Sonakshi Sinha: మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. సంతోషంతో గంతులేసిన హీరోయిన్ సోనాక్షి సిన్హా.. జెన్-జీకి క్షమాపణలు!
Sonakshi Sinha Dharmendra Pradhan: నీట్ పరీక్షల అక్రమాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన ఉపాధ్యాయ, యువజన ఉద్యమం ఊహించని మలుపు తిరిగింది. తీవ్ర ఒత్తిడి నడుమ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగా, ఈ విజయాన్ని కొనియాడుతూ హీరోయిన్ సోనాక్షి సిన్హా విద్యార్థులకు సెల్యూట్ చేశారు.
Sonakshi Sinha Video On Dharmendra Pradhan Resigns: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ ప్రవేశ పరీక్షల అక్రమాల వ్యవహారం కేంద్ర ప్రభుత్వం వద్ద తీవ్ర కలకలం రేపింది. కొద్దివారాలుగా దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత చేపట్టిన పోరాటానికి లొంగి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం (జూలై 25) తన పదవికి రాజీనామా చేశారు.

సోనాక్షి సిన్హా వీడియో వైరల్
పరీక్షల నిర్వహణలో దొర్లిన తప్పులకు, ఆరోపణలకు బాధ్యత వహిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామంపై దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థి లోకం, సామాజిక వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పోరాటానికి మొదటి నుంచి మద్దతుగా నిలుస్తున్న బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఒక వీడియో ఇప్పుడు నెట్టింట తీవ్రంగా వైరల్ అవుతోంది.
"మిమ్మల్ని తక్కువగా అంచనా వేశా": జెన్-జీపై సోనాక్షి కామెంట్స్
రాజీనామా వార్త వెలువడిన వెంటనే సోనాక్షి సిన్హా ఒక సరదా వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆమె సంతోషంగా గంతులేయడం, గుంజీలు తీస్తూ (సిట్-అప్స్) నేటి యువతకు (Gen-Z) క్షమాపణలు చెప్పారు.
"మీరు ఈ రోజు సాధించిన విజయం నిజంగా అద్భుతం. నిజం చెప్పాలంటే నేను జెన్-జీ యువతను చాలా తేలిగ్గా తీసుకున్నాను. ఏదో ఆవేశంలో వచ్చి వీధుల్లోకి దిగుతారు, కాసేపటికి అలసిపోయి వెనక్కి తగ్గుతారు అని భావించాను. కానీ మీ పట్టుదల, పోరాట పటిమ నా అంచనాలను తలకిందులు చేశాయి. మీకు నా హృదయపూర్వక సెల్యూట్. నేను కూడా మీలాగే జెన్-జీగా మారిపోవాలని అనుకుంటున్నాను" అని సోనాక్షి సిన్హా హర్షం వ్యక్తం చేశారు.
గతంలో లడఖ్ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన సోనాక్షి, జూలై 20న సంసద్ మార్చ్ సందర్భంగా విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగాన్ని కూడా తీవ్రంగా ఖండించారు.
రాజీనామాకు దారితీసిన పరిస్థితులు
మే 3, 2026న జరిగిన నీట్-యూజీ పరీక్షలో పెద్ద ఎత్తున అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు జరిగాయంటూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. విద్యాశాఖ మంత్రి తక్షణమే దిగిపోవాలని డిమాండ్ చేశాయి. జూలై 16న ఫలితాలు వెలువడినప్పటికీ విద్యార్థుల నిరసనలు ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపిన రాజీనామా లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ పలు కీలక విషయాలను వెల్లడించారు.
"దేశ విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడం, యువతకు సేవ చేయడమే నా జీవిత లక్ష్యం. నీట్-యూజీ పరీక్షలో జరిగిన అక్రమాలపై ఇప్పటికే సీబీఐ (CBI) విచారణకు ఆదేశించాం. వివాదాస్పద పరీక్షను రద్దు చేసి, తిరిగీ నిర్వహించేందుకు చర్యలు చేపట్టాం. వచ్చే ఏడాది నుంచి ఈ పరీక్షను పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) మోడ్‌లోకి మారుస్తున్నాం" అని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం
పరీక్షల మాఫియా కారణంగా ఏ ఒక్క ప్రతిభావంతుడైన విద్యార్థి నష్టపోకూడదనే ఉద్దేశంతోనే తాను మొదటి నుంచి బాధ్యత వహించానని ప్రధాన్ పేర్కొన్నారు. బాధితులైన దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా రీ-ఎగ్జామ్ రాసేలా వాతావరణం కల్పించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు.
అయితే కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థులను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించడం తనకు తీవ్ర మనస్తాపం కలిగించిందని, ఈ వివాదం మరింత పెరగకూడదనే ఉద్దేశంతోనే తప్పుకుంటున్నట్లు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


