'హ్యాపీ డేస్' హీరో వరుణ్ సందేశ్ తొలిసారిగా డిజిటల్ ఎంట్రీ ఇస్తూ 'నయనం' (Nayanam) అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఎప్పుడూ లవర్ బాయ్ పాత్రల్లో కనిపించే వరుణ్.. ఇందులో ఇతరుల జీవితాల్లోకి తొంగిచూసి, నేరాలు చేసే ఒక క్రేజీ డాక్టర్‌గా కనిపించబోతున్నాడు. ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ డిసెంబర్ 19న జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
నయనం వెబ్ సిరీస్ గురించి..

టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ తన ఇమేజ్‌ను పూర్తిగా మార్చుకునే పనిలో పడ్డాడు. పక్కింటి కుర్రాడి పాత్రలకు గుడ్ బై చెప్పి.. వెన్నులో వణుకు పుట్టించే 'సైకో డాక్టర్' పాత్రతో ఓటీటీలోకి అడుగుపెడుతున్నాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన న్యూ ఏజ్ థ్రిల్లర్ 'నయనం'. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 19 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
వరుణ్ సందేశ్ ఏమన్నాడంటే?
ఈ నయనం వెబ్ సిరీస్‌లో తన పాత్ర గురించి వరుణ్ సందేశ్ మాట్లాడాడు. "దర్శకురాలు కథ చెప్పినప్పుడు.. నన్నే ఎందుకు ఎంచుకున్నారా అని ఆశ్చర్యపోయాను. కానీ స్క్రిప్ట్ చదివాక.. నాలోని నటుడిని బయటకు తెచ్చే ప్రాజెక్ట్ ఇదే అనిపించింది. ప్రేక్షకులు నన్ను ఇంతకు ముందెప్పుడూ చూడని అవతారంలో చూస్తారు" అని చెప్పాడు.
ఇందులో వరుణ్ సందేశ్ డాక్టర్ నయన్‌గా కనిపిస్తాడు. పేదవాళ్లకు కంటి ఆపరేషన్ చేసి లెన్సులు అమరుస్తాడు. అయితే ఆ లెన్సుల ద్వారా వారి జీవితాలను చూస్తూ అమాయకులను చంపేసే ఒక శాడిస్ట్ డాక్టర్ పాత్ర ఇది.
ఇలాంటి ఇంటెన్స్ పాత్ర చేయడం చాలా కష్టమైందని, మానసికంగా తనపై ప్రభావం చూపిందని వరుణ్ తెలిపాడు. డాక్టర్ నయన్ మైండ్‌సెట్‌ను అర్థం చేసుకోవడానికి తనకు కొంత సమయం పట్టిందని అన్నాడు.
{{/usCountry}}ఇలాంటి ఇంటెన్స్ పాత్ర చేయడం చాలా కష్టమైందని, మానసికంగా తనపై ప్రభావం చూపిందని వరుణ్ తెలిపాడు. డాక్టర్ నయన్ మైండ్‌సెట్‌ను అర్థం చేసుకోవడానికి తనకు కొంత సమయం పట్టిందని అన్నాడు.
{{/usCountry}}స్వాతి ప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మొత్తం ఆరు ఎపిసోడ్లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్, ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ ప్రేక్షకులను సీట్లకు అతుక్కుపోయేలా చేస్తుందని వరుణ్ ధీమా వ్యక్తం చేశాడు.
నయనం వెబ్ సిరీస్ స్టోరీ, నటీనటులు
స్వాతి ప్రకాష్ దర్శకత్వం వహించిన నయనం వెబ్ సిరీస్ లో మొత్తం 6 ఎపిసోడ్లు ఉంటాయి. బిగ్ బాస్ 8 ఫేమ్ ప్రియాంక జైన్ ఇందులో ఫిమేల్ లీడ్‌గా నటించింది. ఆమె పాత్ర కథలో చాలా కీలకం. వీళ్లే కాకుండా ఉత్తేజ్, అలీ రెజా, రేఖ నిరోషా, హరీష్ ముఖ్య పాత్రల్లో నటించారు.
లవర్ బాయ్ పాత్రలే చేస్తాడనుకునే వారికి ఈ సిరీస్ ఒక సర్ప్రైజ్ అని, క్లైమాక్స్ ఎపిసోడ్ అదిరిపోతుందని వరుణ్ ధీమా వ్యక్తం చేశాడు. వరుస పరాజయాల్లో ఉన్న వరుణ్ సందేశ్‌కు ఈ సిరీస్ బ్రేక్ ఇస్తుందేమో చూడాలి. ఈ శుక్రవారం (డిసెంబర్ 19) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.