ఇండియాలో అత్యంత ఫిట్‌గా ఉండే హీరోల్లో ఒకరైన విద్యుత్ జామ్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కేరళకు చెందిన పురాతన యుద్ధ విద్య ‘కలరిపయట్టు’లో (Kalaripayattu) అతడు దిట్ట. తరచుగా సాహసోపేతమైన విన్యాసాలతో అభిమానులను ఆశ్చర్యపరిచే విద్యుత్.. తాజాగా శనివారం (జనవరి 10) ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో చూసి జనం షాక్ అవుతున్నారు. ఇందులో అతడు న్యూడ్ గా చెట్టు ఎక్కుతూ కనిపించాడు.
నగ్నంగా విద్యుత్.. అసలేంటీ ‘సహజ’ ప్రక్రియ?

ఆ వీడియోలో విద్యుత్ జామ్వాల్ చకచకా చెట్టు పైకి ఎక్కడం చూడవచ్చు. అయితే వెనుక భాగం కనిపించకుండా ఒక ‘దిష్టి బొమ్మ’ ఎమోజీని అడ్డుగా పెట్టాడు. దీనిపై విద్యుత్ వివరణ ఇస్తూ.. "కలరిపయట్టు సాధకుడిగా, నేను ఏడాదికి ఒకసారి ‘సహజ’ (Sahaja) అనే యోగ ప్రక్రియను ఆచరిస్తాను. సహజ అంటే మన సహజసిద్ధమైన స్థితికి, ప్రవృత్తికి దగ్గరగా వెళ్లడం. ఇది ప్రకృతితో, మన అంతరాత్మతో మమేకమయ్యేలా చేస్తుంది" అని పేర్కొన్నాడు. శాస్త్రీయంగా ఇది నాఢీ వ్యవస్థను ఉత్తేజితం చేస్తుందని, శరీర సమతుల్యతను, ఏకాగ్రతను పెంచుతుందని అతడు చెప్పుకొచ్చాడు.
టార్జాన్ కూడా ఆకులు కట్టుకుంటాడు కదా!
విద్యుత్ చెప్పిన ‘సైన్స్’ ఎలా ఉన్నా, నెటిజన్లు మాత్రం ఈ వీడియో చూసి నోరెళ్లబెడుతున్నారు. కామెంట్ సెక్షన్‌లో మీమ్స్, సెటైర్లు పేలుతున్నాయి. "చెట్టు ఎక్కడానికి బట్టలు విప్పాల్సిన అవసరం ఏముంది?" అని ఒకరు ప్రశ్నిస్తే.. "అడవిలో టార్జాన్ కూడా కనీసం ఆకులైనా చుట్టుకుంటాడు.. కానీ నువ్వు వేరు సామి, మాహానుభావుడివి" అని మరొకరు చమత్కరించారు. ఇంకొందరు మాత్రం "మీ కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు బాస్" అంటూ మెచ్చుకుంటున్నారు.
బాక్సాఫీస్ వద్ద జోరు.. హాలీవుడ్ ఎంట్రీ
ఇక విద్యుత్ జామ్వాల్ సినిమాల విషయానికి వస్తే.. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘మదరాసి’ (Madharaasi) సినిమాతో విద్యుత్ ఇటీవల భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇండియాలో ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే రూ. 44 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.
{{/usCountry}}ఇక విద్యుత్ జామ్వాల్ సినిమాల విషయానికి వస్తే.. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘మదరాసి’ (Madharaasi) సినిమాతో విద్యుత్ ఇటీవల భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇండియాలో ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే రూ. 44 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.
{{/usCountry}}త్వరలోనే విద్యుత్ హాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నాడు. ప్రముఖ వీడియో గేమ్ ఆధారంగా తెరకెక్కుతున్న ‘స్ట్రీట్ ఫైటర్’ (Street Fighter) రీబూట్‌లో అతడు యోగి ‘ధల్సిమ్’ పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీలో ‘ఆక్వామ్యాన్’ ఫేమ్ జాసన్ మోమోవా వంటి హాలీవుడ్ ప్రముఖులు కూడా నటిస్తుండటం విశేషం.