంబంధించి అత్యంత నమ్మకమైన వర్గాలు చెబుతున్న వివరాలు ఇలా ఉన్నాయి. ఈ పెళ్లి జులై 5న జరగనుంది.
ఎలాంటి హడావుడి లేకుండా, అత్యంత సింపుల్‌గా ఇంట్లోనే కేవలం రిజిస్టర్డ్ మ్యారేజ్ పద్ధతిలో చేసుకోనున్నారు. ఈ ప్రైవేట్ ఫంక్షన్‌కు రెండు కుటుంబాల సభ్యులతో పాటు, అత్యంత సన్నిహితులైన కొద్దిమంది ఫ్రెండ్స్ మాత్రమే రానున్నారు.
గత ఏడాది కాలంగా ఆమిర్, గౌరీ ఇద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతున్న ఈ జంట.. ఇప్పుడు కుటుంబ సభ్యుల సమక్షంలో తమ బంధాన్ని అఫీషియల్‌గా మార్చుకోవాలని డిసైడ్ అయ్యారు.
“ఇప్పటికి నా లైఫ్ కంప్లీట్ అయింది”
రీసెంట్‌గా ఏప్రిల్ నెలలో 'నవభారత్ టైమ్స్'కు ఇచ్చిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ తన కొత్త రిలేషన్‌షిప్ గురించి చాలా ఎమోషనల్ అయ్యారు.
"గౌరీని కలవడం, మా ఇద్దరి జర్నీ స్టార్ట్ అవ్వడం నిజంగా నా అదృష్టం. ఆమెతో ఉంటే నా మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. నా మాజీ భార్యలు కిరణ్ రావు, రీనా దత్తాలతో కూడా నాకు మంచి బాండింగ్ ఉండేది.. కానీ కొన్ని కారణాల వల్ల అవి వర్కవుట్ అవ్వలేదు. గౌరీ నా లైఫ్‌లోకి రావడం దేవుడిచ్చిన వరంలా ఫీల్ అవుతున్నాను. మేమిద్దరం కలిసి చాలా హ్యాపీగా ఉన్నాము. ఇప్పటికి నేను పూర్తిగా పరిపూర్ణమయ్యానని అనిపిస్తోంది" అని అమీర్ తన మనసులోని మాటలను పంచుకున్నారు.
గత ఏడాది మార్చిలో తన 60వ బర్త్‌డే వేడుకల్లో ఆమిర్ ఖాన్ తన గర్ల్‌ఫ్రెండ్ గౌరీని ముంబై మీడియాకు పరిచయం చేశారు. అప్పటి నుండి వీరిద్దరూ బాలీవుడ్ ఈవెంట్లలో కలిసి సందడి చేస్తూనే ఉన్నారు.
ఆమిర్ ఖాన్ పెళ్లిళ్ల టైమ్‌లైన్
{{/usCountry}}గత ఏడాది మార్చిలో తన 60వ బర్త్‌డే వేడుకల్లో ఆమిర్ ఖాన్ తన గర్ల్‌ఫ్రెండ్ గౌరీని ముంబై మీడియాకు పరిచయం చేశారు. అప్పటి నుండి వీరిద్దరూ బాలీవుడ్ ఈవెంట్లలో కలిసి సందడి చేస్తూనే ఉన్నారు.
ఆమిర్ ఖాన్ పెళ్లిళ్ల టైమ్‌లైన్
{{/usCountry}}ఆమిర్ ఖాన్ ఇప్పటికే ఇద్దరిని పెళ్లిళ్లు చేసుకొని విడాకులు ఇచ్చారు. 2002లో రీనా దత్తాను పెళ్లి చేసుకోగా.. వారికి జునైద్ ఖాన్, ఇరా ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక 2005లో కిరణ్ రావును పెళ్లి చేసుకోగా.. వాళ్లకు ఆజాద్ ఖాన్ పుట్టాడు. గతేడాది నుంచి గౌరీతో ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు ఆమెను మూడో పెళ్లి చేసుకోబోతున్నారు.
సినిమాల విషయానికొస్తే..
గతంలో వచ్చిన 'లాల్ సింగ్ చడ్డా' (2022) డిజాస్టర్ తర్వాత.. ఆమిర్ ఖాన్ గత ఏడాది 'సితారే జమీన్ పర్' సినిమాతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు. అలాగే 'హ్యాపీ పటేల్: ఖతర్నాక్ జాసూస్' సినిమాలో ఒక చిన్న క్యామియో రోల్ కూడా చేశారు.
ఇక ఈ మధ్యే ఆయన ప్రొడ్యూసర్‌గా.. తన కొడుకు జునైద్ ఖాన్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ఏక్ దిన్ మూవీ రిలీజ్ కాగా.. అది తీవ్రంగా నిరాశ పరిచింది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
ఆమిర్ ఖాన్ మూడో భార్య కాబోతున్న గౌరీ ఎవరు?
గౌరీ బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ గర్ల్‌ఫ్రెండ్. గత ఏడాది కాలంగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఆమిర్ తన 60వ బర్త్‌డే రోజున ఆమెను మీడియాకు అఫీషియల్‌గా పరిచయం చేశారు.
ఆమిర్ ఖాన్ - గౌరీల పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరగనుంది?
ఈ పెళ్లి జులై 5న అత్యంత ప్రైవేట్‌గా, కేవలం ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో ఇంట్లోనే సింపుల్ రిజిస్టర్ పద్ధతిలో జరగనుంది.
ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ నటించిన లేటస్ట్ సినిమా ఏది?
ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్‌లో జునైద్ ఖాన్, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా 'ఏక్ దిన్' (Ek Din). ఇది బాక్సాఫీస్ దగ్గర దారుణంగా విఫలమైంది.