Posani Krishna Murali On MP Raghunandan Rao CM Role: ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి నిర్మిస్తూ, స్వీయ దర్శకత్వంలో ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా "ఆపరేషన్ అరుణారెడ్డి". ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, ఎడిటింగ్ బాధ్యతలు కూడా పోసాని కృష్ణమురళి వహిస్తుండటం విశేషం.
ఆపరేషన్ అరుణారెడ్డి ప్రెస్ మీట్

ఈ మూవీలో హిందోళ చక్రవర్తి, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్, బీజేపీ నేత రఘునందన్ రావు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈరోజు (మే 7) హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో "ఆపరేషన్ అరుణారెడ్డి" చిత్ర విశేషాలు తెలిపారు దర్శక నిర్మాత, నటుడు పోసాని కృష్ణమురళి.
పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. "ఇది నిజాయితీపరులైన జర్నలిస్టుల కథ. జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సొసైటీ బాగుపడుతుంది అనేది ఈ చిత్ర కథాంశం. హిందోళ చక్రవర్తి అరుణారెడ్డి అనే జర్నలిస్ట్ క్యారెక్టర్‌లో నటిస్తోంది. ఆమెది లీడ్ రోల్" అని అన్నారు.
"రాజకీయాల్లోకి ప్రజాసేవ కోసం ఎవరు వచ్చారో, వ్యాపారం కోసం ఎవరు వచ్చారో ఆమె పాత్ర ప్రజల్ని హెచ్చరిస్తుంది. ఆ జర్నలిస్టు చేసిన హెచ్చరికలతో ప్రజలు ఎలా అప్రమత్తమయ్యారు, రాజకీయ నాయకుల ఎంపికలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది ఈ చిత్రంలో ఆసక్తికరంగా తెరకెక్కించాం" అని పోసాని తెలిపారు.
సమాజంలో ఉండకూడదనుకుంటారు
"ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవారు సమాజంలో ఉండకూడదు అనుకుంటారు చాలామంది. ఇలాంటి మంచి జర్నలిస్టు కొందరు చేసిన రాజకీయాలకు రోడ్డున పడే పరిస్థితి వస్తే ఒక మంచి ముఖ్యమంత్రి ఆమెకు హెల్ప్ చేస్తాడు. ఇలాంటి అమ్మాయి జర్నలిజంలో ఉండాలని అండగా నిలబడతాడు. ఆ సీఎం పాత్రలో ఎంపీ రఘునందన్ రావు గారు నటించారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా" అని పోసాని చెప్పారు.
"ఈ సినిమాకు పాలిటిక్స్‌కు ఎలాంటి సంబంధం లేదు. వందశాతం సిన్సియర్‌గా చేసిన సినిమా ఇది. ఆపరేషన్ అరుణారెడ్డి మూవీ స్క్రీన్ ప్లే.. ఇండియాలోనే ఒక బెస్ట్ స్క్రీన్ ప్లే అవుతుందని గర్వంగా చెప్పగలను. నా కెరీర్లో కూడా ఇది బెస్ట్ స్క్రీన్ ప్లేగా పేరు తెచ్చుకుంటుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా ఏం జరుగుతుందో ఊహించలేరు. ఈ సినిమా ప్రజలకు బాగా నచ్చుతుందని నమ్ముతున్నా. అన్ని వర్గాల ప్రేక్షకులు భయం లేకుండా ఈ సినిమాను చూడొచ్చు" అని పోసాని వెల్లడించారు.
{{/usCountry}}"ఈ సినిమాకు పాలిటిక్స్‌కు ఎలాంటి సంబంధం లేదు. వందశాతం సిన్సియర్‌గా చేసిన సినిమా ఇది. ఆపరేషన్ అరుణారెడ్డి మూవీ స్క్రీన్ ప్లే.. ఇండియాలోనే ఒక బెస్ట్ స్క్రీన్ ప్లే అవుతుందని గర్వంగా చెప్పగలను. నా కెరీర్లో కూడా ఇది బెస్ట్ స్క్రీన్ ప్లేగా పేరు తెచ్చుకుంటుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా ఏం జరుగుతుందో ఊహించలేరు. ఈ సినిమా ప్రజలకు బాగా నచ్చుతుందని నమ్ముతున్నా. అన్ని వర్గాల ప్రేక్షకులు భయం లేకుండా ఈ సినిమాను చూడొచ్చు" అని పోసాని వెల్లడించారు.
{{/usCountry}}"తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్, జనసేన, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు.. ఇలా అందరూ ఈ చిత్రాన్ని చూడొచ్చు. వాళ్లందరికీ నచ్చే చిత్రమిది. వంద చిత్రాలకు కథా స్క్రీన్ ప్లే రాసిన అనుభవం నాకుంది. అలాగే ఎడిటింగ్ అంటే ఇష్టం. నేను ఏం చేయగలనో అదే ఈ చిత్రంలో చేశాను. రఘునందన్ రావు గారు అంటే నాకు ఇష్టం. నేనంటే ఆయనకు అభిమానం. ఈ చిత్రంలో సీఎం పాత్ర ఆయన చేస్తే బాగుంటుందని అనిపించింది. రఘునందన్ రావు గారు కూడా కథ విని బాగుంది మురళి నేను చేస్తా అన్నారు. ఈ సినిమాతో ఆయనకు ఇంతే సంబంధం" అని పోసాని పేర్కొన్నారు.
ఒక్క బూతు ఉండదు
"ఈ సినిమాలో ఒక్క బూతు గానీ, ఒక్క అసభ్యమైన సన్నివేశం గానీ ఉండదు. తమిళనాట విజయ్ లాంటి మంచి వ్యక్తి గెలవడం సంతోషంగా ఉంది. అతన్ని డీఎంకే, ఎన్నాడీఎంకే లాంటి పార్టీలు అనవసరంగా టార్గెట్ చేస్తున్నాయి. రాజకీయంగా బెటర్ అనుకున్నవారికి సపోర్ట్ చేశా. ఈ క్రమంలో ఎన్టీఆర్, చంద్రబాబు, చిరంజీవి, జగన్ ఇలా అందరి నాయకులకు సహకారం అందించా. అయితే ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించలేదు. ఏ పదవులూ తీసుకోలేదు. ఏ పార్టీలో నాకు సభ్యత్వం లేదు" అని పోసాని కృష్ణమురళి అన్నారు.
"వైసీపీ ప్రభుత్వంలో ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా పనిచేశా. అది కూడా నంది అవార్డ్స్‌ను సక్రమంగా నిర్వహించాలని అప్పటి ప్రభుత్వం కోరితే ఆ పదవి తీసుకున్నా. నా అధ్వర్యంలో నిర్వహించిన నంది అవార్డ్స్ కార్యక్రమాన్ని అప్పటి విపక్ష మీడియా కూడా అభినందించింది. మీ అందరి సహకారంతో మరిన్ని మంచి చిత్రాలు చేయాలని అనుకుంటున్నా" అని పోసాని కృష్ణమురళి ముగించారు.