తప్పుగా మాట్లాడాను.. క్షమించండి.. ఆ రెండు మాటలు అనాల్సింది కాదు.. నా ఉద్దేశం మంచిదే: దిగి వచ్చిన శివాజీ
నటుడు శివాజీ దిగి వచ్చాడు. తాను చేసిన కామెంట్స్ కు క్షమాపణ చెప్పాడు. తన ఉద్దేశం మంచిదే అయినా.. రెండు అనకూడని మాటలు అన్నానని, తనను క్షమించాలని కోరుతూ ఓ సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశాడు.
హీరోయిన్లు చీరలే కట్టుకోవాలని, సామాన్లు కనిపించేలా డ్రెస్సులు వేసుకోకూడదని కామెంట్స్ చేసిన నటుడు శివాజీ దిగి వచ్చాడు. తాను తప్పు చేశానని, క్షమించాలని కోరుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. దండోరా అనే మూవీ ఈవెంట్ లో శివాజీ చేసిన కామెంట్స్ దుమారం రేగడం.. అనసూయ, చిన్మయిలాంటి వాళ్లు ఘాటుగా స్పందించడంతో శివాజీ దిగివచ్చాడు.

శివాజీ క్షమాపణ వీడియో
నటుడు శివాజీ మంగళవారం (డిసెంబర్ 23) సాయంత్రం ఓ వీడియోను ఎక్స్‌లో రిలీజ్ చేశాడు. అందులో అతడు మహిళలందరికీ క్షమాపణ చెప్పాడు.
“నాలుగు మంచి మాటలు చెప్పాలని చెబుతూనే రెండు అనకూడని మాటలు అన్నాను. వాళ్ల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి క్షమాపణ చెబుతున్నాను. ఆ మాటలు అందరు అమ్మాయిలను ఉద్దేశించి చేసినవి కావు. నేను ఎవరినీ అవమానపరచాలని చేయలేదు. నేను ఎప్పుడూ స్త్రీ అంటే అమ్మవారిలాగే, మహాశక్తిలాగే చూస్తాను. సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనకు తెలుసు. ఆ అవకాశం ఇవ్వకూడదనే అలా అన్నాను. నా ఉద్దేశం సరైనదే. కానీ ఆ రెండు మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది” అని శివాజీ అన్నాడు.
అసలు ఏం జరిగిందంటే?
దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు శివాజీ హీరోయిన్లు వేసుకొనే బట్టల విషయంలో చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి.
‘‘ఒక విషయం చెబుతున్నా. అమ్మాయిలు, హీరోయిన్లు ఏ బట్టలు పడితే అవి వేసుకుని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తదమ్మా. ఏం అనుకోవద్దు హీరోయిన్లందరూ, మీరు అనుకున్నా నాకు పోయేదేం లేదు. లైట్ తీసుకుంటాం అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనే, నిండుగా కప్పుకొనే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాన్లు కనపడేదాంట్లో ఏముండదమ్మా’’ అని శివాజీ అన్నారు.
‘‘అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దరిద్రపు ము*.. ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుంది? మంచివి వేసుకోవచ్చు కదా అని అనాలని ఉంటుంది లోపల. కానీ అనలేం కదా. అంటే మళ్లీ స్ట్రీ స్వాతంత్రం లేదంటారు’’ అని శివాజీ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు.
స్త్రీ అంటే ప్రకృతి
‘‘స్త్రీ అంటే ప్రకృతి. ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ ఎప్పటికీ గుండెల్లో కనిపిస్తూ ఉంటుంది. సావిత్రి, సౌందర్య కానీ ఈ జనరేషన్ లో రష్మిక లాంటి వాళ్లు. చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్లందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి వెంబడే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలి. ఇక్కడి (చేతులు) వరకు ఉంటే పర్వాలేదు కానీ ఇక్కడి (ఎద) వరకూ రాకూడదు’’ అని శివాజీ మాట్లాడాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


