ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తున్న ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రంలో రణ్‌వీర్ సింగ్‌తో పాటు మరో నటుడి పేరు మారుమోగిపోతోంది. ఆయనే ఉదయ్‌బీర్ సంధు. ధురంధర్ 2 సినిమాలో ఆయన కనిపించేది కొన్ని నిమిషాలే అయినా, ‘పిండా’ అనే పాత్రలో తనదైన ముద్ర వేశారు.

ముఖ్యంగా రణ్‌వీర్ సింగ్ పోషించిన ‘హమ్జా’ పాత్రలోని మరో కోణాన్ని బయటకు తీయడంలో పిండా పాత్ర కీలకంగా మారింది. తాజాగా పింక్‌విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉదయ్‌బీర్ తన సినీ ప్రయాణం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
పదేళ్ల నిరీక్షణ.. వేల ఆడిషన్లు!
సినిమా రంగంలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని వ్యక్తికి ఒక మంచి బ్రేక్ రావడం ఎంత కష్టమో ఉదయ్‌బీర్ మాటల్లో వినిపించింది. "నేను ఈ రంగంలోకి వచ్చి పదేళ్లు అవుతోంది. ఢిల్లీలో మోడల్‌గా ప్రయాణం మొదలుపెట్టి, ఆ తర్వాత ముంబైకి మారాను. కెమెరా ముందు ఎలా ఉండాలో నేర్చుకోవడానికి ఎన్నో యాడ్ ఫిల్మ్స్ చేశాను. టీవీ సీరియల్స్, సినిమాలు, ఓటీటీ వెబ్ సిరీస్‌ల కోసం నేను ఎన్ని వేల ఆడిషన్లు ఇచ్చానో నాకే తెలియదు" అని ఉదయ్‌బీర్ సంధు గుర్తు చేసుకున్నారు.
ఇండస్ట్రీలోకి రావడం గురించి చెబుతూ.. "బయట నుంచి వచ్చే వారికి ఇక్కడ అవకాశం దక్కడం చాలా కష్టం. ఆ చిన్న తలుపు ఎప్పుడు తెరుచుకుంటుందా, మనం ఎప్పుడు లోపలికి వెళ్తామా అని ఏళ్ల తరబడి వేచి చూడాలి. ఆ ఎదురుచూపులకే చాలా సమయం పడుతుంది" అని తన ఆవేదనను పంచుకున్నారు ఉదయ్‌బీర్.
"ఇల్లు గుర్తుకు రాలేదా జస్సీ?"
ధురంధర్ 2 ఇంటర్వెల్లో రణ్‌వీర్ సింగ్, ఉదయ్‌బీర్ మధ్య జరిగే ఘర్షణ సన్నివేశం థియేటర్లలో ఈలలు వేయిస్తోంది. పాకిస్థాన్‌లో గూఢచారిగా తన గుర్తింపును దాచుకోవడానికి హమ్జా ప్రయత్నిస్తున్నప్పుడు అతడి పాత స్నేహితుడైన పిండా ఎదురవుతాడు.
{{/usCountry}}ధురంధర్ 2 ఇంటర్వెల్లో రణ్‌వీర్ సింగ్, ఉదయ్‌బీర్ మధ్య జరిగే ఘర్షణ సన్నివేశం థియేటర్లలో ఈలలు వేయిస్తోంది. పాకిస్థాన్‌లో గూఢచారిగా తన గుర్తింపును దాచుకోవడానికి హమ్జా ప్రయత్నిస్తున్నప్పుడు అతడి పాత స్నేహితుడైన పిండా ఎదురవుతాడు.
{{/usCountry}}ఆ సమయంలో ఉదయ్‌బీర్ చెప్పే "ఘర్ దీ యాద్ నహీ ఆయీ తుఝే, జస్సీ?" (నీకు ఇల్లు గుర్తుకు రాలేదా జస్సీ?) అనే డైలాగ్ అందరిని షాక్‌కు గుర్తు చేస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ డైలాగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ డైలాగ్‌తో సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వస్తున్నాయి.
పదేళ్ల నిరీక్షణకు గుర్తింపు
ఈ ఒక్క సీన్‌తో ఉదయ్‌బీర్ స్క్రీన్ ప్రెజెన్స్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఒక్క సీన్‌తోనే ఉదయ్‌బీర్ సంధుకు ఎనలేని గుర్తింపు వస్తోంది. పదేళ్ల నిరీక్షణ, వేల ఆడిషన్స్ ఇచ్చిన కష్టానికి ఇది తగిన ప్రతిఫలంగా మారింది.
రికార్డుల వేటలో ‘ధురంధర్ 2’
గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ‘ధురంధర్’ మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘ధురంధర్ 2’ జస్కీరాంత్ సింగ్ రంగీ ఎలా హమ్జా అలీ మజారీగా మారాడు అనే బ్యాక్‌స్టోరీతో అలరిస్తోంది.
ప్రతి ఒక్కరికీ గుర్తింపు
రణ్‌వీర్ సింగ్‌తో పాటు ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, రాకేష్ బేడీ, సారా అర్జున్ వంటి దిగ్గజ తారాగణం ఈ సినిమాలో నటించింది. వీరందరికి తమ పాత్రలతో మంచి గుర్తింపు వస్తోంది.