ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా నటించిన 'ధురంధర్' (Dhurandhar) సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా విజయంపై సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ స్పందిస్తూ.. విమర్శకులపై గట్టిగా ఫైర్ అయ్యారు. ఈ సినిమాను కేవలం ఓ దుష్ప్రచారం (propaganda) కోసం తీశారని విమర్శించిన వాళ్లకు.. ఈ సక్సెస్ ఒక గట్టి చెంపపెట్టు అని ఆయన వ్యాఖ్యానించారు.
ధురంధర్ మూవీపై విమర్శలు

రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ డైరెక్షన్ లో వచ్చిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్'. ఈ సినిమా రిలీజ్ కి ముందే కొంతమంది ఇది ఒక వర్గానికి మద్దతుగా తీసిన ప్రాపగాండా సినిమా అంటూ విమర్శలు చేశారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకుపైగా వసూలు చేసింది. దీనిపై అనుపమ్ ఖేర్ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు.
అనుపమ్ ఖేర్ ఏమన్నారంటే..
అనుపమ్ ఖేర్ శనివారం (డిసెంబర్ 27) ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. తాను ధురంధర్ మూవీ గురించి మాట్లాడటానికే దీనిని పోస్ట్ చేస్తున్నట్లు చెప్పాడు. "నాకు ఈ సినిమాలో ఎలాంటి రోల్ లేదు. కానీ దీని సక్సెస్ చూస్తుంటే మనసుకి చాలా ప్రశాంతంగా, గర్వంగా ఉంది" అని అనడం విశేషం.
"గతంలో నా సినిమాలు 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్', 'ది కశ్మీర్ ఫైల్స్' వచ్చినప్పుడు కూడా ఒక సెక్షన్ ఆడియన్స్ ఇలాగే 'ప్రాపగాండా' అంటూ ముద్ర వేసి వాటిని దెబ్బకొట్టాలని చూశారు. అందులో వాళ్లు కొంతవరకు సక్సెస్ అయ్యారు కూడా.. కానీ 'ధురంధర్' విషయంలో ఆడియన్స్ వాళ్ళ ఆటలు సాగనివ్వలేదు. సినిమాను ఆదరించి, విమర్శకులకు గట్టి సమాధానం చెప్పారు. 'మాకు ఏం చూడాలో మీరు నీతులు చెప్పొద్దు' అని ప్రేక్షకులు ఆ వర్గానికి చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారు" అని అనుపమ్ అన్నాడు.
క్లాసిక్ సినిమాలతో పోలిక
అంతేకాకుండా గాడ్ ఫాదర్, షోలే, మొఘల్-ఏ-ఆజం లాంటి క్లాసిక్స్ లిస్టులో నిలిచిపోయే సత్తా ఈ సినిమాకు ఉందని, డైరెక్టర్ ఆదిత్య ధర్ ఏ ఫార్ములాను నమ్ముకోకుండా.. కేవలం కథను నమ్మి సినిమా తీశారని మెచ్చుకున్నారు.
{{/usCountry}}అంతేకాకుండా గాడ్ ఫాదర్, షోలే, మొఘల్-ఏ-ఆజం లాంటి క్లాసిక్స్ లిస్టులో నిలిచిపోయే సత్తా ఈ సినిమాకు ఉందని, డైరెక్టర్ ఆదిత్య ధర్ ఏ ఫార్ములాను నమ్ముకోకుండా.. కేవలం కథను నమ్మి సినిమా తీశారని మెచ్చుకున్నారు.
{{/usCountry}}అనుపమ్ ఖేర్ వీడియోపై డైరెక్టర్ ఆదిత్య ధర్ స్పందించారు. "మీ మాటలు విని ఎమోషనల్ అయ్యాను సార్. గొప్ప సినిమాలతో నా సినిమాను పోల్చడం నాకు దక్కిన గౌరవం. నిజాయితీగా సినిమాలు తీయడానికి మీ మాటలు బలాన్నిస్తాయి" అని రిప్లై ఇచ్చారు.
డిసెంబర్ 5, 2025న రిలీజైన ఈ సినిమా కేవలం 21 రోజుల్లోనే రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరి 2025లో నెంబర్ 1 సినిమాగా నిలిచింది. పాకిస్తాన్ లోని బలోచ్ గ్యాంగ్ లోకి ఎంటర్ అయ్యే ఇండియన్ స్పై కథతో ఇది తెరకెక్కింది. దీని సీక్వెల్ 'ధురంధర్-2' మార్చి 2026లో రాబోతోంది.