...
...
Next Story

OTT Malayalam: మస్ట్ వాచ్ మలయాళం మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్.. సైబర్ స్కామ్‌లపై అమ్మాయి పోరాటం.. ఒక్కో ట్విస్ట్ అదుర్స్

OTT Malayalam: మల్లూవుడ్ నుంచి వచ్చిన మరో వినూత్నమైన ఎక్స్‌పెరిమెంటల్ సైబర్ థ్రిల్లర్ అండ్ ఫ్యామిలీ డ్రామా ఓటీటీలో అడుగుపెట్టింది. ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ సైబర్ స్కామ్‌ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ట్విస్ట్ లు మామూలుగా లేవు. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ డీటెయిల్స్ చూసేయండి.

Published on: Aug 13, 2026, 13:03:48 IST
Advertisement

OTT Malayalam: డిజిటల్ నేరాలు, సైబర్ స్కామ్‌లు రోజురోజుకూ పెరుగుతున్న ప్రస్తుత కాలంలో.. దానికి ఫ్యామిలీ ఎమోషన్స్‌ను జోడించి తెరకెక్కించిన మలయాళ చిత్రం ‘అచ్యుత అవతారం’ (Achyuta Avataaram). పునీత్ ఆరాధ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవికా నందన్ టైటిల్ రోల్ (అచ్యుత) పోషించింది.

అచ్యుత అవతారం ఓటీటీ

మస్ట్ వాచ్ మలయాళం మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్.. సైబర్ స్కామ్‌లపై అమ్మాయి పోరాటం.. ఒక్కో ట్విస్ట్ అదుర్స్
మస్ట్ వాచ్ మలయాళం మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్.. సైబర్ స్కామ్‌లపై అమ్మాయి పోరాటం.. ఒక్కో ట్విస్ట్ అదుర్స్

జులై 17, 2026న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ మైండ్ బెండింగ్ థ్రిల్లర్ అచ్యుత అవతారం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ (ఆగస్టు 13) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్‌కు అవుతోంది. కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రావడంతో సౌత్ ఓటీటీ వీక్షకులు ఈ సినిమాపై తీవ్ర ఆసక్తి చూపుతున్నారు.

ఒక సామాన్య యువతి పోరాటం

ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న 'డిజిటల్ అరెస్ట్', ఫేక్ కాల్స్, ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌ల వంటి యథార్థ పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ అచ్యుత అవతారం కథ సాగుతుంది.

అచ్యుత అనే సాధారణ యువతి, ఆమె కుటుంబం ఒక గ్రామంలో ప్రశాంతంగా జీవిస్తుంటారు. అయితే, అనూహ్యంగా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన సైబర్ క్రిమినల్స్ దాడిలో ఆ కుటుంబం తమ కష్టార్జితాన్ని, దాచుకున్న సొమ్మునంతటినీ ఆన్‌లైన్ స్కామ్‌లో కోల్పోతుంది.

రివేంజ్ కోసం

పోలీసులు, వ్యవస్థ నుంచి తగిన న్యాయం జరగకపోవడంతో.. అచ్యుత స్వయంగా రంగంలోకి దిగుతుంది. తన కుటుంబాన్ని రోడ్డున పడేసిన ఆన్‌లైన్ ఫ్రాడ్‌స్టర్స్ ను పట్టుకోవడానికి డిజిటల్ అండర్‌వర్ల్డ్‌లోకి అడుగుపెడుతుంది.

వీకెండ్‌లో మంచి ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ సైబర్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి ‘అచ్యుత అవతారం’ ప్రైమ్ వీడియోలో ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks