Jana Nayagan: దళపతి విజ‌య్‌కు మ‌రో షాక్‌.. జ‌న నాయ‌గ‌న్ సీన్లు లీక్‌.. భ‌గ‌వంత్ కేస‌రిలాగే ఉందంటూ.. షేర్ చేస్తే అరెస్ట్‌

Jana Nayagan: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కు మరో షాక్ తగిలింది. అతని లాస్ట్ మూవీ ‘జన నాయగన్’ మూవీ సీన్లు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీనిపై ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. అయితే కొంతమంది మాత్రం ఈ వీడియో క్లిప్ ను షేర్ చేస్తూ భగవంత్ కేసరి మూవీలో ఉందంటున్నారు. 

Published on: Apr 10, 2026, 05:52:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళ చిత్ర పరిశ్రమలో తిరుగులేని మాస్ ఫాలోయింగ్ ఉన్న నటుడు, తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ వ్యవస్థాపకుడు దళపతి విజయ్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. రాజకీయాల్లోకి వెళ్లేముందు అతను నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ నుంచి కొన్ని సీన్లు సోషల్ మీడియాలో లీక్ కావడం హాట్ టాపిక్ గా మారింది.

ఆన్ లైన్ లో జన నాయగన్ లీక్
ఆన్ లైన్ లో జన నాయగన్ లీక్

జన నాయగన్ లీక్

దళపతి విజయ్ హీరోగా నటించిన జన నాయగన్ మూవీ గురించి ఇప్పుడు కోలీవుడ్‌లో పెను సంచలనం రేగుతోంది. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెన్సార్ బోర్డు (CBFC) నుంచి సర్టిఫికేషన్ కోసం వేచి చూస్తున్న తరుణంలో, సినిమాకు సంబంధించిన కీలక దృశ్యాలు ఆన్‌లైన్‌లో లీక్ కావడం యూనిట్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

వీడియో వైరల్

జన నాయగన్ సినిమాలోని దాదాపు ఐదు నిమిషాల ముప్పై ఒక్క సెకన్ల నిడివి గల వీడియో ప్రస్తుతం ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో.. సినిమా టెస్ట్ స్క్రీనింగ్ సమయంలో థియేటర్ లోపల చిత్రీకరించినట్లుగా స్పష్టమవుతోంది. ఇందులో విజయ్ ఇంట్రడక్షన్ సీన్, భారీ ఫైట్ సీక్వెన్స్‌తో పాటు సినిమా టైటిల్ కార్డ్ కూడా ఉండటం గమనార్హం. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

భగవంత్ కేసరితో

ముఖ్యంగా విజయ్ లుక్, యాక్షన్ సీక్వెన్స్ చూస్తుంటే అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమాను తలపిస్తోందని కొందరు పోలికలు పెడుతున్నారు. కేవలం ఈ ఐదు నిమిషాల వీడియో మాత్రమే కాకుండా, సినిమాలోని ఇతర కీలక దృశ్యాలు కూడా లీక్ అయినట్లు సమాచారం.

‘దళపతి కచేరీ’ సాంగ్‌తో పాటు, సినిమాలో ఉన్న సర్ ప్రైజ్ క్యామియో దృశ్యాలు కూడా ల్యాప్‌టాప్ నుంచి రికార్డ్ చేసి లీక్ చేసినట్లు తెలుస్తోంది. ఎక్స్, యూట్యూబ్, రెడ్డిట్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఈ వీడియోలు ప్రత్యక్షం కావడంతో చిత్ర బృందం ఒక్కసారిగా అప్రమత్తమైంది. కొన్ని వీడియోలను ఇప్పటికే తొలగించినప్పటికీ, అప్పటికే అవి వేల సంఖ్యలో షేర్ అయ్యాయి.

ఫ్యాన్స్ ఫైర్

ఈ ఘటనపై నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. అయితే విజయ్ అభిమానులు మాత్రం ఈ లీకేజీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. లీక్ చేసిన వారిపై, వాటిని షేర్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

"జన నాయగన్ కంటెంట్‌ను షేర్ చేసే వారిపై కఠినమైన చర్యలు ఉంటాయి. ఇలాంటి ఉల్లంఘనలను సీరియస్‌గా తీసుకుంటాం, అవసరమైతే అరెస్టు కూడా చేస్తారు. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు’’ అని కూడా జరుగుతాయి" అని విజయ్ టీమ్ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించింది.

హాట్ టాపిక్ గా

విజయ్ రాజకీయ రంగప్రవేశం వేళ వరుసగా షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి జన నాయగన్ రిలీజ్ కావాల్సింది. కానీ సెన్సార్ ఆలస్యం కారణంగా ఇంకా విడుదల చేయలేదు. మరోవైపు అతని భార్య సంగీత విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించింది. మరోవైపు హీరోయిన్ త్రిష, విజయ్ మధ్య అక్రమ సంబంధం ఉందనే వార్తలు వస్తున్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More