Aaya Sher Full Song: నేచురల్ స్టార్ నాని (Nani) కథానాయకుడిగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ మాస్ యాక్షన్ డ్రామా 'ది పారడైజ్' (The Paradise) నుంచి బ్లాక్‌బస్టర్ చార్ట్‌బస్టర్ 'ఆయా షేర్' (Aaya Sher) ఫుల్ వీడియో సాంగ్ అఫీషియల్‌గా విడుదలైంది. అనిరుధ్ రవిచందర్ అందించిన హై-వోల్టేజ్ బీట్స్‌కి నాని వేసిన సిగ్నేచర్ ఊరమాస్ స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.
అనిరుధ్ మ్యాజికల్ బీట్స్.. నాని సిగ్నేచర్ మాస్ హుక్ స్టెప్స్

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో 'దసరా' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన ది పారడైజ్ మూవీలో ఈ ఆయా షేర్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మూవీ ఎలా ఉన్నా.. థియేటర్లలో ఈ పాట రాగానే ఆడియెన్స్ రచ్చ లేపారు. దాదాపు ప్రతి థియేటర్లో మాస్ స్టెప్పులతో బాగా ఎంజాయ్ చేశారు. ఇన్నాళ్లూ ఈ పాట ఫుల్ వీడియో కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న అభిమానులకు మేకర్స్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు.
కాసర్ల శ్యామ్ రాసిన మాస్ లిరిక్స్‌కి జంగి రెడ్డి, అర్జున్ చండి, అనిరుధ్ తమ వాయిస్‌తో నెవర్ బిఫోర్ ఎనర్జీని అందించారు. ఈ పాటలోని ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా, కంటిన్యూయస్ మాస్ వైబ్‌తో సాగిపోతుంది.
పాటలో నాని చూపించిన బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్, డిఫరెంట్ మేనరిజమ్స్ నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయి. ముఖ్యంగా నాని వేసిన హుక్ స్టెప్‌తో రీల్స్, షార్ట్స్ ప్లాట్‌ఫామ్‌లలో కుర్రకారు ఫుల్ సందడి చేస్తున్నారు.
ది పారడైజ్ స్టోరీ, బాక్సాఫీస్ వసూళ్లు
'పారడైజ్' ప్రాంతంలో ఎలాంటి గుర్తింపు, హక్కులు లేకుండా జీవిస్తున్న సవారి సమాజం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. 7 వేల మందితో స్థిరపడిన జాతి పేరు సవారీలు. దేశం కోసం పోరాడిన ఈ కుటుంబాలు ప్రభుత్వ రికార్డుల్లో గుర్తింపు ఉండదు. అందుకోసం తరాలుగా పోరాటం చేస్తూనే ఉంటారు. వీరిని చిన్నచూపు చూస్తూ అణగదొక్కుతూ, ఎదురు తిరిగిన వారిని చంపేస్తుంటుంది శిఖంజా మాలిక్ (మోహన్ బాబు) కుటుంబం.
{{/usCountry}}'పారడైజ్' ప్రాంతంలో ఎలాంటి గుర్తింపు, హక్కులు లేకుండా జీవిస్తున్న సవారి సమాజం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. 7 వేల మందితో స్థిరపడిన జాతి పేరు సవారీలు. దేశం కోసం పోరాడిన ఈ కుటుంబాలు ప్రభుత్వ రికార్డుల్లో గుర్తింపు ఉండదు. అందుకోసం తరాలుగా పోరాటం చేస్తూనే ఉంటారు. వీరిని చిన్నచూపు చూస్తూ అణగదొక్కుతూ, ఎదురు తిరిగిన వారిని చంపేస్తుంటుంది శిఖంజా మాలిక్ (మోహన్ బాబు) కుటుంబం.
{{/usCountry}}ఆ అణచివేతపై తిరగబడే కొద్దిమందిలో సమ్మక్క (సొనాలి కులకర్ణి) ఒకరు. మాలిక్ చిత్రహింసల మధ్య ఇద్దరు కవలలకు జన్మనిచ్చినిస్తుంది సమ్మక్క. తన కొడుకు జడల్ (నాని) సవారీలకు నాయకుడై గుర్తింపు సాధిస్తాడని కలలుకంటుంది.
కానీ తల్లి అంటే ఏమాత్రం ఇష్టం లేని జడల్.. సవారీలకు నాయకుడు అయ్యాడా? తన జాతికి గుర్తింపు తెచ్చాడా? అసలు అతని జడల్ అనే పేరు ఎందుకొచ్చింది? చిన్నతనంలోనే జడల్ జైలుకెందుకెళ్లాడు? జడల్ అంటే ఇష్టపడే సుబ్బు (కయాదు లోహర్) ఎవరు? అనేది తెలియాలంటే ది పారడైజ్ చూడాల్సిందే.
ఈ సినిమాకు తొలి షో నుంచే మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినా బాక్సాఫీస్ దగ్గర మాత్రం దుమ్ము రేపింది. ఇప్పటి వరకూ రూ.170 కోట్లకుపైగా వసూలు చేసింది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.88 కోట్ల గ్రాస్ సాధించినా.. తర్వాత మిక్స్‌డ్ రివ్యూలతో వసూళ్లు పడిపోతూ వచ్చాయి.