...
...
Next Story

Ram Kapoor: నా తండ్రి చనిపోవడానికి నేనే సాయం చేశా: నటుడి ఎమోషనల్ కామెంట్స్ వైరల్.. ఓటీటీ లైవ్ షోలో వెల్లడించిన యాక్టర్

Ram Kapoor: బాలీవుడ్ నటుడు రామ్ కపూర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓటీటీ షో లైవ్ లోనే అతడు తన తండ్రి చనిపోవడానికి తాను ఎలా సాయం చేశాడో వివరించడం అక్కడున్న అందరినీ కంటతడి పెట్టించింది. ఇంతకీ ఏం జరిగిందో చూడండి.

Published on: Jul 28, 2026, 14:51:18 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Ram Kapoor: పాపులర్ బాలీవుడ్, టీవీ యాక్టర్ రామ్ కపూర్ రియాలిటీ షో 'లాక్ అప్' (Lock Upp) వేదికగా చెప్పిన ఒక పర్సనల్ సీక్రెట్ ఇండస్ట్రీని, అభిమానులను తీవ్ర షాక్‌కి గురిచేస్తోంది. క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తండ్రి ప్రశాంతంగా ప్రాణాలు వదిలేందుకు తానే స్వయంగా సాయం చేశానంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఈ షాకింగ్ నిజాన్ని విన్న షోలోని మిగతా కంటెస్టెంట్లు అందరూ ఉద్వేగానికి లోనై ఏడ్చేశారు.

Ram Kapoor: నా తండ్రి చనిపోవడానికి నేనే సాయం చేశా: నటుడి ఎమోషనల్ కామెంట్స్ వైరల్.. ఓటీటీ లైవ్ షోలో వెల్లడించిన యాక్టర్
Ram Kapoor: నా తండ్రి చనిపోవడానికి నేనే సాయం చేశా: నటుడి ఎమోషనల్ కామెంట్స్ వైరల్.. ఓటీటీ లైవ్ షోలో వెల్లడించిన యాక్టర్

ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న 'లాక్ అప్ 2' ఫినాలే వారానికి దగ్గరవుతుండటంతో కంటెస్టెంట్లు తమ సీక్రెట్స్ బయటపెట్టాల్సి వచ్చింది. నటుడు హర్షద్ చోప్రా.. రామ్ కపూర్‌ను నామినేట్ చేయడంతో ఆయన ఈ చేదు నిజాన్ని పంచుకున్నారు.

క్యాన్సర్‌తో పోరాడుతూ ఆసుపత్రిలో తండ్రి చివరి కోరిక

రామ్ కపూర్ తన తండ్రికి 63 ఏళ్ల వయసులో పాంక్రియాటిక్ క్యాన్సర్ (ప్యాంక్రియాస్ క్యాన్సర్) సోకిందని వెల్లడించారు. ఆ సమయంలో ఆపరేషన్ చేయడం కుదరకపోవడంతో 18 సార్లు కీమోథెరపీ చేయించుకుని కోలుకున్న ఆయన.. మరో 10 ఏళ్ల పాటు చాలా సంతోషంగా జీవించారు. కానీ కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో 73 ఏళ్ల వయసులో ఆయనకు క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టింది.

సింగపూర్‌లో ఉన్న తండ్రి నుంచి రామ్‌కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. నొప్పులు, కీమోథెరపీ బాధలు తట్టుకుంటూ మళ్లీ ఆసుపత్రి బెడ్‌పై పోరాడటం తన వల్ల కాదని, ప్రశాంతంగా కన్నుమూయాలని ఉందంటూ ఆ తండ్రి కొడుకుని కోరారు. "ఐసీయూలో నన్ను ఒంటరిగా వదిలేయొద్దు. నా చేయి పట్టుకుని నేను ప్రశాంతంగా వెళ్లడానికి సాయం చేయి" అని రామ్ కపూర్ నుంచి ఆయన మాట తీసుకున్నారు.

5 ఏళ్లుగా మాట్లాడని తల్లి, చెల్లి.. రామ్ కపూర్ ఆవేదన

"నా తల్లి, చెల్లి ఐదేళ్ల నుంచి నాతో సంబంధాలు తెంచుకున్నారు. అయినా సరే ఒక కొడుకుగా నా తండ్రికి నేను చేసిన మంచి పని ఇదేనని భావిస్తున్నా" అని రామ్ ఎమోషనల్ అయ్యారు. చావును అంత దగ్గరగా చూడటం వల్ల జీవితంపై తనకున్న భయం పోయిందని, తండ్రి చనిపోయిన తర్వాతే తాను నిజంగా జీవించడం మొదలుపెట్టానని ఆయన చెప్పుకొచ్చారు.

'లాక్ అప్' ఇంట్లో కన్నీళ్ల పర్యంతం.. హర్షద్ చోప్రా రియాక్షన్

రామ్ కపూర్ ఈ సీక్రెట్ బయటపెట్టగానే షో హౌస్‌లోని ప్రసిద్ధ నటుడు హర్షద్ చోప్రా కూడా తీవ్రంగా చలించిపోయారు. హర్షద్ కూడా తన తల్లిని క్యాన్సర్ వల్ల కోల్పోయిన విషయాన్ని గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. హౌస్‌మేట్స్ అందరూ రామ్ కపూర్‌ను చుట్టుముట్టి ఆయన్ను ఓదార్చారు.

ఫరా ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్ హోస్ట్ చేస్తున్న ఈ 'లాక్ అప్' షో నెట్‌ఫ్లిక్స్‌లో శనివారం నుంచి గురువారం వరకు రాత్రి 8 గంటలకు స్ట్రీమ్ అవుతోంది. 'బడే అచ్ఛే లగ్తే హై', 'కసమ్ సే' లాంటి హిట్ సీరియల్స్‌తో పాటు 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' లాంటి సినిమాల్లో నటించిన రామ్ కపూర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతున్నాయి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe