టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు శ్రీవిష్ణు నటించిన మూవీ విష్ణు విన్యాసం (Vishnu Vinyasam). ఈ సినిమా ఫిబ్రవరి 28న థియేటర్లలో రిలీజ్ కానుంది. వాస్తు, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ పిచ్చి ఉండే వ్యక్తిగా ఇందులో అతడు నటించాడు. టీజర్ ఫన్నీగా సాగిపోగా.. ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్లో శ్రీవిష్ణు చేసిన కామెంట్స్ కూడా అలాగే ఉన్నాయి.
నీ అక్క డైలాగుపై..

శ్రీవిష్ణు నటిస్తున్న విష్ణు విన్యాసం మూవీ టీజర్ బుధవారం (ఫిబ్రవరి 18) రిలీజైంది. తన మార్క్ కామెడీతో ఈ మూవీలోనూ అతడు నవ్వించబోతున్నాడు. అయితే ఇందులో నీ అక్క అనే ఓ డైలాగు శ్రీవిష్ణు నోటి వెంట వచ్చింది. దీనిని ప్రస్తావిస్తూ ఓ రిపోర్టర్.. గతంలో శివయ్య అనే డైలాగు వివాదాస్పదమైంది.. మరి ఇందులో నీ అక్క అని అనడాన్ని ఎలా సమర్థించుకుంటారు అని అడిగారు. దీనికి శ్రీవిష్ణు స్పందిస్తూ.. నీ అక్క అని అన్నాను.. వదిననే కదా అన్నాను అంటూ పక్కనే ఉన్న నయన్ సారికను చూపించాడు. అది విని అక్కడి అభిమానులు అరిచారు.
ఆ రెండు సినిమాలు ఒకేసారి రావట..
శ్రీవిష్ణు ఇప్పుడు విష్ణు విన్యాసం ఒక్కటే కాదు.. మృత్యుంజయ అనే మరో మూవీ కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కానున్నాయన్న వార్తల నేపథ్యంలో దీనిపై శ్రీవిష్ణు స్పందించాడు. ఆ పెను ప్రమాదం తప్పిందని, దీనిపై రేపు (గురువారం) అనౌన్స్ చేస్తానని చెప్పాడు. ఒకే రోజు కాదు.. ఒకే వారంలో కూడా ఆ సినిమాలు రావడం లేదని అతడు స్పష్టం చేశాడు.
అది హుక్ స్టెప్పు కాదు..
ఇక విష్ణు విన్యాసం సినిమాలో తాను వేసిన హుక్ స్టెప్ గురించి ప్రశ్నించగా.. శ్రీవిష్ణు ఫన్నీగా సమాధానమిచ్చాడు. అది హుక్ స్టెప్ కాదని, ఆశీర్వాదమని, అది సినిమా చూస్తే మీకే తెలుస్తుందని అనడం విశేషం.
చివరి 10 నిమిషాలు అందరికీ నచ్చుతుంది..
{{/usCountry}}ఇక విష్ణు విన్యాసం సినిమాలో తాను వేసిన హుక్ స్టెప్ గురించి ప్రశ్నించగా.. శ్రీవిష్ణు ఫన్నీగా సమాధానమిచ్చాడు. అది హుక్ స్టెప్ కాదని, ఆశీర్వాదమని, అది సినిమా చూస్తే మీకే తెలుస్తుందని అనడం విశేషం.
చివరి 10 నిమిషాలు అందరికీ నచ్చుతుంది..
{{/usCountry}}విష్ణు విన్యాసం సినిమా గురించి శ్రీవిష్ణు మాట్లాడాడు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కుర్రాళ్లకు బాగా నచ్చుతుందని చెప్పాడు. ఇక సెకండాఫ్ ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చుతుందని అన్నాడు. చివరి 10 నిమిషాలు మాత్రం అటు కుర్రాళ్లకి, ఇటు ఫ్యామిలీ అందరికీ నచ్చుతుందని స్పష్టం చేశాడు.
విష్ణు విన్యాసం సినిమాను యదునాథ్ మారుతి డైరెక్ట్ చేశాడు. అతనికి ఇదే తొలి సినిమా. ఇందులో ఆయ్, క మూవీ ఫేమ్ నయన్ సారిక ఫిమేల్ లీడ్ గా నటించింది. సుమంత నాయుడు జి నిర్మించాడు. ఒంగోలు బ్యాక్‌డ్రాప్ లో సాగే ఈ సినిమాకు రాధన్ మ్యూజిక్ అందించాడు.