సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై, ముఖ్యంగా హీరోయిన్లు, ఇతర నటీమణులపై జరుగుతున్న ఆన్‌లైన్ దాడులు, వేధింపులు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. తాజాగా తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బకు ఇటువంటి చేదు అనుభవం ఎదురైంది. తన పట్ల ఆన్‌లైన్‌లో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ఆమె హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది.
అసలేం జరిగింది?

ఏఎన్ఐ (ANI) వార్తా సంస్థ సమాచారం ప్రకారం.. ఈషా రెబ్బ ఇటీవల తన సినిమా ఓం శాంతి శాంతి శాంతి: ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఒక సోషల్ మీడియా/మీమ్ పేజీలో ఒక వ్యక్తి తన పట్ల అత్యంత జుగుప్సాకరమైన, లైంగిక వేధింపులకు గురిచేసేలా, పరువు నష్టం కలిగించేలా ఒక కామెంట్ పోస్ట్ చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
మానసిక క్షోభ.. ఆత్మగౌరవం దెబ్బతీసేలా..
సదరు వ్యక్తి ఉపయోగించిన భాష చాలా అభ్యంతరకరంగా ఉందని, ఇది తనను మానసికంగా తీవ్ర వేదనకు గురిచేసిందని ఈషా ఆవేదన వ్యక్తం చేసింది. ఒక మహిళగా తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా, బహిరంగంగా తనను అవమానించడమే లక్ష్యంగా ఇదంతా జరిగినట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చెప్పింది. ఈ ఘటన తనను తీవ్ర ఆందోళనకు గురిచేసిందని ఆమె తెలిపింది.
ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ విషయంపై ఈషా రెబ్బ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఓం శాంతి శాంతి శాంతి: సినిమా విశేషాలు
ఈషా రెబ్బ ఇటీవల 'ఓం శాంతి శాంతి శాంతి:' అనే తెలుగు మూవీలో నటించింది. మలయాళంలో దర్శన రాజేంద్రన్, బేసిల్ జోసెఫ్ నటించిన సూపర్ హిట్ మూవీ 'జయ జయ జయ జయ హే'కు ఇది అధికారిక రీమేక్. ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఈషా రెబ్బ సరసన తరుణ్ భాస్కర్ హీరోగా నటించాడు. ఈ సినిమా ప్రమోషన్ల నేపథ్యంలోనే ఈషా వేధింపులకు గురైంది.
{{/usCountry}}ఈషా రెబ్బ ఇటీవల 'ఓం శాంతి శాంతి శాంతి:' అనే తెలుగు మూవీలో నటించింది. మలయాళంలో దర్శన రాజేంద్రన్, బేసిల్ జోసెఫ్ నటించిన సూపర్ హిట్ మూవీ 'జయ జయ జయ జయ హే'కు ఇది అధికారిక రీమేక్. ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఈషా రెబ్బ సరసన తరుణ్ భాస్కర్ హీరోగా నటించాడు. ఈ సినిమా ప్రమోషన్ల నేపథ్యంలోనే ఈషా వేధింపులకు గురైంది.
{{/usCountry}}ఇక తరుణ్ భాస్కర్ తో పెళ్లి అంటూ కూడా ఈషా రెబ్బ ఈ మధ్య వార్తల్లో నిలిచింది. ఈ వార్తలను ఈ ఇద్దరూ ఇప్పటి వరకూ కన్ఫమ్ చేయలేదు. అయితే సరైన సమయం వచ్చినప్పుడు చెబుతానని తరుణ్ చెప్పగా.. అలాంటిదేమీ లేదని ఈషా అనడం విశేషం.