Akanksha Puri: నీట్ నిరసనలో పాల్గొనేందుకు భారీగా డబ్బు ఆఫర్, ఫ్లైట్ టికెట్స్‌తోపాటు- సీరియల్ నటి ఆకాంక్ష ఆరోపణలు

Akanksha Puri On Neet Protest Paid Campaign: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన నీట్ (NEET) పేపర్ లీక్ నిరసనల వెనుక పెయిడ్ ప్రచారం నడుస్తోందని ప్రముఖ సీరియల్ నటి, బిగ్ బాస్ బ్యూటీ ఆకాంక్ష పూరి సంచలన ఆరోపణలు చేశారు. నిరసనలో పాల్గొని రీల్స్ చేయడానికి తనకు డబ్బులు, ఫ్లైట్ టికెట్లు ఆఫర్ చేశారని బయటపెట్టారు.

Published on: Jul 26, 2026, 10:54:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Akanksha Puri On Neet Protest Paid Campaign: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ వివాదంపై దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ఆందోళనలు మిన్నంటాయి.

నీట్ నిరసనలో పాల్గొనేందుకు భారీగా డబ్బు ఆఫర్, ఫ్లైట్ టికెట్స్‌తోపాటు- సీరియల్ నటి ఆకాంక్ష ఆరోపణలు
నీట్ నిరసనలో పాల్గొనేందుకు భారీగా డబ్బు ఆఫర్, ఫ్లైట్ టికెట్స్‌తోపాటు- సీరియల్ నటి ఆకాంక్ష ఆరోపణలు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తాజాగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ నేపథ్యంలో ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలపడం వెనుక పెయిడ్ క్యాంపైన్లు నడిచాయనే వార్త తీవ్ర దుమారం రేపుతోంది.

భారీగా ఆఫర్లు ఇచ్చారని ఆరోపణలు

దేశవ్యాప్తంగా వైద్య విద్యను అభ్యసించాలనుకునే వేలాది మంది విద్యార్థులు ఈ పరీక్ష అక్రమాల వల్ల తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో ఢిల్లీలో విద్యార్థులు చేసిన పోరాటానికి పలువురు మద్దతుగా నిలిచారు. అయితే, ఈ నిరసనకు మద్దతుగా ప్రచారం చేసేందుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, సినీ ప్రముఖులకు భారీగా ఆఫర్లు ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఆకాంక్ష పూరి సంచలన ఆరోపణలు

ఈ అంశంపై బిగ్ బాస్ ఫేమ్, సీరియల్ నటి ఆకాంక్ష పూరి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జంతర్ మంతర్ వద్ద 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) పేరిట జరుగుతున్న నిరసనకు మద్దతుగా రీల్స్ చేయడానికి, ఆందోళనలో పాల్గొనడానికి తనకు విమాన టికెట్లు, హోటల్ వసతితో పాటు భారీగా డబ్బులు ఆఫర్ చేశారని ఆమె ఆరోపించారు.

ఉచిత ఫ్లైట్ టికెట్లు, డబ్బులు

"నాకే కాకుండా చాలామంది డిజిటల్ క్రియేటర్లకు ఇలాంటి ఆఫర్లు వచ్చాయి. నిరసనకు రావడం కోసం ఉచిత ఫ్లైట్ టికెట్లు, డబ్బులు ఇస్తామన్నారు. కానీ, నేను ఆ ఆఫర్‌ను తిరస్కరించాను. నిజాయితీగా పోరాడుతున్న విద్యార్థులకు మనస్ఫూర్తిగా మద్దతు ఇవ్వాలి తప్ప, దీనిని ప్రచార సాధనంగా వాడుకోకూడదు" అని ఆకాంక్ష పూరి స్పష్టం చేశారు.

విద్యార్థుల ఆవేదనను బిజినెస్ చేయకండి!

లక్షలాది మంది విద్యార్థులు తమ జీవితాల కోసం రోడ్డెక్కి పోరాడుతుంటే, కొందరు దీనిని వ్యూస్, కంటెంట్ క్రియేషన్ కోసం వాడుకోవడం దారుణమని ఆకాంక్ష పూరి మండిపడ్డారు. విద్యార్థుల ఆవేదనను మార్కెటింగ్ అవకాశంగా మలుచుకోవద్దని హితవు పలికారు.

గుండె తరుక్కుపోతుంది

"యువ విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకోవడం, పోలీసుల లాఠీఛార్జ్‌లో గాయపడటం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. మన దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులు తమ హక్కుల కోసం గళం విప్పుతున్నారు. రాజకీయ నాయకులు కూడా దీనిని పబ్లిసిటీ కోసం వాడుకోవద్దు. ప్రచారాల కంటే ముందు విద్యార్థుల సమస్యలను వినండి, వారికి న్యాయం చేయండి" అని ఆకాంక్ష పూరి రెండ్రోజుల క్రితం విజ్ఞప్తి చేశారు.

ఓటీటీ సినిమాలు, సిరీసులు

ఇదిలా ఉంటే, ఓటీటీ సిరీసులు, సినిమాలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది బ్యూటిఫుల్ ఆకాంక్ష పూరి.

డివోషనల్ సీరియల్స్

హనీ ట్రాప్ స్క్వాడ్, క్యాలెండర్ గర్ల్స్, ఇన్‌స్పెక్టర్ అవినాష్, విశాల్ యాక్షన్, సోలాంగ్ వాలీ వంటి సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటించింది ఆకాంక్ష. అలాగే, డివోషనల్ సీరియల్స్ శ్రీ గణేష్, విజ్ఞభారత గణేష్‌లో నటించి మెప్పించింది ఆకాంక్ష పూరి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More